News September 3, 2024

బ్రూనై రాజు విలాసాలు.. హెయిర్ కట్‌కు రూ.16.5 లక్షలు

image

PM మోదీ నేడు బ్రూనై పర్యటనకు వెళ్లారు. ఆ దేశ రాజు హస్సనల్ బోల్కియా ప్రపంచంలోని సంపన్న వ్యక్తుల్లో ఒకరు. బ్రిటన్ క్వీన్ ఎలిజిబెత్-2 తర్వాత ఎక్కువ కాలం పాలించిన రెండో వ్యక్తి. ఆస్తి $30 బిలియన్లపైనే ఉంటుంది. 1700 గదులున్న ఆయన ప్యాలెస్‌ ప్రపంచంలోనే అతిపెద్ద రెసిడెన్షియల్‌గా పేరొందింది. హెయిర్ కట్ కోసం ప్రైవేటు జెట్‌లో లండన్‌లో ఉన్న బార్బర్ దగ్గరకు వెళతారు. ఇందుకోసం $20వేలు(₹16.5 లక్షలు) వెచ్చిస్తారు.

News September 3, 2024

IC-814 వివాదంపై Netflix India Update

image

‘IC-814 కాందహార్ హైజాక్’ వెబ్ సిరీస్‌ పేర్ల వివాదంపై Netflix India స్పందించింది. ఈ సిరీస్ ప్రారంభ డిస్‌క్లైమ‌ర్‌లో హైజాకర్ల నిజమైన పేర్ల‌తోపాటు వారు ఉప‌యోగించిన‌ కోడ్ పేర్లను అప్‌డేట్ చేసినట్టు తెలిపింది. వాస్త‌వానికి ఈ హైజాక్ ఉదంతం జ‌రిగిన అనంత‌రం కేంద్ర హోం శాఖ అప్ప‌ట్లో విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో ఉగ్ర‌వాదులు భోలా, శంక‌ర్, చీఫ్, డాక్టర్, బర్గర్ అనే పేర్ల‌ను కోడ్ భాష‌గా వాడిన‌ట్టు వెల్ల‌డించింది.

News September 3, 2024

కాంగ్రెస్ గూండాల దాడి బాధాకరం: పువ్వాడ

image

TG: ఖమ్మంలో కాంగ్రెస్ గూండాల <<14010859>>దాడి<<>> బాధాకరమని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. దాడి చేసిన వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాడులకు తాము భయపడబోమన్నారు. వరద బాధితులకు మౌలిక వసతులు కల్పించాలన్నారు. ప్రతిపక్షంగా పోరాడే బాధ్యత తమపై ఉందని చెప్పారు. మరోవైపు బీఆర్ఎస్ నేతల వాహనంపై దాడిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖండించారు. ఇలాంటి దాడులను తాము ప్రోత్సహించమని చెప్పారు.

News September 3, 2024

భార‌త వృద్ధి అంచ‌నాల‌ను పెంచిన ప్ర‌పంచ బ్యాంక్‌

image

FY25కి భార‌త వృద్ధి అంచ‌నాల‌ను ప్ర‌పంచ బ్యాంకు 6.6% నుంచి 7 శాతానికి పెంచింది. దేశీయంగా ఉత్పత్తి, మెరుగైన ఎగుమతులు వంటి అంశాలతో దేశ ఆర్థిక పనితీరుపై ప్ర‌పంచ బ్యాంకు పాజిటివ్‌గా ఉంది. FY23-24లో 8.2 శాతం వేగంగా వృద్ధి చెందిందని, ప్రజా మౌలిక సదుపాయాలు, గృహ పెట్టుబడుల పెరుగుదల దీనికి కారణంగా నివేదిక పేర్కొంది. మ‌హిళా ఉద్యోగులు గ‌ణ‌నీయంగా పెరిగినా, అర్బ‌న్ యూత్‌ అన్ఎంప్లాయిమెంట్‌ 17 శాతంగా ఉంది.

