News February 20, 2025

టీమ్ ఇండియా చెత్త ఫీల్డింగ్.. బంగ్లాకు వరం!

image

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచులో టీమ్ ఇండియా ఘోరమైన ఫీల్డింగ్ చేస్తోంది. అక్షర్ బౌలింగ్‌లో రోహిత్ ఓ క్యాచ్, జడేజా బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ స్టంపింగ్ మిస్, శ్రేయస్ అయ్యర్ రనౌట్ ఛాన్స్ మిస్, కుల్దీప్ బౌలింగ్‌లో హార్దిక్ పాండ్య ఓ క్యాచ్ మిస్ చేశారు. దీంతో బంగ్లా బ్యాటర్లు బతికిపోయారు. టీమ్ఇండియా చెత్త ఫీల్డింగ్ కారణంగా బంగ్లా 35/5 దశ నుంచి 120/5తో కోలుకుంది.

News February 20, 2025

యథాతథంగా గ్రూప్-2 పరీక్షలు: APPSC

image

గ్రూప్-2 మెయిన్ పరీక్షలు వాయిదా పడతాయన్న ప్రచారంలో నిజం లేదని APPSC ఛైర్మన్ అనురాధ స్పష్టం చేశారు. ఈనెల 23న 10am-12.30pm పేపర్-1, 3pm-5.30pm పేపర్-2 నిర్వహిస్తామని తెలిపారు. 175 పరీక్షా కేంద్రాల్లో 92,250 మంది పరీక్షకు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాలకు 100m పరిధిలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని, సోషల్ మీడియాలో వదంతులు సర్కులేట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

News February 20, 2025

కాళేశ్వరం అప్పులు రాష్ట్రానికి ఎప్పటికీ భారమే: ఉత్తమ్

image

TG: నీటి పారుదల రంగాన్ని నాశనం చేసిన ఘనత BRSదేనని మంత్రి ఉత్తమ్ కుమార్ దుయ్యబట్టారు. నీళ్ల కోసం ప్రాజెక్టులు కట్టలేదని, జేబులు నింపుకొనేందుకే నిర్మించారని విమర్శించారు. కాళేశ్వరం అప్పులు రాష్ట్రానికి ఎప్పటికీ భారమేనన్నారు. మరోవైపు రాష్ట్రంలోని జల అవసరాలపై కేంద్రంతో చర్చించామని ఉత్తమ్ వెల్లడించారు. కృష్ణ జలాల్లో AP దోపిడీని కేంద్రానికి వివరించామని, ఇందులో జోక్యం చేసుకోవాలని కోరామని చెప్పారు.

News February 20, 2025

ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్న త్రివిక్రమ్ కుమారుడు!

image

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కుమారుడు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నారు. అయితే, యాక్టింగ్ వైపు కాకుండా తండ్రి బాటలోనే డైరెక్టర్‌గా మారేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దగ్గర శిక్షణ తీసుకుంటుండగా త్వరలోనే సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ టీమ్‌లో జాయిన్ అవుతారని సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

News February 20, 2025

జగన్ వల్లే ఆర్థిక ఇబ్బందులు: పవన్

image

AP: రాష్ట్రంలో సమన్వయంతో కలిసి నడుస్తున్నామని Dy.CM పవన్ అన్నారు. వెన్నునొప్పి కారణంగా కొన్ని సమావేశాలకు హాజరు కాలేకపోయానని, ఇప్పటికీ ఆ నొప్పి వేధిస్తోందని తెలిపారు. ఇచ్చిన హామీలకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు. అందువల్లే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. అయినా హామీలు అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని వివరించారు.

News February 20, 2025

విమానంలో చిరంజీవి పెళ్లి రోజు వేడుకలు

image

మెగాస్టార్ చిరంజీవి-సురేఖ దంపతులు తమ వివాహ వార్షికోత్సవాన్ని గ్రాండ్‌గా జరుపుకున్నారు. ఫ్లైట్‌లో దుబాయ్ వెళ్తూ పెళ్లి రోజును సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను చిరంజీవి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయగా వైరల్‌గా మారాయి. ‘సురేఖను భాగస్వామిగా పొందడం నా అదృష్టం. ఆమె నాకు బలం. ఆమే నా మోటివేటర్. థాంక్యూ సోల్‌మేట్’ అంటూ మెగాస్టార్ పోస్ట్ పెట్టారు.

