News February 20, 2025

రేపు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శంకుస్థాపన.. రూ.5 లక్షల సబ్సిడీ

image

TG: సీఎం రేవంత్ రేపు ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేయనున్నారు. నారాయణపేట జిల్లా అప్పకపల్లెలో ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. కాగా సర్కారు తొలివిడతలో రాష్ట్రవ్యాప్తంగా 72,045 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. వాటన్నింటికీ రేపు శంకుస్థాపనలు మొదలు కానున్నాయి. ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల పూర్తి సబ్సిడీతో ప్రభుత్వం ఆర్థికసాయం చేస్తుంది. బేస్‌మెంట్ కట్టగానే రూ.లక్ష లబ్ధిదారుడి ఖాతాలో జమ చేస్తారు.

News February 20, 2025

చైనా దురాక్రమణ.. మోదీ మొద్దు నిద్ర: కాంగ్రెస్

image

పొరుగు దేశం చైనా మన దేశంపై అరాచకాలతో విరుచుకుపడుతుంటే పీఎం నరేంద్ర మోదీ మాత్రం మొద్దు నిద్ర పోతున్నారని కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసింది. ఓ వైపు అరుణాచల్ ప్రదేశ్‌లో 90 గ్రామాల దురాక్రమణ, మరోవైపు బ్రహ్మపుత్ర నదిపై వరల్డ్ బిగ్గెస్ట్ డ్యామ్ నిర్మాణం, ఇంకోవైపు సరిహద్దులు ఆక్రమిస్తుంటే చూస్తూ ఊరుకున్నారని ఎడిట్ చేసిన ఫొటోను ట్వీట్ చేసింది.

News February 20, 2025

జగన్ వల్లే.. కేంద్రానికి CBN లేఖ రాశారు: చెల్లుబోయిన

image

AP: జగన్ గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లడం వల్లే సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ విమర్శించారు. మంత్రులకు మిర్చియార్డుకు వెళ్లే ధైర్యం ఉందా? అని ఆయన ప్రశ్నించారు. రైతులను పరామర్శిస్తే కోడ్ ఉల్లంఘనా? అని నిలదీశారు. ప్రతిపక్షాల నోరు నొక్కి పాలన కొనసాగించడం సరైంది కాదని హితవు పలికారు. మిర్చి రైతులు నష్టపోతున్నా గిట్టుబాటు ధర ప్రకటించకపోవడం దారుణమన్నారు.

News February 20, 2025

APపై KRMBకి ఉత్తమ్ ఫిర్యాదు

image

TG: శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి ఏపీ అక్రమంగా నీటిని తరలించుకుపోతోందని KRMBకి మంత్రి ఉత్తమ్ ఫిర్యాదు చేశారు. దీనిని ఎలాగైనా అడ్డుకోవాలని బోర్డు ఛైర్మన్ అతుల్ జైన్‌ను ఆయన కోరారు. శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల మధ్య 35 చోట్ల టెలిమెట్రీ పరికరాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా దీనిపై రేపు కేఆర్ఎంబీ సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

News February 20, 2025

శంభాజీ పాత్రలో మన హీరోలిలా ఉంటారు!

image

‘ఛావా’లో ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ పాత్రలో విక్కీ కౌశల్ జీవించారని ప్రశంసలొస్తున్నాయి. ఈ సినిమాను తెలుగులో తీస్తే ఏ హీరో ఈ పాత్రకు న్యాయం చేస్తారనే చర్చ నెట్టింట జరుగుతోంది. ఈక్రమంలో శంభాజీ పాత్రలో టాలీవుడ్ హీరోలెలా ఉంటారో ఎడిట్ చేసిన ఫొటోలు వైరలవుతున్నాయి. ఇందులో ప్రభాస్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్ ఫొటోలున్నాయి. ఏ హీరో శంభాజీగా నటిస్తే బాగుంటుంది. COMMENT

News February 20, 2025

గూగుల్ పే వాడుతున్నారా.. ఇక బాదుడు తప్పదు!

