India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: వైజాగ్‌లోని కేజీహెచ్ ఆసుపత్రిలో వైద్యులు అరుదైన ఆపరేషన్ చేశారు. అనకాపల్లి జిల్లాకు చెందిన మహిళ కడుపులోంచి లిథోపిడియన్ అనే గడ్డ, ఎముకల వంటి పదార్థాన్ని తొలగించారు. వైద్య పరిభాషలో దీనిని స్టోన్ బేబీ అని పిలుస్తారని ఆసుపత్రి సూపరిండెంట్ శివానంద్ తెలిపారు. ఇది చాలా అరుదైన కేసు అని, ఆపరేషన్ విజయవంతమవ్వడం ఆనందంగా ఉందని తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో కురుస్తోన్న భారీగా వర్షాలు నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ‘సరిపోదా శనివారం’ సినిమాపై ఎలాంటి ప్రభావం చూపట్లేదు. థియేటర్లలో ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. దీంతో రిలీజైన ఐదు రోజుల్లోనే రూ.75.26 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. వీకెండ్ పూర్తయ్యేలోపు రూ.100 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉంది.
గత రెండు సెషన్లలో లాభాలు సహా మంగళవారం హై ట్రేడ్ వాల్యూమ్ కారణంగా ఝున్‌ఝున్‌వాలా పోర్ట్‌ఫోలియో స్టాక్ జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు14 శాతం పెరిగి రికార్డు స్థాయిలో రూ.155.73కి చేరుకున్నాయి. మొత్తంగా 20 శాతం గెయిన్ అయ్యాయి. ఆర్థిక సేవల రంగంలో ఉన్న జియోజిత్ ఫైనాన్షియల్‌లో జూన్ 2024 త్రైమాసికం ముగింపు నాటికి రేఖా ఝున్‌ఝున్‌వాలాకు 7.2 శాతం వాటాతో 17.21 మిలియన్ షేర్లు ఉన్నాయి.
తెలంగాణలోని పలు జిల్లాల్లో మరో 3 గంటల్లో వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, జనగామ, ఆసిఫాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట్, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, భువనగిరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం ప్రకటించారు. ఏపీ, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్స్‌కి రూ.50 లక్షల చొప్పున అందిస్తున్నట్లు తెలిపారు. తన బాధ్యతగా బాధిత ప్రజలకు సాయం చేస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు జూ.ఎన్టీఆర్, సిద్ధూ జొన్నలగడ్డ, విశ్వక్‌సేన్ తమ వంతుగా విరాళాలు ప్రకటించిన సంగతి తెలిసిందే.
AP: రేపు తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం లేదని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. భారీ వరదలతో రాష్ట్రం తీవ్ర విషాదంలో మునిగిపోయిందని, అందుకే వేడుకలకు దూరంగా ఉంటున్నానని చెప్పారు. అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు తనను కలవొద్దని సూచించారు. వీలైతే వరద బాధితులకు సాయం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
TG: సాయం చేయలేదని ప్రశ్నించిన తమపై దాడి చేస్తారా అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. వరదల్లో 28 మంది చనిపోతే కేవలం 16 మంది చనిపోయారని చెప్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తే దాడులు, కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. వరదలు వచ్చిన రోజు సీఎం ఎలాంటి సమీక్ష నిర్వహించలేదని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి ఖమ్మం, మహబూబాబాద్ ప్రజలు బలయ్యారని అన్నారు.
TG: మహబూబాబాద్ జిల్లాకు చెందిన టెన్త్ విద్యార్థిని ముత్యాల సాయి సింధు మంచి మనసు చాటుకుంది. రాష్ట్రంలో వరద బాధితుల సహాయార్థం తన కిట్టీ బ్యాంకు నుంచి రూ.3వేలను సీఎం రేవంత్ రెడ్డికి అందించింది. దీంతో సింధును సీఎం ప్రత్యేకంగా అభినందించారు. ఇది చిన్న సాయమే అయినా సింధుది గొప్ప మనసంటూ నెటిజన్లు సింధును సోషల్ మీడియాలో మెచ్చుకుంటున్నారు.
AP: ఊహించని వర్షాలు, వరదలతో బెజవాడ నగరం గజగజ వణికింది. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. లక్షలమంది కడుపు నింపేందుకు స్థానిక హోటళ్లు, అక్షయపాత్ర, ఇతర సంస్థల సాయంతో ప్రభుత్వం ఆహారం అందించే ఏర్పాట్లు చేస్తోంది. స్వచ్ఛందంగా ఆహారం ఇవ్వాలనుకుంటున్న వారి కోసం విజయవాడ మున్సిపల్ స్టేడియంలో ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. IAS శ్రీమనజీర్ 7906796105ను సంప్రదించాలని సూచించింది.
TG: ప్రభుత్వం సకాలంలో స్పందించి ఉంటే ఖమ్మంలో వరద నష్టం తగ్గేదని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇసుకమేటలు పెట్టిన ప్రాంతాల్లో రూ.50వేల పరిహారం ఇవ్వాలన్నారు. రాష్ట్రాన్ని ఆదుకోవడంలో కేంద్రం విఫలమైందని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిపక్షాలు కలిసి వెళ్లి కేంద్రాన్ని నిలదీయాలన్నారు.
Sorry, no posts matched your criteria.