News February 21, 2025

అక్కడ దొంగ నోట్లు తయారు చేయలేరు!

image

దొంగ నోట్లను అరికట్టేందుకు జపాన్ వాడుతున్న టెక్నాలజీపై ప్రశంసలొస్తున్నాయి. అధునాతన 3D హోలోగ్రాఫిక్ టెక్నాలజీ కలిగి ఉన్న కొత్త నోట్లను ప్రవేశపెట్టింది. 10,000 యెన్, 5,000 & 1,000 యెన్ నోట్లలో ఇది అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా పేపర్ కరెన్సీలో ఇలాంటి హోలోగ్రామ్‌ టెక్నాలజీ ఉపయోగించడం ఇదే తొలిసారి. అక్కడ డిజిటల్ చెల్లింపులు పెరిగినప్పటికీ నగదు లావాదేవీలు సైతం అదే స్థాయిలో జరుగుతున్నాయి.

Similar News

News March 26, 2025

సోనూసూద్ భార్యకు యాక్సిడెంట్.. ఇప్పుడెలా ఉందంటే?

image

రోడ్డు <<15881657>>ప్రమాదంలో<<>> గాయపడ్డ నటుడు సోనూసూద్ భార్య సోనాలీ ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని నాగ్‌పూర్ మ్యాక్స్ ఆసుపత్రి ప్రకటన విడుదల చేసింది. కోల్‌కతా నుంచి వచ్చిన సోనాలీని ఆమె సోదరి సునీత, మేనల్లుడు సిద్ధార్థ్ ఎయిర్‌పోర్టులో రిసీవ్ చేసుకొని ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద తీవ్రత అధికంగా ఉన్నా ఎయిర్‌బ్యాగులు తెరుచుకోవడంతో ప్రాణాలకు ముప్పు తప్పింది.

News March 26, 2025

యాడ్ ఫ్రీ ఇన్‌స్టా కోసం సబ్‌స్క్రిప్షన్.. ఎక్కడంటే?

image

యాడ్ ఫ్రీ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ కోసం సబ్‌స్క్రిప్షన్‌ను తేవాలని ‘మెటా’ యోచిస్తోంది. తాజాగా యూరప్‌లో ఈ విధానాన్ని అమలుచేసేందుకు సిద్ధమైంది. యూరోపియన్ నియంత్రణ సంస్థలకు ‘మెటా’ తన ప్రతిపాదలను పంపింది. మొబైల్‌లో యాడ్‌ఫ్రీ ఇన్‌స్టా కోసం నెలకు $14(రూ.1200), డెస్క్‌టాప్‌లో FB& INSTA కోసం 17 డాలర్ల వరకు ఉండనుంది. అక్కడ అమలైతే అన్నిచోట్లా తీసుకొచ్చే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

News March 26, 2025

చేయని తప్పునకు 46 ఏళ్ల జైలు శిక్ష

image

జపాన్‌లో ఓ వ్యక్తి చేయని తప్పునకు 46 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు. ఇందుకు కోర్టు అతడికి ₹12కోట్ల నష్ట పరిహారమివ్వాలని పోలీసులను ఆదేశించింది. 1966లో ఇవావో హకమాడ అనే వ్యక్తి ఓ సోయాబీన్ ప్లాంట్‌లో ఉద్యోగంలో చేరారు. ఆ సమయంలో ప్లాంట్ యజమాని, భార్యాపిల్లలు వారింట్లోనే కత్తిపోట్లకు గురై చనిపోయారు. ఆ నేరాన్ని అతడే చేశాడని పోలీసులు తప్పుడు సాక్ష్యాలతో అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా మరణశిక్ష విధించింది.

error: Content is protected !!