India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TGలో రానున్న 5 రోజులు ఎండలు దంచికొడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. MAR 2 వరకు అత్యవసరం అయితే తప్ప ఉదయం 11 గంటల తర్వాత బయటికి వెళ్లొద్దని సూచించింది. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, గుండె జబ్బులు, ఆస్తమా, మానసిక వ్యాధిగ్రస్థులు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు. ఏమైనా పనులుంటే ఉదయం 11 గంటలలోపు సాయంత్రం 4 గంటల తర్వాత చూసుకోవాలని తెలిపారు. నిత్యం 5 లీటర్ల నీరు తప్పనిసరిగా తాగాలని చెప్పారు.

AP: కూటమి ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేస్తోందని వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. పోసాని కృష్ణమురళి అరెస్టును ఖండిస్తూ #WeStandWithPosani అని కార్యకర్తలు ట్వీట్లు చేస్తున్నారు. గతంలో సోషల్ మీడియాలో పోస్టులు చేసిన వారిని అరెస్టు చేశారని, ఇప్పుడు నాయకులను టార్గెట్ చేశారని విమర్శిస్తున్నారు. ప్రభుత్వం వైసీపీ నేతలపై కాకుండా అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.

TG: ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో నిన్న ఓటర్లకు పలువురు అభ్యర్థులు డబ్బులు పంచినట్లు ప్రచారం జరుగుతోంది. ఓటుకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు ఇచ్చినట్లు సమాచారం. కొందరు ఓటర్లకు పార్టీలు కూడా ఇచ్చినట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఖాతాల్లో డబ్బులు జమ అవుతుండడంపై నిఘా ఉందన్న ప్రచారంతో నేరుగా ఓటర్ల చేతికే డబ్బులు ఇచ్చినట్లు తెలుస్తోంది. తమకు డబ్బులు రాలేవని కొందరు నిరాశ చెందుతుండటం గమనార్హం.

AP: శివుడిని తలచుకున్నా, ఆయన విగ్రహం చూసినా తనకు ఎంతో బలం వస్తుందని మంత్రి లోకేశ్ తెలిపారు. శివరాత్రి సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘బాబు గారి అరెస్ట్ తర్వాత నా ఆలోచన విధానం మారింది. శివుడిపై భక్తి చాలా పెరిగింది. రాముడిలానే కాదు.. కొన్నిసార్లు శివుడిలా ఉండాలనే నమ్మకం కలిగింది. నా యువగళం పాదయాత్రలో స్వయంగా శివుడే నన్ను నడిపించాడు’ అని వ్యాఖ్యానించారు.

AFG చేతిలో ఓటమి అనంతరం ఇంగ్లండ్ క్రికెటర్ డకెట్‌పై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఇటీవల INDపై వరుసగా రెండు వన్డేలు ఓడిపోయాక డకెట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మేం 3-0 తేడాతో ఓడినా పెద్ద మ్యాటర్ కాదు. మేం ఇక్కడికి ఛాంపియన్స్ ట్రోఫీ కోసం వచ్చాం. ఇండియాను ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఓడిస్తాం. అప్పుడు ఈ ఓటమిని ఎవరూ గుర్తుంచుకోరు’ అని అన్నారు. కానీ CTలో ఇంగ్లండ్ సెమీస్ కూడా చేరకుండానే ఇంటిదారి పట్టింది.

పక్క రాష్ట్రాలకు వెళ్లినప్పుడు మనకు అక్కడి భాషల్లోనే నేమ్ బోర్డులు కనిపిస్తుంటాయి. కానీ, కుంభమేళాలో భాగంగా UPలోని చాలా ప్రాంతాల్లో తెలుగు బోర్డులు దర్శనం ఇచ్చాయి. ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే మార్గాల్లో, త్రివేణీ సంగమం వద్ద, కాశీలోనూ UP ప్రభుత్వం తెలుగుభాషలో బోర్డులు ఏర్పాటు చేసింది. దీంతో AP, తెలంగాణ నుంచి వెళ్లిన భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఇది తెలుగు భాషకు దక్కిన గౌరవం అని పలువురు గర్వపడ్డారు.

తాము పసికూనలం కాదు పంజా విసిరే పులులం అని అఫ్గానిస్థాన్ మరోసారి నిరూపించింది. 2023 వన్డే WC నుంచి ఆ జట్టు పెద్ద టీంలకు ఝలక్ ఇస్తోంది. 2023 WCలో ఇంగ్లండ్, పాకిస్థాన్, శ్రీలంకలను మట్టికరిపించింది. 2024 టీ20 WCలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియాను ఓడించి సెమీఫైనల్స్‌కు వెళ్లింది. తాజాగా CTలో ఇంగ్లండ్‌ను ఓడించి ఇంటిదారి పట్టేలా చేసింది. తమ దేశంలో సరైన ప్రాక్టీస్ సౌకర్యాలు లేకున్నా అఫ్గాన్ రాణించడం విశేషం.

TG: ప్రభుత్వ, ప్రైవేట్ రవాణా వాహనాలకు లొకేషన్ ట్రేసింగ్ డివైజ్‌లను తప్పనిసరిగా అమర్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రయాణికుల భద్రత కోసం పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, గూడ్స్ వెహికల్స్‌కు (కొత్త, పాత) ఈ రూల్‌ను తేనుంది. దీనిపై అనుమతి కోసం కేంద్రానికి లేఖ రాసింది. కేంద్రం అనుమతిస్తే దేశంలోనే తొలిసారిగా TGలో ఇది అమలు కానుంది. ఈ రూల్‌ను పాటించకపోతే వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తారు.

ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి పాకిస్థాన్ త్వరగా నిష్క్రమించడానికి వన్డేల్లో అనుభవం లేకపోవడమే ప్రధాన కారణమని ఆ జట్టు హెడ్ కోచ్ ఆకిబ్ జావేద్ అన్నారు. టీమ్ ఇండియాలోని ప్లేయర్లు ఆడిన మ్యాచుల సంఖ్య 1500 ఉంటే, పాక్ ఆటగాళ్ల మ్యాచుల మొత్తం 400కి తక్కువగా ఉందన్నారు. బాబర్ ఆజమ్ ఒక్కడే 100కి పైగా మ్యాచులు ఆడారని పేర్కొన్నారు. అలాగే ఒకే గ్రౌండ్‌లో ఆడుతుండటం కూడా INDకి అడ్వాంటేజ్‌గా మారిందని అభిప్రాయపడ్డారు.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఆయా జిల్లాల్లో అధికారులు సెలవు ప్రకటించారు. ఏపీలో ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో డీఈవోలు సెలవు ప్రకటించినా స్కూల్, కాలేజీ యాజమాన్యాలు ఇవ్వలేదని పలువురు ఫిర్యాదు చేస్తున్నారు. తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. మరి మీకు సెలవు ఇచ్చారా?
Sorry, no posts matched your criteria.