News February 22, 2025

టన్నెల్ ప్రమాదం.. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది: ఎస్పీ

image

TG: శ్రీశైలం ఎడమగట్టు కాలువ <<15542138>>టన్నెల్ ప్రమాదంపై<<>> ఎస్పీ వైభవ్ గైక్వాడ్ స్పందించారు. ప్రమాద సమయంలో 50 మంది కార్మికులు ఉన్నారని, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపారు. గాయపడిన ముగ్గురిని ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ఆయన అక్కడికెళ్లి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. కాసేపట్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అక్కడి చేరుకోనున్నారు.

News February 22, 2025

రేపు యథాతథంగా గ్రూప్-2 మెయిన్స్: APPSC

image

AP: రేపు జరగాల్సిన <<15449738>>గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష<<>> వాయిదా పడిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఏపీపీఎస్సీ ఖండించింది. షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్ జరుగుతుందని స్పష్టం చేసింది. తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నవారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించింది. రోస్టర్ విధానంలో తప్పులు సరిచేసే వరకు పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.

News February 22, 2025

iPhone ప్రైవసీపై ద్వంద్వ ప్రమాణాలు.. మీ కామెంట్

image

యూజర్ల ప్రైవసీపై పాఠాలు చెప్పే APPLE ఇప్పుడు బ్రిటన్లో క్లౌడ్ ఎన్‌క్రిప్షన్ ఆప్షన్ తొలగించడం సంచలనంగా మారింది. దాని ద్వంద్వ ప్రమాణాలపై చర్చ జరుగుతోంది. గతంలో కొన్ని కేసుల్లో నిందితుల iPhones అన్‌లాక్ చేయాలని ED, CBI దానిని కోరాయి. అప్పుడేమో తమ ప్రైవసీ రూల్స్ ప్రకారం కుదరదని తెగేసి చెప్పింది. ఇప్పుడేమో ఇన్వెస్టిగేషన్లకు ఇబ్బందులు వస్తున్నాయని UK అడగ్గానే ADP ఫీచరే తొలగించింది. దీనిపై మీ కామెంట్.

News February 22, 2025

పాముvsముంగిస.. పోరులో దేని బలమెంత?

image

పాము, ముంగిసలకు శత్రుత్వం ఉందని మనం వింటూ ఉంటాం. దీనికి కారణం ముంగిస పిల్లలను పాములు తినడమేనని నిపుణులు చెబుతున్నారు. అందుకే అవి కనిపించగానే ఆడ ముంగిసలు దాడి చేస్తాయంటున్నారు. ‘చురుకుదనమే ముంగిసల బలం. అనుభవం లేనివి కూడా పాములు, కోబ్రాలను ఓడించగలవు. ఒక్కదెబ్బతో చంపగలవు. ఓ మోతాదు విషాన్ని అవి తట్టుకోగలవు. అత్యంత విషపూరితమైన పాము కాటు మాత్రమే ముంగిసను చంపగలదు’ అని చెబుతున్నారు.

News February 22, 2025

SLBC టన్నెల్ వద్ద ప్రమాదం.. చిక్కుకున్న కార్మికులు?

image

TG: శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. మూడు మీటర్ల మేర పైకప్పు పడిపోయింది. ఎడమవైపు సొరంగం దోమలపెంటలోని 14వ కిలోమీటర్ వద్ద ఇవాళ ఉదయం 8.30 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. నాలుగు రోజుల క్రితం ఎడమవైపు సొరంగం వద్ద మళ్లీ పనులు ప్రారంభం కాగా, ఇవాళ ఉదయం పైకప్పు కూలింది. ఇందులో పలువురు కార్మికులు చిక్కుకున్నట్లు సమాచారం అందుతోంది.

News February 22, 2025

పిల్లలకు ఇవి నేర్పించండి

image

భారతదేశం ఉన్నత విలువలు, సంప్రదాయాలకు ప్రసిద్ధి. పిల్లలకు వీటిని నేర్పించడం ద్వారా చిన్న వయసు నుంచే దేశ వారసత్వానికి వారు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇతరులను పలకరించే సమయంలో నమస్కరించడం, చేతులతో ఆహారం తినడం, తినే ముందు ప్రార్థించడం, ప్రకృతిని, పెద్దలను గౌరవించడం, పండుగలు చేసుకోవడం, అతిథులకు మర్యాద చేయడం వంటివి పిల్లలకు తల్లిదండ్రులు నేర్పిస్తే ఉన్నత స్థానానికి తీసుకెళతాయి.

News February 22, 2025

యూజర్లకు iPhone షాక్.. నో ప్రైవసీ!

image

iPhone అంటే ప్రైవసీ. ప్రైవసీ అంటే iPhone. ఇప్పుడా పరిస్థితి మారింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు క్లౌడ్ డేటా స్టోరేజ్‌కు వాడే ఎండ్ టు ఎండ్ సెక్యూరిటీ ఎన్‌క్రిప్షన్ ఫీచర్‌ (ADP)ను బ్రిటన్లో అందించడం లేదు. అంటే ఇకపై క్లౌడ్‌లో యూజర్ దాచుకున్న ఫొటోలు, డాక్యుమెంట్లు, వీడియోలను ఇతరులు యాక్సెస్ చేసేందుకు వీలవుతుంది. గతంలో యాపిల్‌కూ యాక్సెస్ వీలయ్యేది కాదు. ADPని తొలగించడం నిరాశ కలిగించిందని కంపెనీ అంటోంది.

News February 22, 2025

ALERT.. మార్చి 1 నుంచి జాగ్రత్త

image

ఫిబ్రవరిలోనే ఎండలు మండిపోతున్నాయి. మార్చి 1 నుంచి తెలంగాణలో ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 35.3 డిగ్రీల నుంచి 38.2 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ASF(D) పెంచికల్‌పేటలో అత్యధికంగా 38.2 డిగ్రీలు, జగిత్యాల(D) బీర్‌పూర్‌లో 38.1, నిర్మల్(D) గింగాపూర్‌లో 38.1, నాగర్‌కర్నూల్(D) పెద్దముద్నూర్‌లో 38 డిగ్రీల చొప్పున టెంపరేచర్ రికార్డయింది.

News February 22, 2025

రోహిత్‌పై పాక్ దిగ్గజం పొగడ్తలు

image

భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ ప్రశంసల వర్షం కురిపించారు. హిట్ మ్యాన్ లేజీగా ఉన్నా చాలా ప్రత్యేకమని కొనియాడారు. వన్డేల్లో 3 డబుల్ సెంచరీలు చేశారని తెలిపారు. 2008లో ఓ ట్రై సిరీస్‌ ఆడుతున్న సమయంలో అతనిలో సత్తా ఉందని గమనించినట్లు పేర్కొన్నారు. రోహిత్ 10 ఓవర్ల పాటు క్రీజులో ఉంటే తర్వాత వచ్చే బ్యాటర్లకు ఆట ఈజీగా ఉంటుందన్నారు.

News February 22, 2025

వైసీపీ ఎమ్మెల్యేకు నోటీసులు

image

AP: భూ ఆక్రమణ ఆరోపణలపై రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి, కుటుంబీకులకు జాయింట్ కలెక్టర్ నోటీసులు ఇచ్చారు. ఇవాళ రాయచోటిలోని కలెక్టరేట్‌లో విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా ఆకేపాడు, మందపల్లి గ్రామాల్లో వందలాది ఎకరాలను ఆకేపాటి కుటుంబం ఆక్రమించిందని టీడీపీ నేతలు ఆరోపించడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.