India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ట్రంప్‌కు కెనడా ప్రధాని కౌంటర్ అటాక్ ఇచ్చారు. గురువారం రాత్రి జరిగిన హాకీ ఛాంఫియన్‌షిప్ ఫైనల్‌లో USA ను కెనడా3-2 తేడాతో ఓడించింది. దీంతో ట్రూడో మీరు తమదేశాన్ని, ఆటను తీసుకోలేరని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అయితే త్వరలో కెనడా 51వ రాష్ట్రంగా అమెరికాలో చేరొచ్చంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. దీంతో ట్రూడో పరోక్షంగా ట్రంప్‌కు చురకలు అంటించారు. అదేవిధంగా USA వస్తువులపై 25శాతం పన్ను విధించనున్నట్లు తెలిపారు.

సాధారణంగా మనిషి శరీరంలో రెండు కిడ్నీలుంటాయి. కానీ రక్షణ శాఖలో పనిచేస్తోన్న 47 ఏళ్ల శాస్త్రవేత్త దేవేంద్ర బార్లేవార్ శరీరంలో ఏకంగా 5 కిడ్నీలు ఉన్నాయి. కానీ, వాటిలో ఒకటి మాత్రమే పనిచేస్తుంది. ఇతనికి కిడ్నీలు పాడవడంతో ఇప్పటికే రెండు సార్లు డొనేట్ చేసిన కిడ్నీలను అమర్చారు. ఇవి కూడా పాడవడంతో ఆయనకు మూడోసారి అరుదైన కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేశారు. దీంతో శరీరంలో మొత్తం 5 మూత్ర పిండాలున్నాయి.

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ‘తండేల్’ సినిమా థియేటర్లలో అదరగొడుతోంది. రెండు వారాలు పూర్తిచేసుకొని సక్సెస్‌ఫుల్‌గా మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చిందని ‘బ్లాక్ బస్టర్ లవ్ సునామీ’ అంటూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. ఇప్పటికే రూ.100+కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. అయితే, నాలుగు వారాల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది.

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారిపై కేసులు నమోదయ్యాయి. ఇటీవల ఆయన కుంభమేళాలో స్నానం ఆచరించిన సమయంలో తీసిన ఫొటోలను కొందరు మార్ఫింగ్ చేశారు. దీనిపై జనసేన కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, బాపట్ల, విజయవాడ పీఎస్‌లలో కేసులు నమోదయ్యాయి.

TG: పేదలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు ప్రభుత్వం నేడు శ్రీకారం చుట్టనుంది. నారాయణపేట(D) అప్పకపల్లెలో CM రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. తొలి దశలో 72,045 ఇళ్లకుగాను MLC ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో పనులు ప్రారంభమవుతాయి. లబ్ధిదారులకు బేస్‌మెంట్ లెవెల్‌లో ₹లక్ష, గోడలు నిర్మించాక ₹1.25 లక్షలు, స్లాబ్ తర్వాత ₹1.75 లక్షలు, నిర్మాణం పూర్తయ్యాక ₹లక్ష ప్రభుత్వం అందజేయనుంది.

AP: తనకు బెయిల్ మంజూరు చేయాలని వైసీపీ నేత వల్లభనేని వంశీ దాఖలు చేసిన పిటిషన్‌పై విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ వేసేందుకు 3 రోజుల సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోర్టును కోరింది. దీంతో తదుపరి విచారణను కోర్టు వాయిదా వేసింది. అటు హైకోర్టు నిన్న వంశీ బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ చేసిన సంగతి తెలిసిందే.

ఎప్పటికంటే కొంత ముందే వేసవి వచ్చేసింది. అంటే చాలా చోట్ల మంచినీటి కష్టాలు కూడా ముందే రానున్నాయి. ఇలాంటి సమయంలో మీరు ఈ చిన్న చిట్కా వాడటం వల్ల వందల లీటర్ల నీటి వృథాను అరికట్టవచ్చు. ఉదయాన్నే బ్రష్ చేసేప్పుడు ట్యాప్‌తో కాకుండా మగ్‌లో నీరు పట్టుకోవడం వల్ల నెలకు సుమారు 750 లీటర్ల వాటర్ సేవ్ చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనిని అలవాటు చేసుకుంటే ఏడాదికి 9వేల లీటర్లు సేవ్ అవుతాయి. SHARE IT

రిటైల్ రుణాల(హౌస్, వెహికల్, ఎడ్యుకేషన్, పర్సనల్ లోన్)పై వడ్డీ రేట్లను 0.25 శాతం తగ్గిస్తున్నట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB) వెల్లడించింది. ఈ నిర్ణయం ఈ నెల 10 నుంచే వర్తిస్తుందని తెలిపింది. అలాగే మార్చి 31 వరకు తీసుకునే గృహ రుణాలపై ఎలాంటి ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్ ఛార్జీలు ఉండవని పేర్కొంది. ఇకపై హౌస్ లోన్‌కు 8.15%, వెహికల్స్‌కు 8.50%, వ్యక్తిగత రుణానికి 11.25% నుంచి వడ్డీ రేటు ప్రారంభమవుతుంది.

TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. బంజారాహిల్స్, ముషీరాబాద్ పోలీస్ స్టేషన్లలో తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఎలాంటి కారణాలు లేకుండా తనపై కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. బిల్డర్లు, కాంట్రాక్టర్ల వద్ద నుంచి సీఎం రేవంత్ రూ.2,500 కోట్లు తీసుకున్నారని కేటీఆర్ ఆరోపించడంపై ఈ కేసులు నమోదయ్యాయి.

ఎంఎస్ ధోనీ ప్రస్తుతం IPL మాత్రమే ఆడుతున్నారు. గత కొన్నేళ్లుగా ప్రతి ఏటా ‘ధోనీకి ఆఖరి IPL’ అంటూ ప్రచారం నడుస్తోంది. దానిపై ఆయన తాజాగా స్పందించారు. ‘క్రికెట్‌ను చిన్నతనంలో ఎలా ఎంజాయ్ చేశానో అదే తరహాలో ఇప్పుడు కూడా చేయాలనుకుంటున్నా. బహుశా ఇంకొన్నేళ్లు ఆడతానేమో. ఆడినంత కాలం ఆస్వాదిస్తా’ అని పేర్కొన్నారు. దీంతో ధోనీ మరికొన్నేళ్లు ఆడతారన్న భరోసా వచ్చిందంటూ CSK ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.