News February 20, 2025
ఆయుధాలు సరెండర్ చేయండి: మణిపుర్ గవర్నర్ వార్నింగ్

జాతుల వైరంతో అట్టుడుకుతున్న మణిపుర్‌లో మళ్లీ శాంతిని నెలకొల్పేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. చోరీ చేసిన, అక్రమ ఆయుధాలను వెంటనే సరెండర్ చేయాలని గవర్నర్ అజయ్ భల్లా ఆదేశించారు. ఇందుకు 7 రోజుల సమయం ఇచ్చారు. లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రపతి పాలన విధించిన వారంలోనే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇప్పటికే అక్కడ కేంద్ర బలగాలు తమ కవాతుతో సైకలాజికల్ ఆపరేషన్స్ ఆరంభించాయి.
Similar News
News March 26, 2025
365 రోజుల్లో ‘ది ప్యారడైజ్’

నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తోన్న ‘ది ప్యారడైజ్’ సినిమా వచ్చే ఏడాది ఇదే రోజున విడుదల కానుంది. ఇంకా 365రోజులు అంటూ నాని ఓ పోస్టర్‌ను Xలో షేర్ చేశారు. ఇప్పటికే రిలీజైన టైటిల్ గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. ఈ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. కాగా నాని- శ్రీకాంత్ కాంబోలో వచ్చిన ‘దసరా’ మూవీ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
News March 26, 2025
గర్భిణుల పథకానికి నిధులు ఏవి: సోనియా గాంధీ

గర్భిణులకు ఇచ్చే మాతృత్వ ప్రయోజనాల పథకానికి కేంద్రం పూర్తి నిధులు కేటాయించలేదని ఎంపీ సోనియా గాంధీ ఆరోపించారు. ఈ స్కీమ్‌కు రూ.12,000కోట్లు అవసరం కాగా కేవలం రూ.2,500 కోట్లు మాత్రమే కేటాయించిందని తెలిపారు. 2022-23లో 68శాతం మంది ఒక విడత డబ్బులు తీసుకోగా ఆ తరువాతి సంవత్సరంలో ఆ సంఖ్య 12శాతానికి తగ్గిందన్నారు. జాతీయ ఆహర భద్రత పథకం కింద కేంద్రం రెండు విడతలలో గర్భిణులకు రూ.6వేలు ఇస్తుంది.
News March 26, 2025
SLBCని పూర్తి చేసి తీరుతాం: మంత్రి ఉత్తమ్

TG: SLBC ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఇప్పటివరకు టన్నెల్‌లో చిక్కుకుపోయిన ఇద్దరి మృతదేహాలను వెలికితీశామని అసెంబ్లీలో చెప్పారు. ‘ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేస్తాం. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు వద్ద పనులు ప్రారంభిస్తాం. కాళేశ్వరం డీపీఆర్, నిర్మాణానికి తేడా ఉంది. ఈ విషయంలో NDSA రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నాం’ అని ఆయన పేర్కొన్నారు.