News February 23, 2025

‘భారత్ ఓడిపోతుంది’ అన్న ఐఐటీ బాబా ఎక్కడ?

image

పాక్ చేతిలో భారత్ ఓడిపోతుందని <<15548119>>జోస్యం చెప్పిన<<>> ఐఐటీ బాబా అలియాస్ అభయ్ సింగ్‌పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. Xలో #IITianBaba ట్రెండ్ అవుతోంది. ‘విరాట్.. ఇంకా చాలా మంది ఉన్నప్పటికీ ఎలా గెలుస్తారో చూద్దాం. అది జరిగి తీరదు’ అని నిన్న ఐఐటీ బాబా అనడంపై ఫైరవుతున్నారు. ‘ఇప్పుడు నీ జోస్యం ఏమైంది?’ అని నిలదీస్తున్నారు. వైరల్ అయ్యేందుకు సొంత దేశం ఓడిపోవాలని కోరుకోవడమేంటని మండిపడుతున్నారు.

Similar News

News March 25, 2025

బెట్టింగ్ యాప్ కేసులో కొత్త మలుపు

image

నిషేధిత బెట్టింగ్ యాప్స్‌ <<15822419>>కేసులో<<>> కొత్త మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులని కూడా నిందితులుగా చేర్చారు. సెలబ్రిటీలను విచారించే ముందు పోలీసులు న్యాయసలహా తీసుకోనున్నారు. తొలుత యాప్ నిర్వాహకులను విచారించనున్నారు. తెలంగాణ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే వారిని ముందుగా విచారించి తదుపరి చర్యలు తీసుకుంటారు. ప్రస్తుతం యాప్‌ల నిర్వాహకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

News March 25, 2025

భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోలు మృతి

image

మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్-దంతెవాడ సరిహద్దుల్లో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో ఐదుగురు నక్సల్స్ హతమయ్యారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలంలో పోలీసులు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. కాగా ఇటీవల పలు ఎన్‌కౌంటర్లలో భారీగా మావోలు మరణించిన విషయం తెలిసిందే.

News March 25, 2025

ఉప్పల్ స్టేడియంలో తమన్ మ్యూజికల్ ఈవెంట్

image

ఎల్లుండి ఉప్పల్‌లో లక్నోతో సన్‌రైజర్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ప్రత్యక్షంగా హాజరయ్యే ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. ప్రారంభానికి ముందు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన సంగీత కార్యక్రమంతో ప్రేక్షకుల్ని అలరించనున్నారు. ఐపీఎల్ అధికారిక హ్యాండిల్ ఈ విషయాన్ని వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఐపీఎల్ జరుగుతున్న పలు స్టేడియాల్లో మ్యాచ్‌కు ఇదే తరహాలో మ్యూజికల్ ఈవెంట్స్‌ను బీసీసీఐ నిర్వహిస్తోంది.

error: Content is protected !!