News October 30, 2025

భారీ వర్షాలు – చేపలకు వ్యాధుల ముప్పు

image

వర్షాల వల్ల వాతావరణంలో తేమ అధికంగా ఉంటుంది. దీని వల్ల చేపలకు చర్మ వ్యాధులు, పొట్ట ఉబ్బు వ్యాధి, శిలీంధ్రాల వల్ల కలిగే వ్యాధుల ముప్పు పెరుగుతుంది. ఈ సమస్యల నివారణకు చేపలకు సమతుల్య ఆహారం ఇవ్వాలి. ఆహారం వేసే ముందు వర్షం పడుతుందా లేదా అని పరిశీలించాలి. తడి మేతను వేయకూడదు. పొడి మేతను వేయాలి. ఒకేసారి ఎక్కువ మేత కాకుండా తొలి 2,3 రోజులు తక్కువ మోతాదులో వేయాలి. ప్రతిరోజూ చేపల ప్రవర్తనను గమనిస్తూ ఉండాలి.

News October 30, 2025

శాంతియుత అణుశక్తికి అండగా భారత్: పురందీశ్వరి

image

స్థిరమైన అభివృద్ధి, ప్రజారోగ్యం, అగ్రికల్చర్ తదితర విషయాల్లో అణుశక్తి కీలక పాత్ర పోషిస్తోందని BJP MP పురందీశ్వరి చెప్పారు. UN సర్వసభ్య సమావేశంలో ఆమె ప్రసంగించారు. ‘అణు విజ్ఞానం, సాంకేతికతను శాంతియుతంగా, భద్రంగా వినియోగించుకోవడంలో ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ బాగా పనిచేస్తోంది. శాంతియుత అణుశక్తికి IND అండగా ఉంటుంది. అణు విద్యుత్ పరిశోధనల్లో దేశం అసాధారణ పురోగతి సాధించింది’ అని తెలిపారు.

News October 30, 2025

టాస్ ఓడిన టీమ్ ఇండియా

image

ఉమెన్స్ వరల్డ్ కప్: భారత్‌తో సెకండ్ సెమీ ఫైనల్లో టాస్ గెలిచిన AUS బ్యాటింగ్ ఎంచుకుంది.
AUS ప్లేయింగ్ XI: లిచ్‌ఫీల్డ్, అలిస్సా హేలీ(C), ఎల్లీస్ పెర్రీ, బెత్ మూనీ, అన్నాబెల్, ఆష్లీ, తహ్లియా, సోఫీ, అలానా, కిమ్ గార్త్, మేగాన్ షుట్
IND ప్లేయింగ్ XI: షెఫాలీ వర్మ, స్మృతి మంధాన, అమంజోత్, జెమీమా, హర్మన్‌ప్రీత్ కౌర్(C), దీప్తి శర్మ, రిచా ఘోష్, రాధా యాదవ్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా సింగ్

News October 30, 2025

84 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) 84 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు నేటి నుండి డిసెంబర్ 15 వరకు అప్లై చేసుకోవచ్చు. ఎంబీఏ, B.L.Sc, MA, డిగ్రీ, CA, CMA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అర్హులు. డిప్యూటీ మేనేజర్, అకౌంటెంట్ పోస్టులకు గరిష్ఠ వయసు 30ఏళ్లు కాగా.. స్టెనోగ్రాఫర్ పోస్టుకు గరిష్ఠ వయసు 28ఏళ్లు. వెబ్‌సైట్: https://nhai.gov.in

News October 30, 2025

వెండి నగలు కొంటున్నారా?

image

బంగారం ధరలు ఆకాశాన్నంటుతుండటంతో చాలామంది వెండి నగలు కొనేందుకు మొగ్గుచూపుతున్నారు. అయితే వెండి కొనే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. బంగారంలానే వెండికీ BIS 92.5% హాల్‌మార్కింగ్‌ ఉంటుంది. వెండి స్వచ్ఛతకు 80, 83.5, 92.5, 95.8, 99, 99.9 గ్రేడ్స్‌ ఉన్నాయి. 92.5తోనే ఆభరణాల్ని ఎక్కువగా చేస్తారు. హాల్‌మార్కింగ్‌ లేదా క్రెడిబిలిటీ ఉండి, సర్టిఫికెట్‌ ఇచ్చే షాపుల్లోనే కొనడం మంచిది.

