India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: హైదరాబాద్ నగరంలో వర్షం మొదలైంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, యూసుఫ్ గూడ తదితర ప్రాంతాల్లో మోస్తరు వాన పడుతోంది. అటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. మరి మీ ప్రాంతంలో వాన పడుతోందా? కామెంట్ చేయండి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే విషెస్ చెప్పారు. ‘మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు పవర్ స్టార్ & డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు’ అని ట్వీట్ చేశారు. అటు సినిమా స్టార్లతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెబుతున్నారు.
కోల్‌కతాలో వైద్యురాలిపై హత్యాచారానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్లో కొందరు మృగాళ్లు వికృత చేష్టలు కొనసాగిస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి నిరసనల్లో పాల్గొన్న మహిళను లైంగికంగా వేధించాడు. దీంతో ఆమె గట్టిగా కేకలు వేయడంతో సహచరులు అతడిని చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు. అయితే నిందితుడిని వెంటనే విడుదల చేయడంతో వారు మండిపడ్డారు. సదరు వ్యక్తి మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడని పోలీసులు చెబుతున్నారు.
హరిహర వీరమల్లు నుంచి ఇవాళ విడుదల చేయాల్సిన అప్డేట్స్‌ను క్యాన్సిల్ చేసినట్లు మేకర్స్ వెల్లడించారు. ‘అభిమానుల కోసం ఓ పోస్టర్‌ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశాం. అయితే వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వేడుకలు జరుపుకోవడం పవర్ స్టార్ నియమాలకు విరుద్ధం. అభిమానులందరూ అర్థం చేసుకుని సహకరిస్తారని ఆశిస్తున్నాం’ అని ట్వీట్ చేశారు. <<13997588>>OG<<>> అప్డేట్స్ కూడా రద్దయిన విషయం తెలిసిందే.
జనాభా పెరగడం, చెట్ల నరికివేత, చెరువులు, నాలాలు ఆక్రమించి ఇళ్లు కట్టడంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతింది. దీంతో అతివృష్టి లేదంటే అనావృష్టి సంభవిస్తున్నాయి. గతంలో వర్షం కురిస్తే నీరు భూమిలోకి ఇంకిపోయేది. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా తారు, సిమెంట్ రోడ్లు ఉండటంతో నీరు ఇంకట్లేదు. మరోవైపు చెరువులు సైతం ఆక్రమించడంతో వరదలు సంభవిస్తున్నాయి. ఇంకుడు గుంతల ఏర్పాటు, చెట్ల పెంపకంతో కొంతవరకు సమస్యలు అధిగమించవచ్చు.
పవర్ స్టార్, AP డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు మెగా హీరో వరుణ్ తేజ్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. చిన్నప్పుడు తన బాబాయ్ కాళ్లు నొక్కుతుండగా తీసిన ఫొటోను వరుణ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘మిమ్మల్ని చూస్తూ పెరిగాను. ధర్మం వైపు మీరు అనుసరించిన మార్గం, ఇతరులకు సహాయం చేయాలనే మీ అచంచలమైన సంకల్పం స్ఫూర్తిదాయకం. మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా. లవ్ యూ మై పవర్ స్టార్మ్!❤️’ అని ట్వీట్ చేశారు.
RGకర్ వైద్యురాలి హత్యాచార దోషులను శిక్షించాలని ఆదివారం రాత్రి సెంట్రల్ కోల్‌కతాలో సినీ ప్రముఖులు ధర్నా నిర్వహించారు. ఇందులో వేలాదిమంది నేటి ఉదయం 4 గంటల వరకు పాల్గొన్నారు. ‘మేం పంపిన ఈ మెయిల్స్‌కు పోలీస్, ఆరోగ్య, మహిళా-శిశు సంక్షేమ శాఖలు సహా ఎవ్వరూ స్పందించలేదు’ అని డైరెక్టర్ బిర్సా దాస్‌గుప్తా అన్నారు. ‘దూషణ నుంచి విముక్తి’కి పోరాడతామని నటీమణులు సోహిణీ సర్కార్, స్వస్తికా ముఖర్జీ ఉద్ఘాటించారు.
TG: పదేళ్ల పాటు సిరి సంపదలతో కళకళలాడిన సిరిసిల్ల ఇప్పుడు ఉరిసిల్లగా మారుతోందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి లేక ఓ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ఆయన స్పందించారు. ‘నేతన్నల పట్ల కాంగ్రెస్ సర్కార్ అనుసరిస్తున్న నేరపూరిత నిర్లక్ష్యం కార్మికుల ఉసురు తీస్తోంది. నా మీద కోపంతో నేతన్నల ప్రాణాలు బలిపెట్టొద్దు సీఎంగారూ. మాకన్నా ఎక్కువ మంచి చేసి వారి ప్రాణాలు నిలబెట్టండి’ అని ట్వీట్ చేశారు.
TG: సీఎం రేవంత్‌రెడ్డి మరికాసేపట్లో రోడ్డు మార్గం ద్వారా ఖమ్మం బయలుదేరనున్నారు. ఖమ్మంలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తారు. భారీ వర్షాలతో ఆ జిల్లాలోని పలు ప్రాంతాలు అతలాకుతలమైన సంగతి తెలిసిందే. నిన్న మంత్రులు భట్టి, పొంగులేటి, తుమ్మల ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు.
AP: పునరావాస కేంద్రాల్లో ఉన్న వరద బాధితులకు ఆహారం, నీళ్లతోపాటు దుస్తులు కూడా ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ముంపులో ఉన్న ప్రజలకు బియ్యంతోపాటు నిత్యావసరాలను అందించాలని సూచించారు. బృందాలుగా ఏర్పడి సహాయ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. కరకట్ట వెంట గండిపడే ప్రాంతాలను గుర్తించి మరమ్మతులు చేయాలని చెప్పారు.
Sorry, no posts matched your criteria.