India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నియంత్రణ రేఖ (LOC) వద్ద కీలక పరిణామం చోటు చేసుకోబోతోందని తెలిసింది. భారత్, పాకిస్థాన్ ఆర్మీలు నేడు ఫ్లాగ్ మీటింగ్‌లో పాల్గొంటాయని సమాచారం. మరికాసేపట్లో బ్రిగేడియర్ లెవల్ ఆఫీసర్లు సమావేశం అవుతారు. 2021 తర్వాత పాక్‌తో ఇలాంటి మీటింగ్ జరగడం ఇదే తొలిసారి. కాగా మరోవైపు జమ్మూకశ్మీర్ పూంచ్ జిల్లాలోని నక్కర్ కోట్లో పేలుడు సంభవించింది. ఇది పాక్ పన్నాగమేనని ఆర్మీ అనుమానిస్తోంది.

TG: ఖమ్మంలోని ఇల్లందు క్రాస్ వద్ద ఉన్న శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో విషాదం నెలకొంది. ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థిని డేగల యోగానందిని(17) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉదయం స్టడీ అవర్‌కు హాజరైన ఆమె తిరిగి హాస్టల్‌కు వెళ్లి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి స్వస్థలం AP అల్లూరి జిల్లా ఎటపాకగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అసభ్య జోక్‌లు, సోషల్ మీడియాలో విచ్చలవిడితనం హెచ్చుమీరుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం OTTలకు హెచ్చరికలు జారీ చేసింది. నైతిక విలువలకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. నైతిక నియమాల ఉల్లంఘన జరిగినట్లు తేలితే OTTలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. క్యూరేటెడ్ కంటెంట్, అసభ్యకర, శృంగారభరిత, బూతు సమాచారం విస్తృతంగా ప్రసారం అవుతుండటంతో పలువురు ఎంపీల ఫిర్యాదులతో కేంద్రం ఈ అడ్వైజరీ జారీ చేసింది.

టైమ్ మ్యాగజైన్ 13 మందితో ప్రకటించిన ‘ఉమెన్ ఆఫ్ ది ఇయర్-2025’ జాబితాలో భారత్ నుంచి పూర్ణిమా దేవి బర్మన్(45) ఒక్కరే చోటు దక్కించుకున్నారు. అస్సాంకు చెందిన ఈమె 18 ఏళ్లుగా greater adjutant అనే జాతి కొంగల సంరక్షణకు కృషిచేస్తున్నారు. అంతరించిపోయే దశ నుంచి ప్రస్తుతం వాటి సంఖ్య 1,800 దాటింది. ఆమె స్ఫూర్తితో దేశవ్యాప్తంగా 20వేల మంది మహిళలు ‘హర్గీలా ఆర్మీ’గా ఏర్పడి అనేక రకాల పక్షులను సంరక్షిస్తున్నారు.

FBI తొమ్మిదో డైరెక్టర్‌గా నియమితులైన కాష్ పటేల్ అధ్యక్షుడు ట్రంప్, అటార్నీ జనరల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ‘ఇది నాకు దక్కిన గౌరవం. మన న్యాయ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం క్షీణించింది. కానీ, అది నేటితో ముగుస్తుంది. డైరెక్టర్‌గా నా లక్ష్యం స్పష్టంగా ఉంది. FBIపై ప్రజల్లో నమ్మకాన్ని తీసుకురావాలి. అమెరికన్లకు హాని కలిగించాలని కోరుకునే వారు ఈ భూమి మీద ఎక్కడున్నా మిమ్మల్ని వదిలిపెట్టము’ అని Xలో పేర్కొన్నారు.

హిందీకి తాము వ్యతిరేకమని, తమపై ఆ భాషను రుద్దలేరని కొందరు నిన్న ‘#GetOutModi’ హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ చేసిన విషయం తెలిసిందే. ఇవాళ బీజేపీ శ్రేణులు DMK ప్రభుత్వం టార్గెట్‌గా ‘#GetOutStalin’ అని ట్వీట్స్ చేస్తూ Xను షేక్ చేస్తున్నాయి. TNలో అవినీతి పెరిగిందని, పాలన గాడి తప్పిందని, వారసత్వ రాజకీయాలు జరుగుతున్నాయని BJP ఆరోపిస్తూ 5లక్షలు+ ట్వీట్స్ చేయడంతో దేశమంతా తమిళనాడు గురించి మాట్లాడుకుంటోంది.

ఈ నెల 28న ఆకాశంలో ఓ అద్భుతం ఆవిష్కృతం కానుంది. సౌరకుటుంబంలోని 7 గ్రహాలు ఒకే వరుసలోకి రానున్నాయి. శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్, బుధ గ్రహాలన్నీ ఒకే లైన్‌లో దర్శనమివ్వనున్నాయి. భారత్, అమెరికా, మెక్సికో, కెనడా ప్రజలకు ఈ అద్భుతం కనువిందు చేయనుంది. ఈ ఖగోళ దృశ్యం తిరిగి కనిపించేది 2040లోనే.

కర్ణాటక ప్రజలకు అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం మరో షాకిచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. నందిని పాల ధరను లీటరుకు రూ.5 పెంచేందుకు యోచిస్తున్నట్టు సమాచారం. ఇదే జరిగితే ధర రూ.47.Lకు చేరుకుంటుంది. రేటు పెంచాలని కర్ణాటక పాల సంఘం ఇప్పటికే సిఫార్స్ చేసింది. నిధుల లేమితో ఇబ్బంది పడుతున్న సిద్దరామయ్య ప్రభుత్వం పెంపుకే మొగ్గు చూపొచ్చని తెలుస్తోంది. కొన్ని నెలల క్రితమే రూ.2 పెంచిన సంగతి తెలిసిందే.

కాంగ్రెస్‌ది 2 నాలుకల ధోరణి అని, అదో కులతత్వ పార్టీ అని BSP చీఫ్ మాయావతి విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, SPతో కలిసుంటే BJP గెలిచేదే కాదన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై స్పందించారు. ‘కాంగ్రెస్ అధికారంలో లేదా బలంగా ఉన్న చోట BSP కార్యకర్తలపై కులతత్వ వైఖరినే ప్రదర్శించేది. UPలో వారు వీక్. అందుకే పొత్తు గురించి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇది వంచన కాకుంటే మరేంటి’ అని ఆమె ప్రశ్నించారు.

AP: జాతీయ స్థాయిలో సత్తా చాటిన రాష్ట్ర పోలీసులను సీఎం చంద్రబాబు అభినందించారు. ఇంతే అంకితభావంతో ప్రజలకు సేవ చేయడంలో నిరంతర విజయం సాధించాలని ఆకాంక్షించారు. రాంచీలో జరిగిన 68వ ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్లో డీఐజీ అంబురాజన్ నేతృత్వంలోని రాష్ట్ర పోలీస్ బృందం వివిధ కేటగిరీల్లో రాణించి రెండో స్థానంలో నిలిచింది. 4 గోల్డ్, ఒక సిల్వర్, 2 బ్రాంజ్ మెడల్స్ సాధించింది.
Sorry, no posts matched your criteria.