India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంటలోని <<15543635>>SLBC<<>> టన్నెల్‌లో చిక్కుకున్న 8 మంది కార్మికులను ప్రాణాలతో రక్షించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ‘ఉ.8 గం.కు కార్మికులు లోపలికి వెళ్లారు. ఉ.8.30కి టన్నెల్ బోరింగ్ మిషన్ ఆన్ చేశారు. టన్నెల్‌లో ఒకవైపు నుంచి నీరు లీక్ అయ్యి మట్టి కుంగింది. టీబీఎం ఆపరేటర్ ప్రమాదాన్ని ముందే పసిగట్టి కొందరు కార్మికులను బయటకు పంపించారు’ అని చెప్పారు.

టాక్సిక్ వర్క్ కల్చర్‌పై ఓ ఉద్యోగి Redditలో పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. ‘ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో గడిపేందుకు ఎక్కువ టైమ్ కావాలా! మేం మీ బాధ్యతలను సర్దుబాటు చేస్తున్నాం. పని తక్కువే కాబట్టి జీతం తక్కువగా ఇస్తాం. జాబ్ పోస్టైతే మారదు. కండీషన్స్ ఫామ్‌పై సైన్ చేయండి. మేం చెప్పేంత వరకు ఏ పనీ చేయకండ’ని తన కంపెనీ నుంచి మెయిల్ వచ్చిందన్నారు. ఉద్యోగం తీసేయడానికి ఇదో సాకు అంటూ నెటిజన్లు మండిపడ్డారు.

భారత్, పాక్ మ్యాచంటే క్రికెట్లో మహా సంగ్రామం కిందే లెక్క! లైవ్ స్ట్రీమింగ్, టెలికాస్ట్‌కు కోట్లలో వ్యూస్ వస్తాయి. అందుకే CT25లో ఆదివారం జరిగే దాయాదుల పోరులో జియోహాట్‌స్టార్ 10 సెకన్ల యాడ్‌కు రూ.50లక్షలు వసూలు చేస్తోందని తెలిసింది. IPL మ్యాచుకు తీసుకొనే రూ.18L కన్నా ఇది 3 రెట్లు ఎక్కువ. ఇప్పటికే 90% యాడ్ ఇన్వెంటరీ అయిపోయిందని సమాచారం. ODI WC23లో 10 సెకన్లకు రూ.30L-40L తీసుకోవడం గమనార్హం.

AP: మిర్చి రైతులు, ట్రేడర్లతో CM చంద్రబాబు భేటీ అయ్యారు. రైతుల సమస్యలు వినడంతో పాటు కేంద్ర సాయం, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను CM వారికి వివరించనున్నారు. మిర్చి ధర కొంత కాలంగా తగ్గుతుండటంతో రైతులను ఆదుకునేందుకు సీఎం ఇటీవల ఢిల్లీ కూడా వెళ్లిన విషయం తెలిసిందే. శ్రీలంక, మలేషియా, చైనాలో మిర్చి పంట సరిగా రాకపోవడంతో ఆ దేశాలకు అధిక ధరలకు ఎగుమతి చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

AP: గ్రూప్-2 వాయిదా వేయాలని ప్రభుత్వం రాసిన <<15544005>>లేఖపై<<>> APPSC నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రోస్టర్ విధానంలో తప్పులు ఉన్నాయని, పరీక్షలు వాయిదా వేయాలన్న అభ్యర్థుల విజ్ఞప్తికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అలాగే ఈ అంశంపై మార్చి 11న హైకోర్టులో విచారణ జరగాల్సి ఉంది. అఫిడవిట్ వేసేందుకు ఇంకా సమయం ఉందని అప్పటివరకు పరీక్షలు నిర్వహించవద్దని ప్రభుత్వం కోరింది. దీనిపై APPSC అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

AP: ఈ నెల 28న అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం జరగనుంది. 2025-26 ఏడాదికి సంబంధించిన బడ్జెట్‌ను క్యాబినెట్ ఆమోదించే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రంలోని పలు పెండింగ్ ప్రాజెక్టులపై సమీక్ష చేస్తారని తెలుస్తోంది.

TG: రాష్ట్ర మహిళా శిశుసంక్షేమ శాఖలో కొలువుల జాతరకు ప్రభుత్వం సిద్ధమైంది. 6,399 అంగన్వాడీ టీచర్, 7,837 హెల్పర్ల పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫైల్‌పై మంత్రి సీతక్క సంతకం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే 14,236 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కానుంది.

భారీ ఫంక్షన్ హాల్, డెకరేషన్, డీజే చప్పుళ్ల మధ్య పెళ్లిళ్లు జరుగుతున్న ఈ రోజుల్లో పంజాబ్‌కు చెందిన ఓ జంట వినూత్నంగా ఆలోచించింది. తమ గ్రామంలోని పంట పొలం మధ్య వివాహం చేసుకుని దుర్లభ్ సింగ్, హర్మన్‌కౌర్ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఢిల్లీ సరిహద్దుల్లో పంజాబ్ రైతులు చేసిన పోరాట నినాదాలను ముద్రించిన స్వీట్ బాక్సులను అతిథులకు అందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి.

TG: SLBC <<15542138>>సొరంగం<<>> కూలిపోవడం కాంగ్రెస్ అసమర్థతకు, చేతగానితనానికి నిదర్శనమని హరీశ్‌రావు మండిపడ్డారు. 4 రోజులుగా కొద్దికొద్దిగా మట్టి కూలుతోందని తెలిసినా జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. మరోవైపు, KTR స్పందిస్తూ.. ఘటన ఉ.8:30కు జరిగితే మధ్యాహ్నం దాకా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించడానికి ఏ ప్రయత్నాలు చేస్తున్నారో వెంటనే చెప్పాలని డిమాండ్ చేశారు.

TG: MLC ఎన్నికల వేళ ఓటుకు కాంగ్రెస్ రూ.7 వేలు పంచుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. రూ.7వేలు కాదు రూ.10వేలు ఇచ్చినా గెలుపు BJPదే అని ధీమా వ్యక్తం చేశారు. MP ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పెద్దమొత్తంలో డబ్బులు పంచినా తనను 2 లక్షలకు పైగా ఓట్లతో గెలిపించారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి టీచర్ MLC అభ్యర్థి లేక రోడ్డుమీద పోయే వ్యక్తి మెడలో గంట కట్టారని ఆయన ఎద్దేవా చేశారు.
Sorry, no posts matched your criteria.