India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: భారీ వర్షాలు పలుచోట్ల విషాదం నింపాయి. కామారెడ్డి(D) నస్రుళ్లబాద్(మ) నాచుపల్లిలో కరెంట్ షాక్‌తో డిగ్రీ విద్యార్థిని స్వాతి(18) మృతి చెందారు. ఇంటి వెనుక చెట్టుపై పిడుగుపడటంతో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. అవి నేరుగా రేకుల ఇంటిని తాకటంతో విద్యుత్ సరఫరా అయ్యింది. ఇంటి తలుపులు ముట్టుకున్న స్వాతి అక్కడికక్కడే చనిపోయింది. అటు ములుగు(D) తాడ్వాయి నార్లాపూర్‌లో పిడుగుపాటుకు యువకుడు మహేశ్ మృతి చెందాడు.
పతంజలి హెర్బల్ టూత్ పౌడర్ ‘దివ్య దంత్ మంజన్’లో చేప ఆనవాళ్లు ఉన్నాయంటూ దీన్ని రోజూ వాడే ఓ న్యాయవాది ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ప్రొడక్టు లేబుల్‌పై శాకాహారం అని ఉన్నా లోపల సెపియా అఫిసినాలిస్ చేప నుంచి తీసిన సముద్రఫెన్ అనే పదార్థాన్ని వాడినట్లు పేర్కొన్నారు. మతవిశ్వాసాలను పాటించే తాను ఈ విషయం తెలిసి కలత చెందినట్టు పేర్కొన్నారు. కేంద్రం, పతంజలి, బాబా రాందేవ్‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది.
దేశంలో 2014-2024 మధ్య 14,985 KM మేర రైల్వే ట్రాక్‌లను నిర్మించినట్టు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఇది ఫ్రాన్స్ లాంటి ధనిక దేశం కంటే అధికమన్నారు. ఇక గంటకు 100 కిమీ వేగంతో నడిచే అమృత్ భారత్ రైళ్లలో 1500 KM దూరానికి కేవలం రూ.450 ఖర్చవుతుందని పేర్కొన్నారు. వందే భారత్ రైళ్లలో విమానాల కంటే 100 రెట్లు తక్కువ శబ్దం ఉంటుందని తెలిపారు. ఈటీ వరల్డ్ లీడర్స్ సదస్సులో ఆయన మాట్లాడారు.
వయనాడ్‌ను వణికించిన విపత్తులో ఓ ప్రేమ కథ అందరినీ కదిలిస్తోంది. 10 ఏళ్లుగా ప్రేమలో ఉన్న శ్రుతి, జాన్సన్ పెద్దల ఆమోదంతో పెళ్లికి సిద్ధమయ్యారు. అయితే అనుకోని వరదలు వీరి లైఫ్‌లో విషాదం నింపాయి. శ్రుతి 9మంది కుటుంబీకులను కోల్పోయింది. దీంతో జాన్సన్ ఉద్యోగం వదిలి ఆమె కుటుంబ సభ్యుల మృతదేహాల వెలికితీత, అంత్యక్రియల వరకు ఆమె వెంటే ఉన్నాడు. తాజాగా మృతులకు నివాళులర్పించిన వారు, SEPలో పెళ్లి చేసుకోనున్నారు.
AP: <<13984448>>గుడ్లవల్లేరు<<>> ఇంజినీరింగ్ కాలేజీ ఘటనపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని YCP MLC బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఆడపిల్లల జీవితాలతో ముడిపడిన ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలని, లేదంటే ఇదో అలవాటుగా మారుతుందని చెప్పారు. విద్యాసంస్థల్లో ఇప్పటికే 9 ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.
కోల్‌కతా నుంచి బెంగళూరు వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకొచ్చింది. 6E 0573 గాల్లో ఉండగా ఒక ఇంజిన్ ఫెయిల్ అయినట్టు పైలట్ గుర్తించారు. దీంతో రాత్రి 10.39కి పైలట్ ఏటీసీకి సమాచారం ఇవ్వడంతో రన్‌వేపై ఎమర్జెన్సీని ప్రకటించారు. రెండో ఇంజిన్‌తో విమానం సేఫ్‌గా ల్యాండ్ అవ్వడంతో ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు.
ప్రియాన్ష్ ఆర్య.. ఢిల్లీ టీ20 లీగ్‌లో 6 బంతుల్లో <<13985456>>6 సిక్సర్లు<<>> కొట్టడంతో ఇతడి పేరు మార్మోగిపోతోంది. అయితే ఇలా ఊచకోత ఇన్నింగ్స్ ఆడటం ఇతడికి కొత్తేమీ కాదు. గత మ్యాచ్‌లోనూ 9 బంతుల్లోనే 24 రన్స్ చేశారు. ఈ టీ20 లీగ్‌లో మొత్తంగా చూస్తే 57(30), 82(51), 53(32), 45(26), 107*(55), 88(42), 120(50) చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈసారి IPL వేలంలో ప్రియాన్ష్‌పై ఫ్రాంచైజీలు భారీ మొత్తం వెచ్చించే అవకాశం ఉంది.
హరియాణా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీని కేంద్ర ఎన్నికల సంఘం మార్చింది. మొదట ఆక్టోబర్ 1న నిర్వహించనున్నట్టు షెడ్యూల్ ప్రకటించింది. అయితే, పోలింగ్‌కి ముందు, తరువాతి రోజు సెలవులు ఉన్నకారణంగా తేదీ మార్చాలని బీజేపీ సహా పలు పార్టీలు డిమాండ్ చేశాయి. దీంతో ఈసీ తాజాగా ఎన్నికల తేదీని అక్టోబర్ 5కి మార్చింది. ఈ ఫలితాలు జమ్మూకశ్మీర్‌తో కలిపి అక్టోబర్ 8న వెలువడనున్నాయి.
తమ హోం, న్యాయ శాఖ నుంచి ఏదైనా అభ్యర్థన వస్తే హసీనాను తిరిగి అప్పగించాల్సిందిగా భారత్‌ను కోరతామని బంగ్లా విదేశీ వ్యవహారాల సలహాదారు తౌహీద్ హుస్సేన్ అన్నారు. దీనికి భారత్ కట్టుబడి ఉండాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. ఆ పరిస్థితే వస్తే అది భారత్‌కు ఇబ్బందికరంగా పరిణమిస్తుందని, ఈ విషయంలో పొరుగు దేశం జాగ్రత్తపడుతుందని భావిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.
TG: రాష్ట్రంలో వచ్చే నెల 3 వరకు భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ, రేపు కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, గద్వాల్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లో భారీ వానలు పడతాయని తెలిపింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.