News February 21, 2025

నేను ‘కింగ్’ని.. ట్రంప్ పోస్ట్

image

US అధ్యక్షుడు ట్రంప్ తనకు తానే రాజుగా ప్రకటించుకున్నారు. ‘CONGESTION PRICING’ను రద్దు చేసి న్యూయార్క్ నగరాన్ని సేవ్ చేశానని చెబుతూ ‘కింగ్’గా అనౌన్స్ చేసుకున్నారు. కాసేపటికే ట్రంప్ తలపై కిరీటం ఉంచి ఎడిట్ చేసిన ఫొటోను WHITE HOUSE ట్వీట్ చేసింది. న్యూయార్క్‌లో బిజీ టైంలో భారీ ట్రాఫిక్ ఉన్న ఏరియాల్లోకి ప్రవేశించే డ్రైవర్లకు 9 డాలర్లు ఛార్జ్ చేస్తారు. దీన్నే ‘CONGESTION PRICING’ అంటారు.

News February 21, 2025

55 మంది ప్రభుత్వ వైద్యులపై వేటు

image

AP: రాష్ట్రంలోని బోధన, ప్రభుత్వాసుపత్రుల్లో ఉన్న 55 మంది వైద్యులపై వేటు పడింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 78మంది వైద్యులు విధులకు గైర్హాజరవుతున్నారని 2023లో సామాజిక కార్యకర్త కర్నూలు లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టాలని DMEని లోకాయుక్త ఆదేశించింది. ఈ మేరకు 78మందికి DME షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వారిలో ఇప్పటి వరకూ 55మంది స్పందించకపోవడంతో విధుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

News February 20, 2025

టమాటా ధరల పతనంపై ప్రభుత్వం చర్యలు

image

AP: రాష్ట్రంలో <<15523622>>టమాటా<<>> ధరల పతనంపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. టమాటాలను మార్కెటింగ్ శాఖ ద్వారా రేపటి నుంచి కొనుగోలు చేయాలని ఉన్నతాధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. వాటిని రైతు బజార్లలో విక్రయించాలని, పొరుగు రాష్ట్రాలకు అవసరం మేరకు ఎగుమతి చేయాలన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని మంత్రి భరోసా కల్పించారు.

News February 20, 2025

వాట్సాప్ యూజర్లకు అలర్ట్

image

తమ వాట్సాప్ అకౌంట్లు హ్యాక్ అయ్యాయంటూ పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తమ నంబర్ నుంచి కాంటాక్ట్స్‌లో ఉన్న వారిని డబ్బులు అడుగుతున్నారని చెబుతున్నారు. ఒకవేళ మీ వాట్సాప్ ఖాతా హ్యాక్ అయితే వెంటనే వాట్సాప్ సపోర్ట్‌ను కాంటాక్ట్ చేసి రిపోర్ట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఖాతా హ్యాక్ అవకుండా ఉండటానికి జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. మీకూ ఇలా జరిగిందా కామెంట్ చేయండి.

News February 20, 2025

ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ

image

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, శుక్రవారం డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఆస్పత్రిలో చేరడానికి గల కారణాలేంటో తెలియాల్సి ఉంది. గతేడాది DECలో సోనియా 78వ పడిలోకి అడుగుపెట్టారు.

News February 20, 2025

గిల్.. ఫ్యూచర్ స్టార్!

image

టీమ్ ఇండియాకు కొత్త సూపర్ స్టార్ వచ్చేశాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచులో ఒత్తిడిలోనూ అద్భుత ఆటతీరుతో ఇండియాకు విజయాన్ని అందించాడు గిల్. ఆరంభంలో దూకుడుగా ఆడిన ఈ టాలెంటెడ్ ప్లేయర్.. మిడిల్ ఓవర్లలో పరిస్థితులకు తగ్గట్టుగా గేర్లు మార్చారు. మిగతా ప్లేయర్లు వెనుదిరుగుతున్నా ఎక్కడా టెంప్ట్ అవ్వకుండా చివరి వరకు కూల్‌గా ఆడారు. ఇందుకేనేమో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నం.1 అయ్యాడు ఈ ఫ్యూచర్ స్టార్.

News February 20, 2025

ఆ రెండు భాషల్లో పాటలు పాడటం కష్టం: శ్రేయా ఘోషల్

image

శ్రేయా ఘోషల్ పాడుతుంటే అలానే వింటూ ఉండిపోవాలని అనిపిస్తుంది. తీయని గొంతుతో అవలీలగా ఆమె పాటలు పాడేస్తుంటారు. కానీ తనకు మలయాళం, తమిళ భాషల్లో పాటలు పాడటం కష్టంగా ఉంటుందని తాజాగా ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తెలిపారు. అయితే ఇతర భాషలతో పాటు ఈ రెండు లాంగ్వేజ్‌లలోనూ ఆమె సూపర్ హిట్ సాంగ్స్ పాడారు. పలు అవార్డులు కూడా గెలుచుకున్నారు.

News February 20, 2025

ఢిల్లీ మంత్రులకు శాఖల కేటాయింపు

image

*రేఖాగుప్తా (సీఎం): ఆర్థిక, రెవెన్యూ, సర్వీసెస్, ప్లానింగ్, ల్యాండ్&బిల్డింగ్
*పర్వేశ్ సాహిబ్ సింగ్: PWD, అసెంబ్లీ వ్యవహారాలు, వాటర్
*ఆశిశ్ సూద్: హోం, పవర్, విద్య
*మంజిదార్ సింగ్ సిర్సా: ఫుడ్&సప్లై, అటవీ, పర్యావరణం, పరిశ్రమలు
*రవీందర్ సింగ్: సాంఘిక సంక్షేమం, సహకార శాఖ
*కపిల్ మిశ్రా: న్యాయ, కార్మిక, పర్యాటక, ఆర్ట్&కల్చర్
*పంకజ్ కుమార్ సింగ్: ఆరోగ్యం, రవాణా, ఐటీ

News February 20, 2025

మీ కేసులకు భయపడేది లేదు: YS జగన్

image

AP: మిర్చి రైతులు సంక్షోభంలో ఉంటే తాము స్పందించే వరకు ప్రభుత్వంలో కదలిక రాలేదని CM చంద్రబాబును ఉద్దేశిస్తూ YS జగన్ ట్వీట్ చేశారు. ‘ఢిల్లీ CM ప్రమాణ స్వీకారానికి వెళ్తూ రైతుల కోసమే అన్నట్లు కలరింగ్‌ ఇచ్చారు. ఎప్పుడూ మిర్చి కొనని నాఫెడ్‌ కొనాలంటూ కేంద్రానికి లేఖ రాయడం ఏంటి? రైతులకు బాసటగా నిలిస్తే మాపై కేసులు పెట్టారు. మీ కేసులకు భయపడేది లేదు. వెంటనే మిర్చి కొనుగోళ్లు ప్రారంభించండి’ అని కోరారు.

News February 20, 2025

టీచర్లకు 45 కాదు ఒకే యాప్: లోకేశ్

image

AP: ఉపాధ్యాయులకు ఇప్పుడున్న 45 యాప్‌ల స్థానంలో ఒకే యాప్ తీసుకురావాలని మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు. టీచర్లు కేవలం బోధన, హాజరు, విద్యార్థుల లెర్నింగ్ సామర్థ్యాలపై ఎక్కువ సమయం కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు అందివ్వాలని సూచించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు.