News September 4, 2024

వరద బాధితులకు నాగార్జున రూ.కోటి సాయం

image

వరదలతో అతలాకుతలమైన రెండు తెలుగు రాష్ట్రాలకు సినీ హీరో నాగార్జున రూ.కోటి సాయం ప్రకటించారు. వరద బాధితులను ఆదుకునేందుకు ఇరు రాష్ట్రాలకు చెరో రూ.50 లక్షలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు వైజయంతీ మూవీస్ రూ.20 లక్షలు విరాళం ప్రకటించింది. అలాగే కమెడియన్ అలీ ఇరు రాష్ట్రాలకు చెరో రూ.3 లక్షల చొప్పున రూ.6 లక్షలు అందించారు.

News September 4, 2024

అలాంటి వారిని అమరావతిలో పూడ్చాలి: చంద్రబాబు

image

AP: అధికారులను బురదలో దించి పని చేయిస్తుంటే కొంతమంది ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని CM చంద్రబాబు ఫైర్ అయ్యారు. తప్పుడు ప్రచారం చేస్తున్నవారిని అమరావతిలో పూడ్చేయాలని ధ్వజమెత్తారు. ‘బాధితులకు రాజకీయ, సినీ ప్రముఖులు సాయం చేస్తున్నారు. ప్రజలంతా ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. ఇలాంటి సమయంలో అమరావతి మునిగిందని ఫేక్ ప్రచారం చేస్తున్నారు. అలాంటి వారిని సంఘ బహిష్కరణ చేయాలి’ అని మండిపడ్డారు.

News September 4, 2024

పారాలింపిక్స్‌లో ఇండియాకు 21 మెడల్స్

image

పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. తాజాగా షాట్ పుట్‌లో సచిన్‌ ఖిలారి సిల్వర్ మెడల్ సాధించారు. దీంతో 30 ఏళ్లలో పారాలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారత తొలి పురుష షాట్‌పుటర్‌గా సచిన్ నిలిచారు. ఈ పారాలింపిక్స్‌లో భారత్ 21 మెడల్స్ సాధించి టేబుల్‌లో 19వ స్థానానికి చేరింది. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ పారా అథ్లెట్లతో ఫోన్‌లో మాట్లాడి అభినందించారు.

News September 4, 2024

హైడ్రా విషయంలో రేవంత్ కరెక్ట్: పవన్ కళ్యాణ్

image

AP: హైడ్రా ద్వారా అక్రమ నిర్మాణాలను కూల్చడం సమంజసమేనని dy.CM పవన్ కళ్యాణ్ అన్నారు. హైడ్రా ఏర్పాటు చేసి తెలంగాణ CM రేవంత్ రెడ్డి మంచి పని చేశారని ప్రశంసించారు. విజయవాడలో పవన్ మీడియాతో మాట్లాడారు. ‘హైదరాబాద్‌లోని చెరువుల్లో ఇళ్లు కడుతుంటే బాధేసేది. ఇప్పుడు రేవంత్ వాటిని తొలగించడం సంతోషంగా ఉంది. అసలు అక్రమ నిర్మాణాలను ముందే అడ్డుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవు’ అని ఆయన పేర్కొన్నారు.

News September 4, 2024

భారీ వరదలు.. ఇలా విరాళమివ్వండి!

image

TG: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వర్షం కురిసి ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో వరదలు తలెత్తడంతో జనజీవనం స్తంభించింది. వరదల వల్ల రూ.వేల కోట్ల నష్టం వాటిల్లగా ఎన్నో కుటుంబాలు కట్టు బట్టలతో ఇంటిని వదిలేయాల్సి వచ్చింది. ఈక్రమంలో వరద బాధితులకు సాయం చేసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు ముందుకొస్తున్నారు. అయితే, నష్టం భారీ ఎత్తున ఉండటంతో సాయం చేయాలని ప్రజలకు సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. ఇలా <>సాయం<<>> చేయండి.

News September 4, 2024

UKలో పాన్ ఉమ్మిన వారికి రూ.16,500 ఫైన్

image

దేశంలో అద్భుత కట్టడాలను సైతం కొందరు పాన్ పరాక్ ఉమ్ముతూ అపరిశుభ్రంగా తయారుచేస్తున్నారు. అయితే, ఇలాంటి వారు యూకేలోనూ ఉన్నారు. వీరికి భారీగా జరిమానాలు విధించేందుకు అక్కడి పోలీసులు సిద్ధమయ్యారు. లైసెస్టర్ నగరంలో రోడ్లపై పాన్ ఉమ్మడాన్ని అపరిశుభ్రత, అసాంఘిక చర్యగా భావిస్తూ 150 పౌండ్లు (రూ.16,500) ఫైన్ విధిస్తామని బోర్డులు ఏర్పాటు చేశారు. ఇండియాలో ఇలా చేస్తే ఎలా ఉంటుందో కామెంట్ చేయండి.

News September 4, 2024

వరదల్లో 29 మంది చనిపోయారు: పవన్ కళ్యాణ్

image

AP: రాష్ట్రంలో సంభవించిన వరదల్లో 29 మంది మరణించినట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇద్దరు గల్లంతైనట్లు పేర్కొన్నారు. వరద బాధితుల కోసం ప్రకటించిన పరిహారాన్ని త్వరలోనే సీఎంకు అందజేస్తానని తెలిపారు. గత ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖలో లోపం ఉందన్నారు. 253 ప్రాంతాలు నీట మునిగితే 100కు పైగా యథాస్థితికి వచ్చాయన్నారు. 45 వేల మంది ప్రజలకు సహాయక శిబిరాల్లో ఆశ్రయం కల్పించినట్లు వెల్లడించారు.

News September 4, 2024

బుడమేరు గండ్లు పూడ్చలేకపోయాం: చంద్రబాబు

image

AP: వర్షాల కారణంగా బుడమేరుకు పడిన గండ్లను ఇంకా పూడ్చలేకపోయామని CM చంద్రబాబు తెలిపారు. విజయవాడలో CM మీడియాతో మాట్లాడారు. ‘వరద బాధితులకు నాణ్యమైన ఆహారాన్ని పంచుతున్నాం. 100కుపైగా ఫైరింజన్లతో బురద క్లీన్ చేస్తున్నాం. మృతదేహాలను బంధువులకు అప్పగిస్తున్నాం. 2,100 మంది పారిశుద్ధ్య కార్మికులు శుభ్రం చేస్తున్నారు. 32 మంది IASలు సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు’ అని ఆయన పేర్కొన్నారు.

News September 4, 2024

కంగనా ‘ఎమర్జెన్సీ’ విడుదల వాయిదా!

image

బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన <<13976222>>‘ఎమర్జెన్సీ’<<>> మూవీకి బాంబే హైకోర్టులో ఊరట లభించింది. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ విషయమై ఈ నెల 18లోపు నిర్ణయం తీసుకోవాలని CBFCకి కోర్టు సూచించింది. దీంతో ఈ నెల 6న విడుదల కావాల్సిన సినిమా వాయిదా పడనుంది.

News September 4, 2024

రాజస్థాన్ రాయల్స్‌ హెడ్ కోచ్‌గా ద్రవిడ్?

image

రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ నియమితులైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ద్రవిడ్, ఫ్రాంచైజీ మధ్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం. అలాగే ఆ జట్టు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా కుమార సంగక్కర, అసిస్టెంట్ కోచ్‌గా విక్రమ్ రాథోడ్ ఎంపికైనట్లు తెలుస్తోంది. కాగా 2012, 13 సీజన్లలో ద్రవిడ్ ఆర్ఆర్ కెప్టెన్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత 2014, 15 సీజన్లలో ఆ జట్టు మెంటార్‌గా సేవలందించారు.