India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. 12 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 72,745 మంది భక్తులు దర్శించుకోగా 24,156 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో స్వామి వారి హుండీ ఆదాయం రూ.3.48 కోట్లు సమకూరింది.

AP: ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలుంటే పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులన్న నిబంధనను ప్రభుత్వం తొలగించింది. ఈ నిర్ణయం 2024 డిసెంబర్ 19 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంటూ ఉత్తర్వులిచ్చింది. పంచాయతీ ఎన్నికలకూ ఈ నిబంధనను తొలగిస్తూ ఇప్పటికే జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మున్సిపల్, కార్పొరేషన్ చట్టసవరణ బిల్లును అసెంబ్లీ ఆమోదించగా గెజిట్ కూడా విడుదలైంది.

తొలిసారి MLAగా గెలిచి ఢిల్లీ CM పీఠాన్ని అధిష్ఠించే అరుదైన గౌరవాన్ని రేఖా గుప్తా సొంతం చేసుకున్నారు. ఆమె 1974లో హరియాణాలోని జులానాలో జన్మించారు. ఢిల్లీ వర్సిటీ పరిధిలోని దౌలత్‌రామ్ కాలేజీలో బీకాం చదువుతున్న సమయంలో ABVPలో చేరారు. అప్పటినుంచి రేఖ రాజకీయ ప్రస్థానం మొదలైంది. 1995-96లో ఢిల్లీ వర్సిటీ విద్యార్థి సంఘం కార్యదర్శిగా, 1996-97లో అధ్యక్షురాలిగా పనిచేశారు. RSSతో ఆమెకు సన్నిహిత సంబంధాలున్నాయి.

TG: మేడిగడ్డ ప్రాజెక్టుపై కేసు పెట్టినందుకే రాజలింగమూర్తిని <<15516581>>హత్య<<>> చేశారా అని బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. హత్యా రాజకీయాలను ప్రేరేపిస్తున్నారా అని నిలదీశారు. ఉద్యమ కాలంలో ఆత్మహత్యలతో లబ్ధి పొందారని, ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసమే హత్య చేశారని విమర్శించారు. దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

ఈనెల 26న శివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలకు పబ్లిక్ హాలిడే ఇచ్చారు. అయితే ఆ తర్వాతి రోజు 27న ఏపీ, తెలంగాణలో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో టీజీలో ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో, ఏపీలోని ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ప.గో, తూ.గో, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని స్కూళ్లకు సెలవు ఉండనుంది.

TG: బైక్‌పై ముగ్గురు విద్యుత్ సిబ్బంది వెళ్తుంటే ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేశారు. ‘మేం ట్రాన్స్‌కో సిబ్బంది. డ్యూటీపై వెళ్తున్నాం. మాకే ఫైన్ వేస్తారా? మేమేంటో చూపిస్తాం’ అని బెదిరించి వారు వెళ్లిపోయారు. చెప్పినట్లుగానే 2 రోజులు ట్రాఫిక్ సిగ్నల్‌కు కరెంట్ కట్ చేశారు. మెదక్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ వెళ్లి ట్రాన్స్‌కో అధికారులతో చర్చించడంతో సరఫరాను పునరుద్ధరించారు.

పరుగుల రారాజు విరాట్ కోహ్లీ ఖాతాలో దాదాపు అన్ని రికార్డులూ ఉన్నాయి. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ రికార్డ్ చూస్తే.. 13 మ్యాచులాడి 88.16 సగటుతో 529 రన్స్ చేశారు. 5 హాఫ్ సెంచరీలున్నా ఒక్క సెంచరీ కూడా సాధించలేదు. ఆ రికార్డును ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో సెట్ చేయాలని కోరుకుంటున్నారు టీమ్ ఇండియా ఫ్యాన్స్. ఇంగ్లండ్ సిరీస్‌లో ఆఖరి వన్డేలో హాఫ్ సెంచరీతో ఫామ్‌లోకి వచ్చిన ఆయన ఈ టోర్నీలో సెంచరీ కొడతారా? కామెంట్ చేయండి.

ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అక్కడి రామ్‌లీలా మైదాన్‌లో బీజేపీ అట్టహాసంగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో గాయకుడు కైలాశ్ ఖేర్‌తో మ్యూజికల్ ఈవెంట్ ఏర్పాటు చేసింది. 50మందికి పైగా సినీతారలు, పారిశ్రామిక వేత్తలు హాజరవుతారని అంచనా. సీఎంతో పాటు ఆరుగురు క్యాబినెట్ మంత్రులు కూడా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

TG: బర్డ్ ఫ్లూ వైరస్‌తో ఫౌల్ట్రీ పరిశ్రమపై పెద్ద దెబ్బ పడింది. కోళ్ల మృత్యువాత, ప్రజలు చికెన్, గుడ్లు తినేందుకు ఆసక్తి చూపకపోవడంతో రోజుకు రూ.15+ కోట్ల చొప్పున నెలలో రూ.500 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు పౌల్ట్రీ రైతులు వాపోతున్నారు. దీంతో ఖర్చులు తగ్గించుకునే పనిలో పడ్డారు. మరోవైపు ఉడికించిన చికెన్ తింటే ఎలాంటి ప్రమాదం లేదని వెటర్నరీ అధికారులు చెబుతున్నారు.

కొత్తగా హెల్త్, లైఫ్ బీమా తీసుకునే వారి సౌలభ్యం కోసం IRDAI కీలక నిర్ణయం తీసుకుంది. పాలసీ జారీ చేసిన తర్వాతే వినియోగదారుడి ఖాతా నుంచి ప్రీమియం వసూలు చేయాలని బీమా సంస్థలను ఆదేశించింది. మార్చి 1 నుంచి ఈ నిబంధనను అమల్లోకి తీసుకురావాలని స్పష్టం చేసింది. పాలసీదారులు తమ అకౌంట్లలో మొత్తాన్ని నిలిపివేసుకునేందుకు BIMA-ASBA(అప్లికేషన్స్ సపోర్టెడ్ బై బ్లాక్‌డ్ అమౌంట్) సదుపాయాన్ని అందించాలని సూచించింది.
Sorry, no posts matched your criteria.