India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: రాష్ట్రంలోని గ్రూప్-2 అభ్యర్థుల సమస్యలు పరిష్కరించేందుకు తాను కృషి చేస్తున్నానని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలంటూ అభ్యర్థుల నుంచి వినతులు వెల్లువెత్తుతున్నాయని ట్వీట్ చేశారు. వారి బాధ, ఆందోళనను అర్థం చేసుకుని లీగల్ టీమ్‌తో చర్చిస్తున్నట్లు తెలిపారు. దీనికి ఏదో ఒక పరిష్కారం చూపెడతామని పేర్కొన్నారు. రోస్టర్ విధానంలో తప్పులు సరిచేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.

తాను ఇటీవల ఆస్పత్రిలో చేరినప్పుడు అండగా నిలిచిన ఏఆర్ రెహమాన్‌కు ఆయన మాజీ భార్య సైరా ధన్యవాదాలు తెలిపారు. క్లిష్ట సమయంలో సపోర్ట్ ఇచ్చిన సన్నిహితులు, స్నేహితులకు కూడా ఆమె థాంక్స్ చెప్పారు. వారు ఇచ్చిన ప్రోత్సాహంతో తాను ఎంతో సంతోషంగా ఉన్నానని పేర్కొన్నారు. కాగా 29 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ ఇటీవల రెహమాన్-సైరా విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.

TG: పెళ్లి మండపంలోనే వధువు తండ్రి గుండెపోటుతో కుప్పకూలిన ఘటన కామారెడ్డిలో జరిగింది. బిక్కనూరు(M) రామేశ్వర్ పల్లికి చెందిన బాలచంద్రం(56) తన కుమార్తెకు వివాహం జరిపిస్తున్నారు. ఈ క్రమంలో అల్లుడి కాళ్లు కడిగి కన్యాదానం పూర్తి చేసి మండపంలోనే కుప్పకూలారు. ఆస్పత్రికి తరలించి వైద్యులు పరీక్షించేలోపే ఆయన మృతి చెందారు. ఈ ఉదయం ఇదే జిల్లాలో టెన్త్ అమ్మాయి గుండెపోటుతో చనిపోయింది.

బ్రిటిష్ మీడియా సంస్థ BBC ఇండియాకు ED రూ.3.4కోట్లకు పైగా ఫైన్ వేసింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి(FDI), FEMA నిబంధనలు ఉల్లంఘించిందని 2023లో ఆ సంస్థకు ED షోకాజ్ నోటీసులిచ్చింది. తాజాగా, ఈ కేసు విచారణకు రాగా సంస్థతో పాటు ముగ్గురు డైరెక్టర్స్‌కు రూ.1.14కోట్ల చొప్పున ఫైన్ విధించింది. భారత్‌లో డిజిటల్ మీడియా FDI 26% మించకూడదనేది నిబంధన. BBC దీన్ని పట్టించుకోలేదని ED చర్యలు తీసుకుంది.

TG: మాజీ సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే దక్షిణ తెలంగాణ ప్రతి ఏడాది 100 TMCల నీటిని కోల్పోతోందని మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు. పదేళ్ల నుంచి భూసేకరణ చేయలేదని, నిధులు కేటాయించలేదని విమర్శించారు. SLBC సొరంగం ద్వారా నిండే రిజర్వాయర్లు, డిండి లిఫ్ట్, పాలమూరు-రంగారెడ్డిలను ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. రేవంత్ నాయకత్వంలో మూడేళ్లలో కృష్ణా బేసిన్‌లోని అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

దొంగ నోట్లను అరికట్టేందుకు జపాన్ వాడుతున్న టెక్నాలజీపై ప్రశంసలొస్తున్నాయి. అధునాతన 3D హోలోగ్రాఫిక్ టెక్నాలజీ కలిగి ఉన్న కొత్త నోట్లను ప్రవేశపెట్టింది. 10,000 యెన్, 5,000 & 1,000 యెన్ నోట్లలో ఇది అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా పేపర్ కరెన్సీలో ఇలాంటి హోలోగ్రామ్ టెక్నాలజీ ఉపయోగించడం ఇదే తొలిసారి. అక్కడ డిజిటల్ చెల్లింపులు పెరిగినప్పటికీ నగదు లావాదేవీలు సైతం అదే స్థాయిలో జరుగుతున్నాయి.

AP: రాష్ట్రంలోని 164 మోడల్స్ స్కూళ్లలో ఆరో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 25 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించగా, ఏప్రిల్ 20వ తేదీన ఉదయం 10గంటల – మధ్యాహ్నం 12గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. 5వ తరగతి స్థాయిలో ఉండే ఈ పరీక్షను తెలుగు/ఇంగ్లిష్ మీడియంలో రాయొచ్చు. అప్లికేషన్ వివరాలను పై ఫొటోలో, నోటిఫికేషన్ వివరాలను ఇక్కడ <

వేసవి ఎండలు ముదరకముందే ఏపీ, తెలంగాణ మధ్య ‘నీటి మంటలు’ ప్రారంభమయ్యాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి ఏపీ ఇప్పటికే వాటాను మించి నీటిని వాడుకుందని తెలంగాణ సర్కారు KRMBకి ఫిర్యాదు చేసింది. ఇక నీటిని తీసుకునేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. ప్రతిపక్ష BRS సైతం ఈ విషయంలో కాంగ్రెస్ సర్కారుపై ఒత్తిడి తెస్తోంది. మరి దీనిపై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

TG: సీఎం రేవంత్ కక్షపూరితంగానే మాజీ సీఎం కేసీఆర్‌పై ఆరోపణలు చేస్తున్నారని BRS నేత <<15535190>>హరీశ్ రావు<<>> విమర్శించారు. అరుపులు, పెడబొబ్బలతో తాగునీటి కష్టాలు తీర్చలేరని మండిపడ్డారు. ‘చర్చలకు నేను సిద్ధం. ఏరోజు, ఎక్కడికి రావాలో నువ్వే చెప్పు రేవంత్. నీ ఇంట్లో పెట్టినా సరే తప్పకుండా వస్తా. ఆరు గ్యారంటీలు, 420 హామీలు, అభివృద్ధిపై చర్చించి, నీ పిచ్చి ప్రేలాపనలను ఉతికి ఆరేసి చాకిరేవు పెడతా’ అని ట్వీట్ చేశారు.

చైనాను కొవిడ్ మాదిరిగా మరో కొత్త వైరస్ వణికిస్తున్నట్లు సమాచారం. సైంటిస్టులు ‘HKU5-COV-2’ అనే వైరస్‌ను గబ్బిలాల్లో గుర్తించారు. కరోనాలాగే ఇది కూడా జంతువుల నుంచి మానవులకు సంక్రమిస్తుందని వారు భావిస్తున్నారు. ఈ వైరస్‌ను మెర్బెకో వైరస్‌తోపాటు ప్రాణాంతక మెర్స్-కోవ్ ఉపరకానికి చెందినదిగా పరిశోధకులు తేల్చారు. దీనిని తొలుత హాంకాంగ్‌లోని జపనీస్ పిపిస్ట్రెల్ రకం గబ్బిలాల్లో గుర్తించారు.
Sorry, no posts matched your criteria.