image

యూజర్లకు గూగుల్ పే షాకిచ్చింది. తమ యాప్ ద్వారా క్రెడిట్, డెబిట్ కార్డులతో చేసే చెల్లింపులపై కన్వీనియన్స్ ఫీజు వసూలు చేస్తోంది. లావాదేవీ విలువను బట్టి ఇకపై గ్యాస్, పవర్ సహా ఏ బిల్లులైనా పై కార్డులతో చెల్లిస్తే 0.5-1% వరకు ఫీజు చెల్లించాలి. UPI లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ల ద్వారా నేరుగా చెల్లిస్తే ఎలాంటి ఫీజు ఉండదు. ఏడాది క్రితం నుంచి మొబైల్ రీఛార్జీలపై గూగుల్ పే రూ.3 వరకు వసూలు చేయడం తెలిసిందే.

News February 20, 2025

హర్షిత్ రాణా.. ది రైజింగ్ స్టార్!

image

టీమ్ ఇండియా పేసర్ హర్షిత్ రాణా అన్ని ఫార్మాట్లలో శుభారంభం చేశారు. అంచనాలకు మించి రాణిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. టెస్టు, వన్డే, టీ20 డెబ్యూ మ్యాచుల్లో 3 వికెట్ల చొప్పున తీశారు. అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ డెబ్యూ మ్యాచులోనూ ఆయన 3 వికెట్లతో రాణించారు. అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి తన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నమ్మకాన్ని వమ్ము చేయడం లేదు.

News February 20, 2025

కేంద్రం కుట్రలను ఎదుర్కొందాం: భట్టి

image

TG: విద్యావ్యవస్థను ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా రాష్ట్రాల్లో నడపలేరని Dy.CM భట్టి అన్నారు. అందరం కలిసి కేంద్రం కుట్రలను ఎదిరించాలని ఆయన పిలుపునిచ్చారు. తిరువనంతపురంలో జరిగిన జాతీయ విద్యా సదస్సులో ఆయన మాట్లాడారు. ‘వీసీల నియామకాల్లో రాష్ట్రాల పాత్రను తొలగించడం, వీసీల అర్హత ప్రమాణాలు మార్చడం భావ్యం కాదు. విద్యావ్యవస్థలో సరైన మార్గాన్ని ఎంచుకునే అవకాశం రాష్ట్రాలకు ఉంది’ అని పేర్కొన్నారు.

News February 20, 2025

టాయిలెట్ బ్రేక్ 2 నిమిషాలే.. దాటితే శాలరీ కట్!

image

చైనాలోని ఓ సంస్థ FEB 11 నుంచి అమలు చేస్తున్న ఓ రూల్ విమర్శలు ఎదుర్కొంటోంది. త్రీ బ్రదర్స్ మెషీన్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ టాయిలెట్లను వినియోగించడానికి టైమ్ స్లాట్స్ తెచ్చింది. ఉద్యోగి ఆ టైమ్ స్లాట్స్‌లో 2 నిమిషాలే బాత్రూమ్‌కు వెళ్లాలి. దాటితే శాలరీలో కోత విధిస్తారు. అత్యవసరమైతే HR పర్మిషన్‌ తీసుకోవాలి. క్రమశిక్షణ, మెరుగైన పనితీరు కోసం ఈ రూల్ తెచ్చినట్లు ఆ కంపెనీ చెబుతోంది. దీనిపై మీ COMMENT.

News February 20, 2025

కేసీఆర్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కూనంనేని ఆగ్రహం

image

TG: కాంగ్రెస్‌కు కమ్యూనిస్టులు తొత్తులుగా మారారని మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఫైరయ్యారు. ‘కేసీఆర్‌కు సహకరిస్తే కమ్యూనిస్టులు త్యాగధనులా? సహకరించకపోతే తొత్తులా? కేసీఆర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. కమ్యూనిస్టుల త్యాగాలేంటో ఆయనకు బాగా తెలుసు’ అని పేర్కొన్నారు.