News February 23, 2025
కాంగ్రెస్‌కు శశి థరూర్ రాం రాం చెబుతారా?

శశి థరూర్, కాంగ్రెస్ మధ్య విభేదాలు నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇటీవల థరూర్.. మోదీ అమెరికా పర్యటన, కేరళలో పినరయి ప్రభుత్వ పాలనపై ప్రశంసలు కురిపించారు. కేరళలో ఓటర్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్‌కు కొత్త నాయకత్వం కావాలని, లేదంటే మరోసారి విపక్ష స్థానానికే పరిమితం కావాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి తన సేవలు అవసరం లేదనుకుంటే తనకు ‘ఆప్షన్లు’ ఉన్నాయని వ్యాఖ్యానించడం దుమారం రేపుతోంది.
Similar News
News March 18, 2025
అసెంబ్లీ ఆవరణలో అరకు కాఫీ స్టాల్ ప్రారంభం

AP: అసెంబ్లీ ఆవరణలో అరకు కాఫీ స్టాల్‌ను స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కాఫీ ఉత్పత్తులను పరిశీలించిన అనంతరం చంద్రబాబు స్వయంగా పవన్‌కు కాఫీ అందించారు. దీంతో అక్కడున్నవారంతా చిరునవ్వులు చిందించారు. కాగా <<15795599>>పార్లమెంటులోనూ<<>> అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటుకు ఆమోదం లభించింది.
News March 18, 2025
ఏప్రిల్ 11న ‘ఆదిత్య 369’ రీరిలీజ్!

సోషియో ఫాంటసీ చిత్రం ‘ఆదిత్య 369’ మరోసారి థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 11న రీరిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నందమూరి బాలకృష్ణ, సింగీతం శ్రీనివాసరావు కాంబోలో తెరకెక్కిన ఈ చిత్రం 1991లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. శ్రీకృష్ణదేవరాయలుగా, కృష్ణ కుమార్‌గా రెండు పాత్రల్లో బాలకృష్ణ నటనను మరోసారి థియేటర్లలో ఎక్స్‌పీరియెన్స్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారా?
News March 18, 2025
విజయసాయిరెడ్డికి సీఐడీ నోటీసులు

AP: కాకినాడ పోర్టు షేర్ల బదలాయింపు వ్యవహారంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సీఐడీ రెండోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 25న విచారణకు రావాలని అందులో పేర్కొంది. కాగా ఈ నెల 12న ఆయన తొలిసారి విచారణకు హాజరయ్యారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేసిన విషయం తెలిసిందే.