India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఛాంపియన్స్ ట్రోఫీలో రేపు హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. గ్రూప్-Aలోని భారత్-పాక్ మధ్య జరిగే ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు ఓడితే టోర్నీ నుంచి దాదాపు నిష్క్రమించినట్లే. ఇప్పటికే కివీస్ చేతిలో పాక్ ఓడిన విషయం తెలిసిందే. ఒకవేళ భారత్ ఓడితే న్యూజిలాండ్‌తో మార్చి 2న జరిగే మ్యాచ్ మనకు కీలకమవుతుంది. టాప్-2లో ఉండే జట్లు మాత్రమే సెమీస్‌కు క్వాలిఫై అవుతాయి. ప్రస్తుతం గ్రూప్-Aలో కివీస్, భారత్ టాప్-2లో ఉన్నాయి.

సాధారణంగా అధిక శాతం మంది ప్రజల కళ్లు గోధుమ రంగులో ఉంటాయి. కానీ, ఇండోనేషియాలోని ఆగ్నేయ సులవేసి ప్రాంతంలో నివసించే బుటన్ తెగకు చెందిన ప్రజలు నీలి కళ్లను కలిగి ఉంటారు. వార్డెన్‌బర్గ్ సిండ్రోమ్ అనే అరుదైన జన్యుపరమైన వ్యాధి వల్ల ఇలా కళ్లు రంగు మారిపోయాయి. పిండం అభివృద్ధి సమయంలోనే ఈ వ్యాధి సంభవిస్తుందని వైద్యులు చెబుతున్నారు. కాగా, చాలా మంది మోడల్స్ లెన్స్ ద్వారా నీలి కళ్లుగా మార్చుకుంటుంటారు.

మిల్కీ బ్యూటీ తమన్నా ‘ఓదెల2’ మూవీలో డిఫరెంట్ గెటప్‌తో దర్శనమిచ్చారు. ఇప్పటివరకు గ్లామర్ పాత్రలతో అలరించిన ఈ అమ్మడు అఘోరి పాత్రలో కనిపించి అందరినీ భయపడేలా చేశారు. <<15542277>>టీజర్‌లో<<>> శివశక్తి అవతారంలో అదరగొట్టారని పలువురు కామెంట్లు చేస్తున్నారు. మ్యూజిక్, విజువల్స్, స్పెషల్ ఎఫెక్ట్స్ అదిరిపోయాయని చెబుతున్నారు. టీజర్ ఎలా ఉందో కామెంట్ చేయండి?

TG: శ్రీశైలం ఎడమ కాలువలోని SLBC టన్నెల్ పైకప్పు కూలిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మొత్తం 50 మంది చిక్కుకోగా ఇప్పటివరకు 43 మందిని బయటకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. మరో ఏడుగురి కోసం గాలింపు కొనసాగుతున్నట్లు సమాచారం. ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరా తీశారు.

TG: హామీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఒక్కటి కూడా అమలు చేయలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. బోధన్‌లో టీచర్ ఎమ్మెల్సీ ప్రచార కార్యక్రమంలో మాట్లాడారు. ఉద్యోగాల భర్తీలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. హామీలు అమలు చేశాకే తాము చర్చకు సిద్ధమని చెప్పారు. రేవంత్ పాలనలో ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.

భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ రేపు పాకిస్థాన్‌తో జరిగే మ్యాచులో 60 బంతుల్లోనే సెంచరీ చేస్తారని మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అన్నారు. ఫామ్‌లో ఉన్నాడా లేడా అనేది ముఖ్యం కాదని చెప్పారు. వైట్ బాల్ క్రికెట్‌లో కోహ్లీతో పాటు రోహిత్ గొప్ప మ్యాచ్ విన్నర్ అని ప్రశంసించారు. పాకిస్థాన్‌పై 19 వన్డేలు ఆడిన హిట్ మ్యాన్ 51.35 సగటుతో 873 పరుగులు చేశారు. ఇందులో 2 సెంచరీలు, 8 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

USAID నిధులపై <<15542230>>ట్రంప్<<>> వివరాలు చెప్పే కొద్దీ కాంగ్రెస్, రాహుల్ గాంధీపై BJP విమర్శల తీవ్రతను పెంచుతోంది. వాటిని ప్రతిపక్షాల గెలుపు కోసమే బైడెన్ కేటాయించినట్టు ఆరోపిస్తోంది. ED, CBI, ఇంటెలిజెన్స్‌తో దర్యాప్తు చేపట్టాలని కోరుతోంది. గతంలో పదేపదే USకు వెళ్లే RG ఇప్పుడెందుకు వెళ్లడం లేదని ప్రశ్నిస్తోంది. ప్రజాస్వామ్యం నాశనమవుతోందంటూ అక్కడ ఆయన అంతర్జాతీయ సమాజ జోక్యం కోరడాన్ని గుర్తుచేస్తోంది.

EPFO కనీస పెన్షన్‌ను పెంచాలని ఉద్యోగులు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తున్నారు. 2014 నుంచి రూ.1000 పెన్షన్ వస్తుండగా, దీనిని రూ.7500కు పెంచాలని కోరుతున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వైద్య ఖర్చులతో ఈ పెన్షన్ చాలడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి PF డిపాజిట్లపై వడ్డీ రేటును ఖరారు చేయడానికి FEB 28న జరిగే భేటీలో దీనిపై EPFO సెంట్రల్ బోర్డు ప్రకటన చేస్తుందనే ఆశతో ఉన్నారు.

TG: హైదరాబాద్‌లోని ఓ అపార్ట్‌మెంటు లిఫ్టు-గోడకు మధ్య <<15540977>>ఇరుక్కున్న బాలుడు<<>> అర్ణవ్ కన్నుమూశాడు. తీవ్ర గాయాలతో నీలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో చనిపోయాడు. నడుము దగ్గర సర్జరీ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

TG: కులగణనలో వివరాలు ఇవ్వని వారి కోసం ప్రభుత్వం మరో అవకాశాన్ని ఇచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. దీనిపై కుట్రలో భాగంగానే విపక్షాలు విమర్శలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. విపక్షాల ట్రాప్‌లో పడొద్దని ప్రజలకు సూచించారు. పారదర్శకతతో తాము ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రజలకు మేలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
Sorry, no posts matched your criteria.