India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇటీవల యూపీలోని బహ్రైచ్‌లో నరభక్షక తోడేళ్లు ఎనిమిది మందిని చంపాయి. కాగా తోడేళ్లు తమకు, తమ పిల్లలకు హాని చేసినవారిపై ప్రతీకారం తీర్చుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. గతంలో బహ్రైచ్‌లో రెండు తోడేళ్ల పిల్లలు ట్రాక్టర్ ఢీకొట్టడంతో చనిపోయాయి. అప్పటినుంచి అవి ప్రతీకారంతో రగిలిపోతూ కనిపించిన ప్రజలపై దాడులు చేస్తున్నాయి. కొన్ని తోడేళ్లను దూరంగా వదిలిపెట్టినా తిరిగి అక్కడికి చేరుకుంటున్నాయని తెలుస్తోంది.
రవితేజ, హరీశ్ శంకర్ కాంబోలో తెరకెక్కిన ‘మిస్టర్ బచ్చన్’ బాక్సాఫీస్ వద్ద చతికిలబడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ సినిమా నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌కు హరీశ్ రూ. 2 కోట్లు వెనక్కిచ్చినట్లు తెలుస్తోంది. సినిమాకు ఆయన రూ.8 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. గత నెల 15న విడుదలైన ‘మిస్టర్ బచ్చన్’ తొలి ఆట నుంచే మిక్స్‌డ్ టాక్‌తో డిజాస్టర్‌గా నిలిచింది. సోషల్ మీడియాలోనూ విపరీతంగా ట్రోలింగ్‌కు గురైంది.
కోల్‌కతా CBI ఆఫీస్ ముందు కాంగ్రెస్ కార్యకర్తలు కొందరు ధర్నా చేశారు. ఆర్జీకర్ వైద్యురాలి హత్యాచారం కేసును వేగంగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. దోషుల్ని వెంటనే అరెస్టు చేయాలన్నారు. ఏజేసీ రోడ్డును బ్లాక్ చేసి టైర్లను తగలబెట్టారు. ‘TMC, BJP మధ్య పరోక్ష అవగాహన కుదిరింది. దర్యాప్తును TMC తప్పుదారి పట్టిస్తే ఊరుకోం’ అని కాంగ్రెస్ నేత సంతోష్ పాఠక్ అన్నారు. ఈ ధర్నాకు పార్టీ మద్దతు లేదని PCC తెలిపింది.
TGలో మరోసారి వర్షం బీభత్సం సృష్టించనుందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు 8 గంటల వరకు భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వానలు పడతాయని పేర్కొంది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది.
రీడింగ్ గ్లాసెస్ లేకుండా చదవలేకపోతున్నారా? మీకో గుడ్ న్యూస్. ముంబైకి చెందిన ఎంటోడ్ ఫార్మాస్యూటికల్స్ అభివృద్ధి చేసిన PresVu ఐ డ్రాప్స్‌ను భారత ఔషధ నియంత్రణ ఏజెన్సీ ఆమోదించింది. దీని ద్వారా 40 ఏళ్లు పైబడిన వారు రీడింగ్ గ్లాసెస్ అవసరాన్ని తగ్గించవచ్చు. CDSCOకు చెందిన సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ ఈ ఐడ్రాప్స్‌ను సిఫార్సు చేసింది. వచ్చే నెల నుంచి ఇది అందుబాటులో ఉండనుంది.
నిద్రపోతున్న జాతిని జాగృతం చేసినందుకు తాను అందరికీ లక్ష్యంగా మారానని ఎంపీ కంగనా రనౌత్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఏ పక్కకూ వెళ్లకుండా న్యూట్రల్‌గా ఉండాలనే అందరూ అనుకుంటున్నారు. సరిహద్దుల్లో ఉండే సైనికులకు కూడా న్యూట్రల్‌గా ఉండే అవకాశం ఉంటే బాగుండేది. అక్కడ జవాన్లు మిమ్మల్ని కాపాడుతుంటే ఇక్కడ మీరు దేశద్రోహుల్ని రక్షిస్తున్నారు. నేరస్థులు మీ కోసం వస్తే కానీ మీకు అసలు విషయం అర్థం కాదు’ అని హెచ్చరించారు.
TG: హైదరాబాద్ వ్యాప్తంగా నేటి నుంచి 9వ తేదీ వరకూ భారీ వర్షాలు కురవనున్నాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని GHMC హెచ్చరించింది. ‘వరద ప్రవాహం అధికంగా ఉండటంతో వాగులు, నదుల వద్దకు వెళ్లకండి. నీరు నిలిచి ఉన్న చోట రోడ్లపై మ్యాన్‌హోల్స్‌ను చూసుకోండి. ఎవరూ మ్యాన్‌హోల్ తెరవద్దు. ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలను తాకొద్దు. వాహనాలను వేగంగా నడపొద్దు. ఎమర్జెన్సీలో 040-21111111కి కాల్ చేయండి’ అని తెలిపింది.
తమిళ హీరో విజయ్ తాజా సినిమా ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్(ది గోట్)’పై ఓ ఇంట్రస్టింగ్ అప్‌డేట్ చక్కర్లు కొడుతోంది. ఈ మూవీకి ఆయన రూ.250 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు చెబుతున్నారు. రాజకీయాల్లోకి వెళ్లే ముందు ఆఖరి సినిమా అని ఆయన ప్రకటించడంతో ‘ది గోట్’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో విజయ్ రెండు పాత్రల్లో కనిపించనుండటం విశేషం.
AP: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ ఇంటికి పోలీసులు వెళ్లారు. టీడీపీ ఆఫీస్, చంద్రబాబు నివాసంపై దాడి కేసులో ఆయన బెయిల్ పిటిషన్ <<14019866>>తిరస్కరణకు<<>> గురైంది. దీంతో సురేశ్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. అయితే సురేశ్ ఇంట్లో లేకపోవడంతో పోలీసులు వెనుదిరిగారు.
సంగీత దర్శకుడు తమన్ ట్విటర్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ నెలలో వచ్చే కొత్త అప్‌డేట్‌తో ఫ్యాన్స్‌కు బ్లాస్టేనంటూ పేర్కొన్నారు. ‘సినిమాపై ప్రతికూల ట్రెండ్స్ వ్యాప్తి చేయకండి. అది మూవీని మరింత దెబ్బతీస్తుంది. దీనిపై భారీగా డబ్బు, సమయాన్ని వెచ్చించారు. ఫ్యాన్స్ మాకు పాజిటివ్ ఎనర్జీ ఇవ్వాలి’ అని కోరారు. పేరు చెప్పనప్పటికీ.. గేమ్‌ఛేంజర్‌ను ఉద్దేశించే ఆయన ట్వీట్ చేశారని చరణ్ ఫ్యాన్స్ పేర్కొంటున్నారు.
Sorry, no posts matched your criteria.