India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మానవుడు భగవంతునిపై భక్తిని పెంచుకోవడానికి వివిధ మార్గాలు ఉన్నాయి. రుద్రాక్ష ధారణ ద్వారా ఓ వ్యక్తి నాలుగో వంతు భక్తిని పొందుతాడు. విభూతి ధారణ వల్ల సగ భాగం భక్తి లభిస్తుంది. ఇక మంత్ర జపం చేస్తే మూడు వంతుల భక్తిని సాధించవచ్చు. ఈ పనులన్నింటితో పాటు దేవుడిని పూజిస్తే ఆ వ్యక్తి పూర్ణ భక్తిని పొందుతాడు. పూర్ణ భక్తి లభించిన తర్వాత, దాని అంతిమ ఫలం జన్మ రాహిత్యమే. అంటే మోక్షం పొందడమే అన్నమాట. <<-se>>#SIVOHAM<<>>

ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్ అణు విద్యుత్ ప్లాంట్ సమీపంలో కొన్ని వీధి కుక్కలు నీలి రంగులో ఉండటం ఆశ్చర్యపరుస్తోంది. ఇవి 1986 నాటి అణు ప్రమాదం తర్వాత మిగిలిపోయిన పెంపుడు జంతువుల సంతతికి చెందిన శునకాలుగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కాపర్ సల్ఫేట్ వంటి పారిశ్రామిక రసాయనాల వల్లే ఇలా మారిపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. దీని మూలాన్ని గుర్తించడానికి వాటి వెంట్రుకలు, రక్త నమూనాలను పరీక్షిస్తున్నారు.

AP: ‘మొంథా’ తుఫాను వల్ల రాష్ట్రానికి రూ.5,265 కోట్ల నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా వేసినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. అత్యధికంగా ఆర్‌అండ్‌బీకి రూ.2,079 కోట్లు, ఆక్వా రంగానికి రూ.1,270 కోట్లు, వ్యవసాయ రంగానికి రూ.829 కోట్ల నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. అయితే ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోలేదని వెల్లడించారు. ముందస్తు చర్యలతో నీటిపారుదల శాఖకు తక్కువ నష్టమే వాటిల్లిందని తెలిపారు.

TG: మొంథా తుఫాన్ దాగుడుమూతలు ఆడిందని CM చంద్రబాబు అన్నారు. అనుకున్న చోట కాకుండా వేరే చోట వర్షాలు కురిశాయని సమీక్షలో చెప్పారు. టెక్నాలజీ సాయంతో తుఫాన్ నష్టాన్ని తగ్గించామన్నారు. రాష్ట్ర సచివాలయం నుంచి గ్రామ సచివాలయాల వరకు సమాచారం సేకరించినట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ శాటిలైట్ ఇమేజ్‌లతో పరిస్థితులను అంచనా వేసినట్లు వెల్లడించారు. అన్ని శాఖల సమన్వయంతో పనిచేశామని పేర్కొన్నారు.

AP: క్రీడల్ని ప్రోత్సహించేందుకు రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లు, జూ.కాలేజీలకు విద్యాశాఖ 67రకాల క్రీడా సామగ్రితో కూడిన కిట్లను అందిస్తోంది. ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాల్ బ్యాడ్మింటన్, బేస్‌బాల్, బాస్కెట్ బాల్, బాక్సింగ్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, కబడ్డీ, రగ్బీ, టేబుల్ టెన్నిస్, వాలీబాల్ పరికరాలు ఇందులో ఉన్నాయి. క్లస్టర్ కాంప్లెక్స్‌ల నుంచి వీటిని అందుకోవాలని స్కూళ్లకు ఆదేశాలిచ్చింది.

ICMRలో 15 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ, MBA, PG డిప్లొమా, CA, ICWA, M.COM ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తులో తప్పుల సవరణ NOV 5 – 7వరకు చేసుకోవచ్చు. NOV 10న అడ్మిట్ కార్డులు విడుదల చేస్తారు. NOV 15న రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ తేదీని తర్వాత ప్రకటిస్తారు. వెబ్‌సైట్: www.icmr.gov.in/

TG: భారీ వర్షాలతో పంటలకు అపారమైన నష్టం వాటిల్లిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కేంద్రం దీనిని జాతీయ విపత్తుగా పరిగణించి సాయం అందించాలని కోరారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం నివేదిక రూపొందిస్తుందని, అవసరమైన సాయం అందజేస్తుందని తెలిపారు. మరోవైపు రాజకీయాలకు తావు లేకుండా బీజేపీ నేతలు పరిస్థితిని కేంద్రానికి వివరించాలని సూచించారు.

AP, TGలతో పాటు పైరాష్ట్రాల్లో వర్షాలు కురుస్తుండడంతో నదులు, వాగులు, వంకలకు వరద పోటెత్తింది. దీంతో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ జలకళతో నిండుకుండల్లా మారాయి. ప్రాజెక్టుల నుంచి నీటిని కిందికి వదులుతున్నారు. నీటిమట్టాలు ఇలా. అల్మట్టి 1704.72(1705FRL), నారాయణపూర్ 1614.73(1615), జూరాల 1044.65(1045), తుంగభద్ర 1626.06 (1626.06), శ్రీశైలం 884.50(885), నాగార్జునసాగర్ 589.70(590), పులిచింతల 172.01(175)

భారీ వర్షాల వల్ల పొలాల నుంచి వాననీటితో పాటు ఎరువులు, పురుగు మందుల అవశేషాలు చేరి చేపల చెరువుల్లోని నీటి నాణ్యతను తగ్గిస్తాయి. అందుకే వర్షాలు తగ్గాక చెరువు నీటిలో pH, ఉప్పుశాతం, క్షారత్వం, అమ్మోనియా తనిఖీ చేయాలి. ఆక్సిజన్ స్థాయి తగ్గితే చేపలు నీటి పైకి వచ్చి నోటితో గాలి తీసుకుంటూ కనిపిస్తాయి. అలాంటి పరిస్థితుల్లో నీటి మార్పిడి చేసి చెరువులో నిపుణుల సూచన మేరకు కాల్షియం కార్బోనేట్ (సున్నం) వేయాలి.

AP: CM ముందుచూపు కారణంగా తుఫాను వేళ చాలా జాగ్రత్తలు తీసుకున్నామని Dy.CM పవన్ తెలిపారు. ‘పంచాయతీరాజ్ శాఖ పరిధిలో బాగా నష్టం జరిగింది. 46వేల హెక్టార్లలో వరి, 14వేల హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి. తుఫాను బాధితులకు బియ్యం ఫ్రీగా ఇస్తున్నాం. పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు వెళ్లే ఒక్కో ఫ్యామిలీకి గరిష్ఠంగా ₹3వేలు అందిస్తున్నాం. డ్రెయిన్ల పూడికతీత ద్వారా నీరు నిల్వ లేకుండా చేశాం’ అని అన్నారు.
Sorry, no posts matched your criteria.