News September 4, 2024

సెప్టెంబర్ 4: చరిత్రలో ఈరోజు

image

1825: విద్యావేత్త, జాతీయ నేత దాదాభాయి నౌరోజీ జననం
1935: తెలుగు రచయిత కొమ్మూరి వేణుగోపాలరావు జననం
1962: భారత మాజీ క్రికెటర్ కిరణ్ మోరే జననం
1980: తెలుగు సింగర్ స్మిత జననం
1987: బాలీవుడ్ సింగర్ రితు పాతక్ జననం
1999: ఐపీఎస్ అధికారి చదలవాడ ఉమేశ్ చంద్ర మరణం

Similar News

News September 19, 2024

THE GOAT: యాష్ అన్న విజిల్ పోడు

image

బంగ్లాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ (102) అద్భుత శతకంతో చెలరేగారు. రోహిత్, కోహ్లీ, గిల్ వంటి హేమాహేమీలు పరుగులు చేయలేక ఆపసోపాలు పడ్డ పిచ్‌పైనే సెంచరీ బాది ఔరా అనిపించారు. బంగ్లా బౌలర్ మొహమూద్ అందరినీ ఇబ్బంది పెట్టినా.. అశ్విన్ మాత్రం అతడినే ఇబ్బంది పెట్టారు. ఈ క్రమంలో ఆయన ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నారు.

News September 19, 2024

ట్రెండింగ్‌లో ‘బాయ్‌కాట్ బంగ్లాదేశ్’

image

బంగ్లాదేశ్‌తో ఈరోజు ఉదయం టెస్టు మొదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ‘బాయ్‌కాట్ బంగ్లాదేశ్’ అంటూ హాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. బంగ్లా అల్లర్లలో హిందువులపై ఘోరంగా దాడులు జరిగాయని, ఆ దేశంతో క్రికెట్ ఆడటమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. పాక్‌ తరహాలోనే ఆ దేశంతో కూడా క్రికెట్‌ ఆడకూడదంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే క్రీడల్ని, రాజకీయాల్ని ముడిపెట్టకూడదంటూ మరికొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.

News September 19, 2024

పంత్‌తో డేటింగ్.. అవి రూమర్లే: ఊర్వశి

image

భారత క్రికెటర్ రిషభ్ పంత్‌తో తాను డేటింగ్ చేసినట్లు వచ్చిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదని నటి ఊర్వశీ రౌతేలా స్పష్టం చేశారు. ‘నేను నా వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచడానికే ఇష్టపడతాను. ప్రస్తుతం నా ఫోకస్‌ అంతా కెరీర్‌పైనే ఉంది. పంత్‌ విషయంలో వచ్చినవన్నీ రూమర్లే. వాటిపై పారదర్శకత మెయింటెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ మీమ్ పేజీలకు ఎందుకింత అత్యుత్సాహమో నాకు అర్థం కావట్లేదు’ అని పేర్కొన్నారు.