India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG EAPCET నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 25 నుంచి ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. లేట్ ఫీజుతో ఏప్రిల్ 24 వరకు అప్లై చేసుకోవచ్చు. ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ, మే 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్ పరీక్షలు జరగనున్నాయి. అప్లికేషన్ ఫీజును ఎస్సీ, ఎస్టీ, PH విద్యార్థులకు రూ.500, ఇతరులకు రూ.900గా నిర్ణయించారు. పూర్తి వివరాలు, నోటిఫికేషన్ కోసం ఇక్కడ <

* రేఖా గుప్తా(సీఎం): హోం, ఆర్థిక, సేవలు, విజిలెన్స్, ప్లానింగ్
* పర్వేశ్ వర్మ(Dy.CM): విద్య, PWD, రవాణా
* మంజిందర్ సింగ్ సిర్సా: హెల్త్, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు
* రవీంద్ర కుమార్: సాంఘిక సంక్షేమం, కార్మిక, SC, ST వ్యవహారాలు
* కపిల్ మిశ్రా: ఇరిగేషన్, పర్యాటకం, సాంస్కృతిక
* ఆశిష్ సూద్: రెవెన్యూ, పర్యావరణం, ఫుడ్& సివిల్ సప్లయీస్
* పంకజ్ కుమార్: న్యాయ, అసెంబ్లీ వ్యవహారాలు, హౌసింగ్

భార్య ధనశ్రీతో విడాకుల వార్తల నేపథ్యంలో క్రికెటర్ చాహల్ ఇన్‌స్టా పోస్ట్ వైరల్ అవుతోంది. ‘నేను లెక్కించలేనన్ని సార్లు దేవుడు నన్ను రక్షించాడు. ఆ సమయాలను ఊహించగలను కానీ అవేంటో తెలియవు. ఎప్పుడూ నాతో ఉన్న దేవుడికి ధన్యవాదాలు. ఆమెన్’ అని రాసుకొచ్చారు. అయితే ఆ పరిస్థితులు ఏంటో వివరించలేదు. ఇటీవల ధనశ్రీ, చాహల్ SMలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. అప్పటి నుంచి విడాకుల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

జాతుల వైరంతో అట్టుడుకుతున్న మణిపుర్‌లో మళ్లీ శాంతిని నెలకొల్పేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. చోరీ చేసిన, అక్రమ ఆయుధాలను వెంటనే సరెండర్ చేయాలని గవర్నర్ అజయ్ భల్లా ఆదేశించారు. ఇందుకు 7 రోజుల సమయం ఇచ్చారు. లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రపతి పాలన విధించిన వారంలోనే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇప్పటికే అక్కడ కేంద్ర బలగాలు తమ కవాతుతో సైకలాజికల్ ఆపరేషన్స్ ఆరంభించాయి.

TG: హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కిడ్నీ సమస్యలతో బాధపడుతూ కొన్ని రోజుల క్రితం ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు ఆయనకు సర్జరీ చేయగా.. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఐసీయూ వార్డు నుంచి జనరల్ వార్డుకు తరలించారు.

TG: BRS సర్కార్ వల్లే తెలంగాణకు అన్యాయం జరిగిందని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. AP మాజీ CM జగన్‌తో స్నేహంగా ఉంటూ ఆ రాష్ట్ర జల దోపిడీకి BRS సహకరించిందని మండిపడ్డారు. ‘జగన్ పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుతున్నా, ముచ్చుమర్రి నిర్మిస్తున్నా KCR నోరెత్తలేదు. కృష్ణా జలాలను బేసిన్ అవకతవకలకు తరలిస్తున్నా పట్టించుకోలేదు. బీఆర్ఎస్ దీనిని అడ్డుకుని ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉండేది’ అని ఆయన వ్యాఖ్యానించారు.

బర్డ్ ఫ్లూ ప్రభావం చికెన్‌తో పాటు కోడిగుడ్లపైనా పడింది. చాలామంది గుడ్లు తినేందుకు వెనుకాడుతున్నారు. డిమాండ్ తగ్గడంతో రేట్లూ తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లో చాలాకాలం నుంచి ఒక్క కోడిగుడ్డు రూ.7-రూ.7.50 వరకు విక్రయించారు. ఇప్పుడు 5 నుంచి 6 రూపాయలకే అమ్ముతున్నారు. హోల్‌సేల్‌లో అయితే మరికాస్త తక్కువగా లభించనున్నాయి. అటు ఫారం రైతుల నుంచి వ్యాపారస్థులు కోడిగుడ్డును రూ.3కే కొనుగోలు చేస్తుండటం గమనార్హం.

ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న వన్డేలో భారత బౌలర్లు ఆరో వికెట్ తీయలేక చెమటోడ్చుతున్నారు. 8.3 ఓవర్లకే 5 వికెట్లు తీసిన బౌలర్లు ఆ తర్వాత మరో వికెట్ పడగొట్టలేక సతమతమవుతున్నారు. జాకీర్ అలీ (68*), తౌహిద్ హృదోయ్ (83*) 204 బంతుల్లో 152 రన్స్ నమోదు చేశారు . వీరిద్దరూ అడ్డుగోడలా నిలవడంతో బంగ్లా ప్రస్తుతం 42.2 ఓవర్లలో 187/5 పరుగులు చేసింది. భారత్ ఫీల్డింగ్ వైఫల్యం కూడా వారికి కలిసొచ్చింది.

HDFC ఖాతాదారుల UPI పేమెంట్స్ 22వ తేదీ సేవలు నిలిచిపోనున్నట్లు ఆ బ్యాంక్ తెలిపింది. ఆ రోజు తెల్లవారుజామున 2.30 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు HDFC ఖాతా లింక్ అయిన UPI సేవలు పని చేయవని వెల్లడించింది. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడానికి సిస్టం మెయింటెనెన్స్ చేపడుతున్నట్లు HDFC పేర్కొంది. అయితే, ఆ సమయంలో లావాదేవీల కోసం PayZapp ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేసింది.

TG: సీఎం రేవంత్ ఇవాళ నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ ఎన్నికల ప్రచారాల్లో రిజర్వేషన్లపై మాట్లాడిన కేసుల్లో ఆయన న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. తదుపరి విచారణను మార్చి 23కి వాయిదా వేసింది. కాగా గత ఎన్నికల సమయంలో రేవంత్ మాట్లాడిన స్పీచ్‌లపై పోలీసులు నాలుగు కేసులు నమోదు చేశారు. ఇవాళ మూడు కేసులు విచారణకు వచ్చాయి.
Sorry, no posts matched your criteria.