India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అండమాన్ సముద్రంలో ఇవాళ ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో ఈ నెల 23న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత ఇది వాయుగుండంగా మారుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో ఈ నెల 24వ తేదీ నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడతాయని, 26వ తేదీ నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంది.
TG: అసెంబ్లీ శీతాకాల సమావేశాలను డిసెంబర్ మొదటి వారంలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. సమావేశాల్లో కీలక బిల్లులకు ఆమోదం తెలపడంతో పాటు మూసీ పునరుజ్జీవం సహా పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. OCT చివరి వారంలోనే అసెంబ్లీ సెషన్ జరగాల్సి ఉండగా, స్పీకర్, మండలి ఛైర్మన్ విదేశీ పర్యటనకు వెళ్లడంతో వాయిదా పడింది. కాగా ప్రత్యేక ఆహ్వానితులుగా MPలనూ సభకు పిలవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.
AP: సీఎం చంద్రబాబు ఈనెల 27న పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రధాన డ్యామ్ పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన ప్రాజెక్టును పరిశీలిస్తారని, అనంతరం ప్రాజెక్టు నిర్మాణ షెడ్యూల్‌ను ప్రకటిస్తారని సమాచారం. కాగా సీఎం పర్యటనపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
☛ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున, రష్మిక నటించిన ‘కుబేర’ వచ్చే ఏడాది ఫిబ్రవరి 21నథియేటర్లలోకి?
☛ ఈనెల 27న రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ నుంచి మూడో పాట రిలీజ్!
☛ ‘విరూపాక్ష’ డైరెక్టర్ కార్తీక్ దండుతో నాగచైతన్య నెక్స్ట్ సినిమా! హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి?
☛ ‘డీజే టిల్లు’ డైరెక్టర్ విమల్ కృష్ణ దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్ తర్వాతి సినిమా?
☛ సూర్య 45th మూవీలో హీరోయిన్‌గా త్రిష!
సినీ నటి కస్తూరికి చెన్నైలోని ఎగ్మోర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తమిళనాడులో స్థిరపడిన తెలుగు వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో <<14631162>>అరెస్టయిన<<>> ఆమెను పోలీసులు రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై పోలీసుల తరఫు న్యాయవాది అభ్యంతరం తెలపకపోవడంతో తాజాగా కోర్టు బెయిల్ ఇచ్చింది.
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇవాళ హైదరాబాద్‌కు రానున్నారు. రెండు రోజుల పర్యటన కోసం నేడు సా.6 గంటలకు స్పెషల్ ఫ్లైట్‌లో బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. సా.7.10 వరకు రాజ్ భవన్‌లో రెస్ట్ తీసుకుని, సా.7.20కి ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే కోటి దీపోత్సవంలో పాల్గొంటారు. రేపు ఉదయం హైటెక్‌సిటీలోని శిల్పకళా వేదికలో లోక్‌మంథన్-2024 కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం తిరిగి ఢిల్లీకి ప్రయాణమవుతారు.
BGT సిరీస్‌కు పుజారాను ఎంపిక చేయకుండా బీసీసీఐ తప్పు చేసిందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నారు. అతడు ఎక్కువ గంటలు బ్యాటింగ్ చేసి ఆస్ట్రేలియా బౌలర్లను అలసిపోయేలా చేసేవాడని తెలిపారు. గతంలో ఆసీస్‌పై భారత్ గెలవడంలో పుజారా కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. అతడిలా బ్యాటింగ్ చేసే వారు లేకపోతే భారత జట్టుకు ఇబ్బందేనని అభిప్రాయపడ్డారు. కాగా BGT తొలి టెస్ట్ రేపటి నుంచి జరగనుంది.
యూపీలోని ఝాన్సీలో ఉన్న మహారాణి లక్ష్మీ బాయి మెడికల్ కాలేజీలో ఈనెల 15న <<14624063>>అగ్నిప్రమాదం<<>> జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆస్పత్రిలోని 10 మంది నవజాత శిశువులు మరణించారు. 39 మంది శిశువుల్ని రక్షించగా, అందులో ఐదుగురు గత రెండు రోజుల్లో అనారోగ్యంతో చనిపోయినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అయితే వారి శరీరాలపై ఎటువంటి కాలిన గాయాలు లేవని, వారిపై పొగ ప్రభావం కూడా పడలేదని డాక్టర్లు తెలిపారు.
రామ్‌చరణ్ హీరోగా నటిస్తోన్న ‘గేమ్ చేంజర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను అమరావతిలో నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. జనవరి తొలి వారంలో జరిగే ఈ ఈవెంట్‌కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గెస్ట్‌గా హాజరయ్యే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఒకవేళ ఇదే జరిగితే Dy.CM అయ్యాక ఆయన హాజరైన తొలి సినిమా ఈవెంట్ ఇదే కానుంది. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ జనవరి 10న థియేటర్లలోకి రానుంది.
వచ్చే ఏడాది పాకిస్థాన్ సూపర్ లీగ్‌ను IPL సమయంలో నిర్వహించాలని పాక్ క్రికెట్ బోర్డు యోచిస్తోంది. PSL ఫిబ్రవరి-మార్చి మధ్యలో జరుగుతుంటుంది. వచ్చే ఏడాది ఆ సమయంలో ఛాంపియన్స్ ట్రోఫీ ఉండటంతో IPL జరిగే మార్చి-మే సమయంలోనే PSLను జరపాలని PCB భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే అగ్రస్థాయి విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉండరంటూ ఫ్రాంచైజీలు ఓ లేఖలో బోర్డు వద్ద ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం.
Sorry, no posts matched your criteria.