News September 4, 2024

తోడేళ్లూ ప్రతీకారం తీర్చుకుంటాయా?

image

ఇటీవల యూపీలోని బహ్రైచ్‌లో నరభక్షక తోడేళ్లు ఎనిమిది మందిని చంపాయి. కాగా తోడేళ్లు తమకు, తమ పిల్లలకు హాని చేసినవారిపై ప్రతీకారం తీర్చుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. గతంలో బహ్రైచ్‌లో రెండు తోడేళ్ల పిల్లలు ట్రాక్టర్ ఢీకొట్టడంతో చనిపోయాయి. అప్పటినుంచి అవి ప్రతీకారంతో రగిలిపోతూ కనిపించిన ప్రజలపై దాడులు చేస్తున్నాయి. కొన్ని తోడేళ్లను దూరంగా వదిలిపెట్టినా తిరిగి అక్కడికి చేరుకుంటున్నాయని తెలుస్తోంది.

Similar News

News September 17, 2024

కాంగ్రెస్ కూడా బ్రిటిష్ వాళ్లలానే: మోదీ

image

బ్రిటిష్ పాలకులకు, కాంగ్రెస్‌కు మధ్య పోలికలున్నాయని ప్రధాని మోదీ విమర్శించారు. భువనేశ్వర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘మన దేశ స్వాతంత్య్రంలో గణేశ్ ఉత్సవం ముఖ్యపాత్ర పోషించింది. విభజించి పాలించే బ్రిటిష్ వారు అప్పట్లో గణేశ్ ఉత్సవాలపై మండిపడ్డారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో గణేశ్ విగ్రహాన్ని కటకటాల వెనుక ఉంచారు. ఇది బాధించింది. ఇలాంటివి జరగనివ్వకూడదు’ అని అన్నారు.

News September 17, 2024

₹10వేల SIPతో ₹67 లక్షల ప్రాఫిట్

image

కెనరా రొబెకో కన్జూమర్ ట్రెండ్స్ ఫండ్ ఇన్వెస్టర్ల ఇంట సిరులు కురిపించింది. ఏటా 18.64% రిటర్న్ ఇచ్చింది. 2009, సెప్టెంబర్లో మొదలైన ఈ ఫండ్‌లో ప్రతి నెలా రూ.10వేలు సిప్ చేసిన వారికి ఇప్పుడు రూ.84.81 లక్షలు చేతికందాయి. అంటే 15 ఏళ్లలో విడతల వారీగా పెట్టిన రూ.18 లక్షలకు రూ.66.81 లక్షల లాభం వచ్చిందన్నమాట. పదేళ్ల క్రితం ఒకేసారి రూ.12 లక్షలు పెట్టుంటే రూ.34.52 లక్షలు అందేవి. కాంపౌండింగ్ పవర్ అంటే ఇదే.

News September 17, 2024

వచ్చే ఏడాది నుంచి CBSE విధానం: TDP

image

AP: ప్రభుత్వ స్కూళ్లలో ‘CBSE రద్దు’ ప్రచారంపై TDP స్పందించింది. ‘CBSE విధానం, అసెస్మెంట్‌కు విద్యార్థులు, టీచర్లను సిద్ధం చేయకుండానే జగన్ 1000 స్కూళ్లలో CBSE ఎగ్జామ్స్ మొదలెట్టాడు. కూటమి ప్రభుత్వం వచ్చాక CBSE అసెస్మెంట్ ప్రకారం పరీక్షలు పెడితే, 64%మంది ఫెయిలయ్యారు. అందుకే ఈ ఏడాది స్టేట్ బోర్డు పరీక్షలు రాసే వెసులుబాటును ఇచ్చారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఆరో తరగతి నుంచే CBSE ఉంటుంది’ అని పేర్కొంది.