India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: వర్షాలు, వరదల నేపథ్యంలో పాఠశాలలకు సెలవులపై జిల్లాల కలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలని CM రేవంత్ ఆదేశించారు. రాష్ట్రంలో రూ.5వేల కోట్ల నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా వేసినట్లు తెలిపారు. కేంద్రం తక్షణమే రూ.2వేల కోట్లు కేటాయించాలని కోరారు. అందుకు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కృషి చేయాలన్నారు. వరద ప్రభావిత జిల్లాలైన సూర్యపేట, మహబూబాబాద్‌కు తక్షణ సాయంగా రూ.5 కోట్ల చొప్పున విడుదల చేస్తున్నామన్నారు.
TG: సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం చేరుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించనున్నారు. జరిగిన నష్టంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. ఇవాళ రాత్రి ఆయన అక్కడే బస చేస్తారు. రేపు మహబూబాబాద్, వరంగల్‌లో పర్యటిస్తారు.
AP: వరద సహాయక చర్యల్లో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై CM చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన కొందరు అధికారులు అలసత్వాన్ని వీడటం లేదన్నారు. అనుకున్న స్థాయిలో ఆహారం తెప్పించినా పంపిణీలో జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. పనిచేయడం ఇష్టం లేకపోతే ఉద్యోగాలు వదిలేసి ఇంటికి వెళ్లాలని ఫైర్ అయ్యారు. తానే రంగంలోకి దిగినా మొద్దునిద్ర వీడకుంటే ఎలా అని ప్రశ్నించారు.
కృష్ణానదిలో వరద పెరుగుతుండటంతో పరీవాహక ప్రాంతాల ప్రజలను హెచ్చరిస్తూ ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వాహణ సంస్థ అలర్ట్ మెసేజ్‌లు పంపుతోంది. ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం 12 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉందని లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నదిలో ఈతకు వెళ్లడం, స్నానాలు చేయడం, చేపలు పట్టడం చేయొద్దని పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మెసేజ్‌లో పేర్కొంది.
AP: భారీ వర్షాల నేపథ్యంలో గుంటూరు జిల్లాలో రేపు కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. మంగళవారం కూడా వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు, వరద ముప్పుతో ముందు జాగ్రత్తగా కలెక్టర్ నాగలక్ష్మి సెలవు ప్రకటించారు. వర్షాలు కురిసే మరికొన్ని జిల్లాల్లోనూ రాత్రిలోగా కలెక్టర్లు సెలవు ఇచ్చే అవకాశం ఉంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా రీరిలీజైన ‘గబ్బర్ సింగ్’ సినిమాను చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్ థియేటర్‌లలో రచ్చ చేస్తున్నారు. సాంగ్స్‌కు, ఫైట్ సీన్స్‌కు డాన్సులు చేస్తూ హల్ చల్ చేస్తున్నారు. అయితే, కాకినాడ, వైజాగ్‌లో అభిమానుల సెలబ్రేషన్స్‌లో థియేటర్లు డ్యామేజ్ అయ్యాయి. దీంతో పోలీసులు ఓ థియేటర్‌కు చేరుకున్నారు. ఇలా చేస్తే మేనేజ్మెంట్స్ తీవ్రంగా నష్టపోతాయని ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.
ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు వరద పోటెత్తింది. ఈ క్రమంలో బాధితులను ఆదుకునేందుకు గీతా ఆర్ట్స్(GA2) ముందుకొచ్చింది. ఆ సంస్థ నిర్మించిన ‘ఆయ్’ చిత్రానికి ఇవాళ్టి నుంచి వీకెండ్ వరకూ వచ్చే వసూళ్లలో 25శాతం(షేర్‌లో) విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. జనసేన పార్టీ తరఫున ఈ విరాళం అందజేయనున్నట్లు తెలిపింది.
వేర్వేరు కేసుల్లో ఆమ్ ఆద్మీ పార్టీలు నేతల్లో సోమవారం ఒకరు జైలు నుంచి విడుదలైతే, మరొకరు అరెస్టయ్యారు. ఆప్ MLA అమానతుల్లాను ఈడీ అరెస్టు చేసింది. వక్ఫ్ బోర్డులో అక్రమాలు, అక్రమాస్తుల కేసులో మనీలాండరింగ్ అభియోగాలపై ED ఆయన్ను అరెస్టు చేసింది. మరోవైపు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆప్ కమ్యూనికేషన్స్ విభాగం మాజీ ఇంఛార్జ్ విజయ్ నాయర్ 23 నెలల తరువాత జైలు నుంచి విడుదలయ్యారు.
టీమ్ఇండియా మాజీ ప్లేయర్, 1983 వరల్డ్ కప్ విజేత కీర్తి ఆజాద్ ఇంట విషాదం నెలకొంది. ఆయన భార్య పూనమ్ అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. ఈరోజు మధ్యాహ్నం ఆమె తుదిశ్వాస విడిచినట్లు ఆజాద్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. పూనమ్ చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. ప్రస్తుతం ఆజాద్ TMC నుంచి ఎంపీగా ఉన్నారు. పలువురు రాజకీయ ప్రముఖులు పూనమ్ మృతికి నివాళులర్పించారు.
చర్మం పొడిబారడాన్ని Xerosis అంటారు. వాన, చలికాలాల్లో ఈ సమస్య ఎక్కువగా వేధిస్తుంటుంది. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. వాతావరణం వేడెక్కినా, చల్లగా ఉన్నా, తేమ తగ్గినా ఇలాగే అవుతుంది. భార రసాయనాలున్న క్లెన్జర్స్, నీటితో ముఖం, చర్మాన్ని ఎక్కువ సార్లు కడిగినా సమస్య తప్పదు. మేనిపై తేమను పెంచి కాపాడేది సెబమ్. చర్మగ్రంథులు దాన్ని తక్కువగా స్రవించినా పొడిబారడం ఖాయం. సిగరెట్లు తాగినా ఈ ముప్పు తప్పదు.
Sorry, no posts matched your criteria.