News February 22, 2025

ఇవాళ రైతు నాయకులతో కేంద్రం మరోసారి భేటీ

image

ఇవాళ రైతు నాయకులతో కేంద్రం మరోసారి సమావేశం కానుంది. పంటలకు మద్దతు ధర ఇచ్చేందుకు చట్టబద్ధమైన హామీ, రుణమాఫీ వంటి డిమాండ్లలో కొంతకాలంగా రైతులు ఉద్యమం చేస్తున్నారు. ఈ సమస్యల పరిష్కారంపై ఈ నెల 14న సమావేశమవ్వగా ఇవాళ కూడా కొనసాగనుంది. SKM, కిసాన్ మజ్దూర్ మోర్చా నేతలతో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి బృందం భేటీ కానుంది.

Similar News

News March 25, 2025

లీటర్ పెట్రోల్‌పై రూ.17 తగ్గించాలి: షర్మిల

image

పెట్రోల్, డీజిల్ ధరలపై ఏపీ సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు లీటరుపై రూ.17 తగ్గించాలని APCC చీఫ్ షర్మిల డిమాండ్ చేశారు. ‘రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ రూ.109.60, డీజిల్ రూ.97.47గా ఉంది. TN, TGతో పోల్చినా APలో ధరలు ఎక్కువ. పెట్రోల్, డీజిల్ మీద పన్నుల తగ్గింపుపై TDP, YCP నీచ రాజకీయాలు చేస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు CBN రూ.17 తగ్గించవచ్చని చెప్పారు. ఇప్పుడు వారి హామీని నిలబెట్టుకోవాలి’ అని కోరారు.

News March 25, 2025

ఏటీఎం ఛార్జీల పెరుగుదల.. ఎప్పటినుంచంటే..

image

ఈ ఏడాది మే 1 నుంచి ఏటీఎం ఛార్జీల బాదుడు పెరగనుంది. ఇతర బ్యాంకుల ఏటీఎంలలో మెట్రో ప్రాంతాల్లో 5సార్లు, నాన్ మెట్రో ప్రాంతాల్లో 3సార్లు ప్రతి నెలా ఉచిత లావాదేవీలు జరుపుకోవచ్చు. మే 1 నుంచి ఆ పరిధి దాటితే డబ్బు విత్‌డ్రాకు ఇప్పుడున్న రూ.17 నుంచి రూ.19కి, బాలెన్స్ చెకింగ్‌కు ఇప్పుడున్న రూ.6 నుంచి రూ.7కి ఛార్జీలు పెరగనున్నాయి.

News March 25, 2025

జమ్మూకశ్మీర్ ఎప్పటికీ భారత్‌దే: భారత ప్రతినిధి

image

జమ్మూకశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని భారత శాశ్వత ప్రతినిధి తేల్చిచెప్పారు. పాకిస్థాన్ ఆక్రమించుకున్న ప్రాంతాలను భారత్‌కు వెంటనే అప్పగించాలని స్పష్టం చేశారు. UNOలో పాక్ అనవసరంగా జమ్మూకశ్మీర్ ప్రస్తావన తీసుకొస్తోందని, ఎన్ని అవాస్తవాలు చెప్పినా ఆ ప్రాంతం భారత్‌‌కే చెందుతుందని అన్నారు. UNO శాంతి పరిరక్షణ చర్చలో జమ్మూకశ్మీర్ అంశాన్ని పాకిస్థాన్ ప్రతినిధి లేవనెత్తగా భారత్ దీటుగా బదులిచ్చింది.

error: Content is protected !!