News February 23, 2025

పనికి జస్టిఫై చేయాలి.. లేదంటే ఉద్యోగాల కోత: మస్క్

image

US అధ్యక్షుడు ట్రంప్‌కు సలహాదారుగా ఉన్న ఎలాన్ మస్క్ ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేశారు. ‘ఫెడరల్ సిబ్బంది తమ పనికి జస్టిఫై చేయాలి. లేదంటే ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుంది’ అని పేర్కొన్నారు. వారం రోజుల్లో ఏం చేశారో ప్రతి సోమవారం రా.11.59లోపు నివేదిక సమర్పించాలని కోరారు. ఈ ప్రకటనను ఫెడరేషన్ అధ్యక్షుడు ఎవెరెట్ కెల్లీ ఖండించారు. చట్టవిరుద్ధమైన తొలగింపులను కోర్టులో సవాల్ చేస్తాన్నారు.

News February 23, 2025

రూ.4.5 కోట్ల లాటరీ తగిలింది.. కానీ

image

రొట్టె విరిగి నేతిలో పడ్డట్లుగా దొంగలకు ₹4.5Cr లాటరీ తగిలింది. అయితే చోరీ చేసిన ATM కార్డుతో దాన్ని కొనడంతో అరెస్టు భయంతో తేలు కుట్టిన దొంగల్లా ఉండిపోయారు. లాటరీని సమంగా పంచుకునేందుకు ఒప్పుకుంటే కేసును ఉపసంహరించుకుంటానని కార్డు యజమాని ప్రకటించాడు. విజేత వస్తే డబ్బు ఇస్తామంటూ నిర్వాహకులు నిరీక్షిస్తున్నారు. ఈ విచిత్ర పరిస్థితి ఫ్రాన్స్‌లో చోటుచేసుకుంది. ఎవరూ రాకపోతే ప్రభుత్వానికి సొమ్ము వెళ్తుంది.

News February 23, 2025

ట్రంప్ వ్యాఖ్యలు ఆందోళనకరం: జైశంకర్

image

భారత ఎన్నికల్లో US నిధులను కేటాయించారన్న ట్రంప్ ఆరోపణలపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు. ‘ట్రంప్ వ్యాఖ్యలు తీవ్ర కలవరపాటుకు గురిచేశాయి. భారత అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యం ఆందోళన కలిగిస్తోంది. USAID నిధులపై వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడటం తొందరపాటే అవుతుంది. పూర్తి విచారణ తర్వాతే దీనిపై అన్ని వివరాలు వెల్లడిస్తాం’ అని ఆయన తెలిపారు.

News February 23, 2025

సీఎం రేవంత్‌కు ఫోన్ చేసిన రాహుల్

image

TG: SLBC టన్నెల్ ప్రమాదం నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోన్ చేశారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్న రాహుల్, సహాయక చర్యలపై ఆరా తీశారు. మరోవైపు SLBC టన్నెల్ దగ్గర కాంట్రాక్టర్, ఏజెన్సీలు, రెస్క్యూ సిబ్బందితో మంత్రులు ఉత్తమ్, జూపల్లి సహాయక చర్యలపై చర్చిస్తున్నారు.

News February 23, 2025

యూజీసీ NET ఫలితాల విడుదల

image

యూజీసీ నెట్ ఫలితాలు విడుదలయ్యాయి. జూనియర్ రీసెర్చి ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం జనవరిలో పరీక్షలు జరిగాయి. ఇందుకు సంబంధించిన కీని ఈ నెల 3న విడుదల చేసింది. నెట్ పరీక్షకు 6.49 లక్షల మంది హాజరయ్యారు. JRF, అసిస్టెంట్ ప్రొఫెసర్ కోసం 5,158 మంది, అసిస్టెంట్ ప్రొఫెసర్, PhD అడ్మిషన్‌కు 48,161 మంది, PhD కోసం 1,14,445 క్వాలిఫై అయ్యారు. ఫలితాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News February 23, 2025

SSMB29పై ఏప్రిల్‌లో రాజమౌళి ప్రెస్‌మీట్?

image

రాజమౌళి-మహేశ్ బాబు కాంబినేషన్‌లో SSMB29 మూవీ షూటింగ్ ఇప్పటికే కొనసాగుతోంది. ఈ క్రమంలో దర్శకధీరుడు ఏప్రిల్‌లో ప్రెస్ మీట్ నిర్వహించి సినిమాకు సంబంధించిన కీలక విషయాలు వెల్లడిస్తారని సమాచారం. మూవీ బడ్జెట్, నటీనటుల వివరాలు, షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుంది? రిలీజ్ ఎప్పుడు? లాంటి విషయాలు వివరిస్తారని తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.

News February 23, 2025

ఇవాళ జనసేన శాసనసభాపక్ష సమావేశం

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన ఇవాళ జనసేన పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పవన్ భేటీ జరగనుంది. బడ్జెట్‌పై అవగాహన, అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలి? బడ్జెట్‌పై ఎలా చర్చించాలి అనే అంశాలపై పవన్ దిశా నిర్దేశం చేయనున్నారు.

News February 23, 2025

మూడేళ్లలోనే బీటెక్ కంప్లీట్?

image

TG: మూడేళ్లలోనే బీటెక్ కోర్సు పూర్తయ్యేలా సిలబస్ మార్చేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి కసరత్తులు చేస్తోంది. AICTE మోడల్ కరిక్యులాన్ని పరిగణనలోకి తీసుకుని కొత్త కరిక్యులం రూపొందించేందుకు కృషి చేస్తోంది. ఇందుకోసం ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ అధ్యక్షతన ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. నాలుగో ఏడాదిని విద్యార్థులు ఇంటర్న్‌షిప్/ప్రాజెక్టు రూపంలో పూర్తి చేయాల్సి ఉంటుంది.

News February 23, 2025

విషాదం: లారీ, ట్యాంకర్ మధ్య ఇరుక్కుని..

image

AP: తిరుపతి(D) చంద్రగిరిలో విషాదకర ఘటన జరిగింది. లారీ, పాల ట్యాంకర్ మధ్య ఇరుక్కుని గంటలపాటు నరకయాతన అనుభవించిన ఓ డ్రైవర్ మరణించాడు. మారేడుపల్లికి చెందిన సుందరరాజన్ ఓ పని కోసం లారీతో శనివారం అర్ధరాత్రి హెరిటేజ్ ఫ్యాక్టరీకి వచ్చాడు. తర్వాత టైర్లలోని రాళ్లను తొలగిస్తుండగా ట్యాంకర్ హ్యాండ్ బ్రేక్ ఫెయిలై దూసుకొచ్చింది. తప్పించుకునే లోపే రెండింటి మధ్య ఇరుక్కుని చనిపోయాడు. ఉదయం వరకు ఎవరూ గుర్తించలేదు.

News February 23, 2025

INDvsPAK: భారత జట్టులో మార్పులుంటాయా?

image

ఛాంపియన్స్ ట్రోఫీలో ఇవాళ భారత్-పాక్ పోరుకు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌కు టీమ్ ఇండియా ఫైనల్ 11లో ఎవరుంటారనే చర్చ మొదలైంది. బంగ్లాతో ఆడిన జట్టునే కొనసాగిస్తారని విశ్లేషకులు అంటున్నారు. అయితే కుల్దీప్ స్థానంలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, హర్షిత్ ప్లేస్‌లో యార్కర్ల స్పెషలిస్ట్ అర్ష్‌దీప్‌ను తీసుకుంటే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ హైఓల్టేజ్ మ్యాచ్‌కు ఏ ప్లేయర్ బెస్ట్? మీ కామెంట్.