News February 23, 2025

విషాదం: లారీ, ట్యాంకర్ మధ్య ఇరుక్కుని..

image

AP: తిరుపతి(D) చంద్రగిరిలో విషాదకర ఘటన జరిగింది. లారీ, పాల ట్యాంకర్ మధ్య ఇరుక్కుని గంటలపాటు నరకయాతన అనుభవించిన ఓ డ్రైవర్ మరణించాడు. మారేడుపల్లికి చెందిన సుందరరాజన్ ఓ పని కోసం లారీతో శనివారం అర్ధరాత్రి హెరిటేజ్ ఫ్యాక్టరీకి వచ్చాడు. తర్వాత టైర్లలోని రాళ్లను తొలగిస్తుండగా ట్యాంకర్ హ్యాండ్ బ్రేక్ ఫెయిలై దూసుకొచ్చింది. తప్పించుకునే లోపే రెండింటి మధ్య ఇరుక్కుని చనిపోయాడు. ఉదయం వరకు ఎవరూ గుర్తించలేదు.

Similar News

News March 20, 2025

ఓవర్ థింకింగ్ వేధిస్తోందా..? ఈ టిప్స్ పాటించండి

image

ఓవర్‌థింకింగ్‌కు ప్రధాన కారణం నెగిటివిటీ కనుక దానికి దూరంగా ఉండండి. మన నియంత్రణలో లేని విషయాల గురించి ఆలోచించడం మానేయండి. మిమ్మల్ని ఏ విషయమైన ఇబ్బంది పెడితే 72 గంటల పాటు దాన్ని మర్చిపోండి. తర్వాత అది మిమ్మల్ని అంతగా వేధించదు. సోషల్ మీడియా అధికంగా వాడటం వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది కనుక దానికి దూరంగా ఉండండి. ధ్యానం చేయడంతో కంగారు తగ్గడంతో పాటు వాస్తవ పరిస్థితులని అర్థం చేసుకుంటారు.

News March 20, 2025

6 నెలల్లోపు పెట్రోల్ వాహనాల ధరకే EVలు: నితిన్ గడ్కరీ

image

వచ్చే 6 నెలల్లోపు EVల ధర పెట్రోల్ వాహనాలకు సమానం అవుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు మౌలిక సదుపాయాల రంగాన్ని మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. మంచి రహదారులను నిర్మించడం ద్వారా వస్తువుల రవాణా ఖర్చును తగ్గించవచ్చని పేర్కొన్నారు. స్మార్ట్ సిటీల నిర్మాణంతో పాటు స్మార్ట్ ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థ ఏర్పాటుకు కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు.

News March 20, 2025

మార్చి 20: చరిత్రలో ఈరోజు

image

*1351: మహ్మద్ బిన్ తుగ్లక్ మరణం
*1951: భారత్ మాజీ క్రికెటర్ మదన్ లాల్ జననం
*1980: టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ జననం
*1986: హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ జననం
*2008: సినీ నటుడు శోభన్ బాబు మరణం
* అంతర్జాతీయ సంతోష దినోత్సవం
* ప్రపంచ పిచ్చుకల దినోత్సవం

error: Content is protected !!