India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
10 పెద్ద నగరాల నుంచి దేశవ్యాప్తంగా ఎక్కడికైనా సరే ఫుడ్ డెలివరీ చేసే జొమాటో లెజెండ్స్ సర్వీస్‌ను పక్కనపెట్టేసినట్టు సంస్థ ప్రకటించింది. రెండేళ్లపాటు దీనిపై పనిచేసినా ప్రస్తుత మార్కెట్ పరిస్థితులకు అనుకూలంగా లేకపోవడంతో జొమాటో లెజెండ్స్‌ను మూసేస్తున్నట్టు సంస్థ సీఈవో దీపిందర్ గోయల్ తెలిపారు. ఐకానిక్ వంటకాల దేశవ్యాప్త డెలివరీ లక్ష్యంతో 2022లో జొమాటో దీన్ని ప్రారంభించింది.
AP: అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలో జరిగిన <<13921216>>ప్రమాద <<>>వివరాలను జిల్లా అధికారులతో మాట్లాడి సీఎం చంద్రబాబు తెలుసుకున్నారు. బాధితులకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. హోంమంత్రి, ఇతర ఉన్నతాధికారులు వెంటనే బాధితుల వద్దకు వెళ్లాలని సూచించారు. ఈ ఘటన, బాధితులకు అందుతున్న సాయంపై ఎప్పటికప్పుడు తనకు సమాచారం పంపాలని సీఎం ఆదేశించారు.
సినీ హీరోయిన్ మేఘా ఆకాశ్ తన ప్రియుడు సాయి విష్ణుతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరు త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. సాయి విష్ణు గురించి, పెళ్లి తేదీ వివరాలు తెలియాల్సి ఉంది. 28 ఏళ్ల ఈ హీరోయిన్ తెలుగులో లై, చల్ మోహనరంగా, రావణాసుర, డియర్ మేఘ, మను చరిత్ర వంటి పలు సినిమాల్లో నటించారు.
రోగులకు ముప్పు తెచ్చే ప్రమాదం ఉందనే అనుమానాలున్న 156 ఔషధాలపై కేంద్ర ప్రభుత్వం నిషేధాన్ని విధించింది. జ్వరాలు, నొప్పులు, అలర్జీలకు రెండు మూడు ఔషధాలను కలిపి వాడే మందుల్ని కాంబినేషన్ డ్రగ్స్ అంటారు. ఎసెక్లోఫెనాక్ 500 ఎంజీ-పారాసెటమాల్ 125 ఎంజీ, మెఫెనమిక్ యాసిడ్-పారాసెటమాల్ ఇంజెక్షన్, సిట్రిజెన్ హెచ్‌సీఎల్-పారాసెటమాల్-ఫినైలెప్రైన్ హెచ్‌సీఎల్ తదితర కాంబినేషన్లు వీటిలో ఉన్నాయి.
అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వానికి కమల హారిస్ అనర్హురాలంటూ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఫైర్ అయ్యారు. గత నాలుగేళ్లుగా వైట్‌హౌస్‌లో ఉపాధ్యక్షురాలి హోదాలో ఉండి తెచ్చిన సమస్యలకు పరిష్కారాల గురించి కమల ప్రసంగంలో ప్రస్తావించలేదని మండిపడ్డారు. ద్రవ్యోల్బణం, ఆర్థిక వ్యవస్థ, సరిహద్దు భద్రత వంటి ముఖ్యమైన సమస్యల గురించి ఆమె పెద్దగా మాట్లాడలేదని ఎత్తిచూపారు.
ఇజ్రాయెల్‌కి తనను తాను రక్షించుకునే హక్కు ఉందని, దానికి ఎల్లప్పుడూ మద్దతు ఇస్తానని డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ స్పష్టం చేశారు. అదే సమయంలో బందీల విడుదల, కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేయడం అవసరమని చెప్పారు. ‘గాజాలో గత 10 నెలలుగా జరుగుతున్నది దారుణం. అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఆకలితో అలమటిస్తూ రక్షణకై తరలిపోతున్న ప్రజల బాధలు హృదయవిదారకం’ అని అన్నారు.
AP: అనకాపల్లి జిల్లాలో అచ్యుతాపురం సెజ్ <<13912550>>ప్రమాదం<<>> మర్చిపోకముందే పరవాడ జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. సినర్జిన్ యాక్టివ్ ఇన్‌గ్రెడియంట్స్ సంస్థలో అర్ధరాత్రి 12.30 గంటలకు రసాయనాలు కలుపుతుండగా మంటలు చెలరేగి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు కార్మికులకు గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను విశాఖలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
US అధ్యక్ష బరిలో ఉన్న డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఇతరుల చేతిలో ఓ తోలుబొమ్మ మాత్రమేనని రిపబ్లికన్ నేత వివేక్ రామస్వామి విమర్శించారు. ఆమెకు ఆదరణ తగ్గుతుందన్న భయంతోనే విధానాల గురించి ఏమాత్రం మాట్లాడటం లేదని పేర్కొన్నారు. ‘మా పార్టీ విధానాలతోనే గెలుస్తుంది. ఆమె విఫల ఆర్థిక విధానాల గురించి కూడా చర్చ జరగాలి. ఈ దేశాన్ని నడిపేందుకు ట్రంపే సరైన వ్యక్తి’ అని స్పష్టం చేశారు.
TG: రాష్ట్రంలోని ఆస్పత్రులు, హాస్టళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. గాంధీ, నిమ్స్ ఆస్పత్రుల్లో క్వాలిటీ లేని ఫుడ్ సర్వ్ చేస్తున్నట్లు గుర్తించారు. ల్యాబ్ నుంచి రిపోర్ట్ రాగానే నోటీసులిస్తామన్నారు. ఆస్పత్రులు, హాస్టళ్లలో నాణ్యత లేని ఆహారం సర్వ్ చేస్తే diripmtg@gmail.com లేదా fssmutg@gmail.com, 9100105795, @cfs_telangana (ట్విటర్)లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
TG: HYDలో అక్రమ నిర్మాణాలను ‘హైడ్రా’ కూల్చివేయడంపై ప్రజల నుంచి భిన్న స్పందనలొస్తున్నాయి. ‘గతంలో పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు వాటిని కూల్చివేయడం కరెక్టా? దీనికి సర్కార్ కూడా బాధ్యత వహించాలి కదా? తప్పు ఎవరిది? భవంతులు కట్టిన వారిదా? వాటికి అనుమతి ఇచ్చినవారిదా? ప్రభుత్వ అధికారులు చేసిన తప్పులకు ఇప్పుడు జనాల్ని ఇలా శిక్షించడం ఎంత వరకు సమంజసం?’ అని ప్రశ్నిస్తున్నారు. దీనిపై మీ కామెంట్?
Sorry, no posts matched your criteria.