News February 20, 2025

Stock Markets: ఫ్లాటుగా ముగిసిన నిఫ్టీ

image

బెంచ్‌మార్క్ సూచీలు ఆటుపోట్లకు లోనయ్యాయి. నిఫ్టీ 22,913 (-19), సెన్సెక్స్ 75,735 (-203) వద్ద క్లోజయ్యాయి. ఆటో, మీడియా, మెటల్, PSU బ్యాంక్, రియాల్టి, O&G షేర్లు ఎగిశాయి. బ్యాంకు, ఫైనాన్స్, ఐటీ, PVT బ్యాంకు షేర్లు సెల్లింగ్ ప్రెజర్ ఎదుర్కొన్నాయి. శ్రీరామ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, ఎంఅండ్ఎం, బీఈఎల్, అదానీ పోర్ట్స్ టాప్ గెయినర్స్. HDFC బ్యాంకు, మారుతీ, టెక్ఎం, టాటా కన్జూమర్, హెచ్‌సీఎల్ టెక్ టాప్ లూజర్స్.

News February 20, 2025

భారీగా తగ్గిన ధర.. కేజీ రూ.4!

image

AP: తెలుగు రాష్ట్రాల్లో టమాటా ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. కర్నూలు జిల్లా ఆస్పరి, పత్తికొండ మార్కెట్లో కేజీ రూ.4కు చేరింది. గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. టమాటాలను అమ్మే పరిస్థితి లేదని, పారేయడం తప్ప చేసేదేమీ లేదని వాపోతున్నారు. దీంతో అధికారులు మార్కెట్‌ను తాత్కాలికంగా మూసివేశారు. మరోవైపు బహిరంగ మార్కెట్లో కేజీ టమాటా రూ.15-20 పలుకుతోంది.

News February 20, 2025

SHOCK: 119 యాప్‌లపై నిషేధం!

image

కేంద్రం 119 యాప్‌లను నిషేధిస్తూ గూగుల్ ప్లేస్టోర్‌కు నోటీసులు ఇచ్చినట్టు తెలిసింది. వీటిలో ఎక్కువగా చైనా, హాంకాంగ్ డెవలపర్లతో సంబంధం ఉన్న వీడియో, వాయిస్ ఛాట్ యాప్‌లే ఉన్నాయని సమాచారం. IT చట్టం 69A ప్రకారం FEB 18న నోటీసులు ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. వీటి డేటాబేస్‌లు విదేశీ సర్వర్లలో నిక్షిప్తం చేయడం, ప్రైవసీ, జాతీయ భద్రత, రహస్య సమాచారం బయటకు వెళ్లకుండా ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

News February 20, 2025

‘ఇకపై హీరో పాత్రలు ఇవ్వరని తెలియగానే..’

image

కొన్నిసార్లు నటులు తమ పర్సనాలిటీకి సంబంధం లేని పాత్రల్లోనూ నటించాల్సి వస్తుందని బాబీ డియోల్ అన్నారు. ఆశ్రమ్ వెబ్‌సిరీస్ తనకో కొత్త గుర్తింపు తెచ్చిందన్నారు. అందుకే వేర్వేరు పాత్రలను ప్రయత్నిస్తున్నానని తెలిపారు. ‘ఇకపై నాకు హీరో పాత్రలు ఇవ్వరని తెలియగానే ఆశ్రమ్‌ను అంగీకరించా. ఈ సంగతి ఎవరికీ చెప్పలేదు. షో రిలీజ్ అయ్యాక స్పందన చూడాలనుకున్నా’ అని అన్నారు. FEB 27న ఆశ్రమ్ సీజన్ 3, పార్ట్ 2 రాబోతోంది.