News October 30, 2025

వరద ప్రాంతాల్లో సిబ్బంది సెలవులు రద్దు

image

TG: వరదలు ముంచెత్తిన ప్రాంతాల్లో ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలను చేపట్టింది. హైడ్రా, SDRF బృందాలతోపాటు బోట్లు, ఇతర సామగ్రిని తక్షణమే ఆ ప్రాంతాలకు పంపాలని CS, DGPలకు CM రేవంత్ సూచించారు. ఆ ప్రాంతాల్లోని ప్రభుత్వ సిబ్బంది సెలవులను రద్దుచేయాలని ఆదేశించారు. ముంపులో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ఇళ్ల పైకప్పులపై చిక్కుకున్న వారికి డ్రోన్ల ద్వారా ఆహారం అందించాలని చెప్పారు.

News October 30, 2025

98 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

చెన్నైలోని ఆర్మ్‌డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ హెవీ వెహికల్ ఫ్యాక్టరీలో 98 jr టెక్నీషియన్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. టెన్త్, NAC/NTC/STC ట్రేడ్ సర్టిఫికెట్‌తో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్టింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://vendor.avnl.co.in/

News October 30, 2025

వరద ప్రాంతాల్లో రేపు సీఎం పర్యటన

image

TG: మొంథా తుఫానుతో భారీ వర్షాలు పడి వరద పోటెత్తిన వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో CM రేవంత్ రేపు ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. నేడు వరంగల్ పర్యటనకు ఆయన వెళ్లాల్సి ఉన్నా ప్రతికూల వాతావరణంతో వాయిదా పడింది. తుఫాను ప్రభావిత జిల్లాల్లో ఇన్‌ఛార్జ్ మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులకు భరోసా ఇవ్వాలని CM సూచించారు. ప్రజలను ఆదుకునేందుకు అన్ని ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని చెప్పారు.

News October 30, 2025

APలో వరదల అప్డేట్స్..

image

* పల్నాడు(D)లోని పులిచింతల ప్రాజెక్టుకు వరద పెరిగింది. దీంతో ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తి 4.85 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
* ఎన్టీఆర్(D) మునేరుకు 1.20 లక్షల క్యూసెక్కుల ప్రవాహం. లింగాల, పెనుగంచిప్రోలు వద్ద కాజ్‌వేలపైకి వరద రావడంతో రాకపోకలు నిలిపివేత.
* గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండపాటూరు వద్ద నల్లమడ వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

News October 30, 2025

NOV 8న నీట్ పీజీ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు

image

NEET PG-2025 ఫేజ్-1 కౌన్సెలింగ్‌ రిజిస్ట్రేషన్, ఫీజు పేమెంటు ఈనెల 28 నుంచి ఆరంభమైంది. MD, MS, PG డిప్లొమో కోర్సుల్లో ఛాయిస్ ఫిల్లింగ్‌కు NOV5 వరకు గడువు ఉంది. 8న సీట్లు కేటాయిస్తారు. 2026 జనవరి నాటికి మొత్తం 4 రౌండ్ల కౌన్సెలింగ్ పూర్తిచేయాలని MCC భావిస్తోంది. ఆల్ ఇండియా PG మెడికల్ సీట్లలో 50% కోటా ఈ కౌన్సెలింగ్‌లో భర్తీ చేస్తారు. సీట్ల అప్రూవల్‌ పెండింగ్‌, సుప్రీంలో కేసులతో కౌన్సెలింగ్ ఆలస్యమైంది.