News September 1, 2024

ఆ తర్వాతే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్: ఎస్ఈసీ

image

TG: ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి తెలిపారు. నిన్న రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. నోటిఫికేషన్ వచ్చే వరకూ ఓటర్ల నమోదు కొనసాగుతుందని, ఈనెల 6న ముసాయిదా జాబితా రిలీజ్ చేస్తామని తెలిపారు. కులగణన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని, BC రిజర్వేషన్లలను 42%కి పెంచాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.

News September 1, 2024

USలో టాప్-10 యూనివర్సిటీలు (ఫోర్బ్స్ ప్రకారం)

image

☛ ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ
☛ స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ
☛ మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
☛ యేల్ యూనివర్సిటీ ☛ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా
☛ కొలంబియా యూనివర్సిటీ ☛ పెన్సిల్వేనియా యూనివర్సిటీ
☛ హార్వర్డ్ యూనివర్సిటీ ☛ విలియం మార్ష్ రైస్ యూనివర్సిటీ ☛ కార్నెల్ యూనివర్సిటీ

News September 1, 2024

12,966 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు!

image

TG: రాష్ట్రంలో 540 గ్రామీణ మండలాల్లోని 12,966 గ్రామాల్లో(1,14,620 వార్డులు) పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. వీటి జాబితాను పంచాయతీరాజ్ శాఖ ఈసీకి సమర్పించింది. గత ఎన్నికల్లో 535 మండలాల్లోని 12,732 గ్రామాల్లో (1,13,152 వార్డులు) ఎన్నికలు జరిగాయి. వాటితో పోలిస్తే ఈసారి 5 మండలాలు, 234 విలేజ్‌లు, 1,468 వార్డులు పెరిగాయి. ఈసారి అత్యధికంగా నల్గొండ(D) 868 గ్రామాల్లోని 7,482 వార్డుల్లో ఎలక్షన్స్ జరగనున్నాయి.

News September 1, 2024

నేడు తీరం దాటనున్న వాయుగుండం

image

AP: పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. కళింగపట్నానికి దక్షిణంగా 30కి.మీ, విశాఖకు ఈశాన్యంగా 90కి.మీ దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమ, కోస్తాంధ్రలో పలుచోట్ల భారీ వర్షం కురిసే అవకాశముందని, మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సుందని పేర్కొంది.

News September 1, 2024

ద్రవిడ్ రికార్డుకు చేరువలో రూట్

image

టెస్టుల్లో అత్యధిక క్యాచులు తీసుకున్న ఫీల్డర్ల లిస్టులో భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్(210) టాప్‌లో కొనసాగుతున్నారు. ఆయన తర్వాత జయవర్దనే (205), జాక్ కలిస్(200) ఉన్నారు. తాజాగా శ్రీలంకతో రెండో టెస్టులో ఇంగ్లండ్ ప్లేయర్ జో రూట్ 200 క్యాచులు పూర్తిచేసుకున్నారు. దీంతో త్వరలో ఆయన ద్రవిడ్‌ రికార్డును అధిగమించే అవకాశం ఉంది.

News September 1, 2024

సునీతా విలియమ్స్: NASA, బోయింగ్ మధ్య వాగ్వాదం?

image

వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లను భూమిపైకి <<13935282>>తీసుకురావడంపై<<>> చర్చల సందర్భంగా NASA, బోయింగ్ ప్రతినిధుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు సమాచారం. వారిద్దరినీ తమ స్టార్‌లైనర్ స్పేస్ క్రాఫ్ట్స్‌లో సురక్షితంగా తీసుకురావచ్చని బోయింగ్ తెలపగా, NASA అధికారులు కన్విన్స్ కానట్లు తెలుస్తోంది. దాని ప్రత్యర్థి, మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ సాయం తీసుకోవాలని వారు నిర్ణయించినట్లు సమాచారం.

News September 1, 2024

రూ.50కోట్ల క్లబ్‌లోకి ‘సరిపోదా శనివారం’!

image

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘సరిపోదా శనివారం’ 3 రోజుల్లోనే ₹50కోట్ల వసూళ్లను దాటేసినట్లు సినీవర్గాలు తెలిపాయి. ఈ మూవీ తొలి 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ₹36.03కోట్ల కలెక్షన్స్ రాబట్టిందని మేకర్స్ ప్రకటించారు. మూడో రోజు వసూళ్లతో ₹50కోట్ల మార్క్ దాటినట్లు తెలుస్తోంది. దీంతో నాని హ్యాట్రిక్ సాధించారు. ఆయన నటించిన గత రెండు సినిమాలు (దసరా, హాయ్ నాన్న) కూడా ₹50కోట్లకు పైగానే వసూళ్లు సాధించాయి.

News September 1, 2024

రైలు ప్రయాణికుల కోసం హెల్ప్ లైన్ నంబర్లు

image

భారీ వర్షాల నేపథ్యంలో ద.మ. రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. వాటితో పాటు మళ్లించిన రైళ్ల వివరాలు, ఇతర సేవల కోసం హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది. HYD-27781500, సికింద్రాబాద్-27786140, 27786170,
కాజీపేట: 27782660, 8702576430, వరంగల్-27782751,
ఖమ్మం-27782985, 08742-224541, 7815955306,
విజయవాడ-7569305697, రాజమండ్రి-0883-2420541, 0883-2420543.

News September 1, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: సెప్టెంబర్ 01, ఆదివారం
ఫజర్: తెల్లవారుజామున 4:49 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:02 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:16 గంటలకు
అసర్: సాయంత్రం 4:42 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:30 గంటలకు
ఇష: రాత్రి 7.43 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News September 1, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.