India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: డేటా ఇంజినీరింగ్‌లో 90 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. టాస్క్, శ్రీ సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం ఉంటుందని పేర్కొన్నారు. 2021 నుంచి 2024 మధ్యలో బీఎస్సీ, ఎంఎస్సీ, బీటెక్, ఎంటెక్, ఎంసీఏ పూర్తి చేసిన వారు అర్హులని తెలిపారు. మార్చి 1 లోపు <

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేని భక్తుల సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. 10 కంపార్ట్‌మెంట్లలో భక్తులు దర్శనానికై వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 65,327మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 22,804మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా స్వామివారికి రూ.3.52 కోట్ల ఆదాయం లభించింది.

‘ఛావా’ హీరో విక్కీ కౌశల్.. ఈ పేరు ప్రస్తుతం బాలీవుడ్‌లో మాత్రమే కాదు ఇతర ఇండస్ట్రీల్లోనూ మార్మోగుతోంది. విభిన్న స్క్రిప్ట్ సెలక్షన్స్‌తో ప్రత్యేకతను చాటుకుంటున్నారు. URI, సర్దార్ ఉధమ్, సామ్ బహాదుర్ వంటి చిత్రాలతో ఆయన సత్తా చాటారు. ఓ వైపు హీరోగా నటిస్తూనే షారుఖ్ ఖాన్ ‘డుంకీ’, రణ్‌బీర్ కపూర్ ‘సంజూ’ చిత్రాల్లో గెస్ట్ రోల్స్‌తో మెప్పించారు. హీరోయిన్ కత్రినా కైఫ్‌ను 2021లో ప్రేమ వివాహం చేసుకున్నారు.

AP: ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లో 3,4,5 క్లాసులను తిరిగి విలీనం చేయడంపై ఎన్నికల కోడ్ తర్వాత విద్యాశాఖ నిర్ణయం తీసుకోనుంది. గత ప్రభుత్వం ఆయా క్లాసులను UPS, హైస్కూళ్లలో కలిపేయడంపై వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఇక టెన్త్ విద్యార్థులకు సెలవుల్లో స్పెషల్ క్లాసులు తీసుకున్న టీచర్లకు CCL ఆప్షన్ కల్పిస్తామని అధికారులు తెలిపారు. టీచర్ల బదిలీలపై ప్రైమరీ సీనియారిటీ జాబితాను కోడ్ తర్వాత రిలీజ్ చేస్తామన్నారు.

TG: వేసవి ఇంకా పూర్తిగా రాకుండానే విద్యుత్ వినియోగం పీక్స్‌కు చేరుకుంది. రాష్ట్ర చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా 16,293 మెగావాట్ల విద్యుత్‌ను రాష్ట్ర ప్రజలు వాడేశారు. ఈ నెలలోనే 5న 15,820 మెగావాట్ల వాడకం చరిత్ర సృష్టిస్తే ఆ రికార్డును తాజా వాడకం రోజుల వ్యవధిలోనే దాటేసింది. ఫిబ్రవరిలోనే ఇలా ఉంటే ఇక సమ్మర్ పరిస్థితేంటన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఇవాళ రైతు నాయకులతో కేంద్రం మరోసారి సమావేశం కానుంది. పంటలకు మద్దతు ధర ఇచ్చేందుకు చట్టబద్ధమైన హామీ, రుణమాఫీ వంటి డిమాండ్లలో కొంతకాలంగా రైతులు ఉద్యమం చేస్తున్నారు. ఈ సమస్యల పరిష్కారంపై ఈ నెల 14న సమావేశమవ్వగా ఇవాళ కూడా కొనసాగనుంది. SKM, కిసాన్ మజ్దూర్ మోర్చా నేతలతో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి బృందం భేటీ కానుంది.

నమీబియా నుంచి తీసుకొచ్చిన జ్వాల అనే చిరుతను, దాని 4 కూనల్ని అధికారులు మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కులో తాజాగా ప్రవేశపెట్టారు. వీటితో కలిపి ఈ అడవుల్లో ప్రవేశపెట్టిన చీతాల సంఖ్య 12కు చేరింది. మరో 14 చీతాలు అధికారుల సంరక్షణలో ఉన్నాయి. వీటిలో నమీబియా నుంచి 4, దక్షిణాఫ్రికా నుంచి 8 ఉండగా, 14 కూనలు భారత్‌లో పుట్టాయి.

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈరోజు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తలపడనున్నాయి. రెండు జట్లకూ టోర్నీలో ఇదే తొలి మ్యాచ్ కావడం గమనార్హం. భారీ స్కోర్లు నమోదయ్యే లాహోర్ పిచ్‌పై ఈ పోరు జరగనుంది. ఆస్ట్రేలియాకు కమిన్స్, స్టార్క్, హేజిల్‌వుడ్, మార్ష్ వంటి స్టార్ల సేవలు దూరం కాగా.. ఇంగ్లండ్ భారత్ చేతిలో వైట్ వాష్ అయి పేలవంగా కనిపిస్తోంది. మరి రెండింటిలో ఏ జట్టు బోణీ కొడుతుందో చూడాలి.

స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గత కొంతకాలంగా స్పిన్ బౌలింగ్‌లో ఇబ్బంది పడుతున్నారు. ఆ విషయంపై మాజీ స్పిన్నర్ హర్భజన్ విశ్లేషించారు. ‘నాకు తెలిసినంత వరకూ విరాట్ ఆటలో లోపం లేదు. ఇది మానసికంగా ఏర్పడిన అడ్డంకి అనుకుంటున్నా. కొంచెం ఆలస్యంగా బంతిని ఆడుతున్నారు. ఆయన ధీమాగా ఉండాలి. తాను విరాట్ కోహ్లీని అన్న విషయం మరచిపోకూడదు. ఎవరికీ ఏమీ నిరూపించుకునే అవసరం ఆయనకు లేదు’ అని స్పష్టం చేశారు.

AP: నగరాలు, పట్టణాల్లో వసూలు చేస్తున్న చెత్త పన్నును ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులిచ్చింది. 2024 DEC 31 నుంచి రద్దు అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. 2021 NOVలో చెత్త పన్ను వసూలు ప్రారంభమైంది. దీన్ని రద్దు చేస్తామని కూటమి నేతలు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఆ మేరకు తీసుకొచ్చిన మున్సిపల్ చట్ట సవరణను అసెంబ్లీ ఆమోదించగా, గవర్నర్ అనుమతితో ఇటీవల గెజిట్ విడుదలైంది.
Sorry, no posts matched your criteria.