News September 3, 2024

పవన్.. చేతకాకపోతే తప్పుకో: కేఏ పాల్

image

AP: వరద బాధితులకు సహాయం చేయడం చేతకాకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదవి నుంచి తప్పుకోవాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ డిమాండ్ చేశారు. విజయవాడలో ఆయన బాధితులకు ఆహార పొట్లాలు అందించారు. ‘వరదల ధాటికి విజయవాడలో 2,300 మంది మరణించారు. ఒక్కో మృతుడికి రూ.కోటి నష్టపరిహారం ప్రకటించాలి. సీఎం చంద్రబాబు, పవన్ కలిసి కేంద్రం నుంచి రూ.10 వేల కోట్ల సాయం తీసుకురావాలి’ అని ఆయన పేర్కొన్నారు.

News September 3, 2024

మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల పరిహారం: కిషన్ రెడ్డి

image

తెలుగు రాష్ట్రాల్లో వరద పరిస్థితులపై ఎప్పటికప్పుడు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. దెబ్బతిన్న రహదారులకు మరమ్మతు చేయాలని పీఎంవో ఆదేశించినట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు కేంద్రం రూ.3 లక్షల పరిహారం ఇస్తుందన్నారు. జాతీయ విపత్తుగా ఎక్కడా ప్రకటించడం లేదని, అవసరమైతే ప్రధాని రాష్ట్రంలో పర్యటిస్తారని చెప్పారు.

News September 3, 2024

ట్యూబులతో కుటుంబాలను కాపాడేందుకు!

image

విజయవాడను వరద ముంచెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంకా చాలా మంది వరద నేపథ్యంలో ఇంటిపైనే తలదాచుకుని సాయం కోసం ఎదురుచూస్తున్నారు. NDRF, ప్రభుత్వాలు సాయం చేస్తున్నా కొన్ని ప్రాంతాలకు పడవలు వెళ్లలేకపోతున్నాయి. దీంతో తమ కుటుంబాలను బయటకు తీసుకొచ్చేందుకు ట్యూబులను ప్రజలు కొనుక్కెళ్తున్నారు. ప్రభుత్వం సాయం చేస్తున్నప్పటికీ తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామని ప్రజలు చెబుతున్నారు.

News September 3, 2024

దేశంలో రైల్వే వ్యవస్థ ఏర్పాటుకు ఇదీ ఓ కారణమే!

image

భారతదేశంలో బ్రిటిష్ వారు రైల్వే వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు గల ముఖ్య కారణాలలో ఒకదాని గురించి ఓ రైల్వే అధికారి చెప్పుకొచ్చారు. ‘1845లో మొదటి ఆంగ్లో- సిక్కు యుద్ధం జరిగినప్పుడు దేశంలో రైళ్లు అందుబాటులో లేవు. ఆ సమయంలో దళాలను కోల్‌కతా నుంచి బెనారస్‌కు తరలించేందుకు ఈస్ట్ ఇండియా కంపెనీకి 16 రోజులు పట్టింది. దీంతో వేగవంతమైన సరఫరా కోసం రైలు ముఖ్యమని భావించి తీసుకొచ్చారు’ అని Xలో తెలిపారు.

News September 3, 2024

హరియాణాలో ఆప్‌తో పొత్తుకు రాహుల్ రెడీ!

image

హ‌రియాణా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలిచి తీరాల‌న్న క‌సితో ఉన్న కాంగ్రెస్ మిత్రుల వెతుకులాటలో పడింది! ఎన్నిక‌ల్లో ఓట్లు చీల‌కుండా ఉండేందుకు ఆప్‌తో పొత్తు అంశాన్ని ప‌రిశీలించాల‌ని కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ పార్టీ నేతల్ని కోరిన‌ట్టు తెలుస్తోంది. అప్‌కు 3-4 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదించారు. ఆప్ MP సంజయ్ పొత్తు ప్రతిపాదన వార్తలను ఆహ్వానించారు. CM కేజ్రీవాల్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

News September 3, 2024

ఎన్టీఆర్, విశ్వక్‌సేన్‌లకు కృతజ్ఞతలు: రేవంత్, లోకేశ్

image

వరద బాధితుల సహాయార్థం ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళం ఇచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్, విశ్వక్‌సేన్‌‌లను మంత్రి నారా లోకేశ్ అభినందించారు. వరదల వల్ల సంభవించిన విధ్వంసం నుంచి ప్రజలు కోలుకోవడంలో వీరు చేసిన సహకారం దోహదపడుతుందని తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం వీరి సాయానికి కృతజ్ఞతలు తెలిపినట్లు సీపీఆర్వో ట్విటర్‌లో పేర్కొన్నారు.