India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇది యుద్ధ శకం కాదని, మానవాళికి ముప్పు తెచ్చే సవాళ్లను ఎదుర్కోవాల్సిన సమయం అని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. అందువల్ల భారత్ ఎల్లప్పుడూ దౌత్యం – చర్చలనే విశ్వసిస్తుందని పేర్కొన్నారు. పోలాండ్ పర్యటనలో ఉన్న మోదీ అక్కడి భారతీయ కమ్యూనిటీని ఉద్దేశించి మాట్లాడారు. ఉక్రెయిన్ పర్యటనకు ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తోనూ ఇదే విషయాన్ని వెలిబుచ్చారు.
AP: హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ జ్యోతిర్మయి, జస్టిస్ గోపాలకృష్ణారావు నియమితులయ్యారు. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులను రాష్ట్రపతి ముర్ము ఆమోదించారు. వీరు రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. జస్టిస్ జోతిర్మయి(తెనాలి) 2008లో జిల్లా జడ్జిగా ఎంపికై అంచెలంచెలుగా ఎదిగారు. జస్టిస్ గోపాలకృష్ణారావు(కృష్ణా-D చల్లపల్లి) 1994 నుంచి పలు హోదాల్లో పనిచేస్తూ హైకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు.
TG: CM రేవంత్ ఈరోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. AICC ముఖ్య నాయకులతో ఆయన భేటీ అవుతారని సమాచారం. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నియామకంతో పాటు AICCలోనూ పలు మార్పులు చేయాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన్ను పిలిచినట్లు కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ప్రస్తుత ఇన్‌ఛార్జ్‌గా దీపాదాస్‌ను బెంగాల్‌కు పంపి, భూపేశ్ బఘేల్‌ను ఆమె స్థానంలో నియమించొచ్చని తెలుస్తోంది.
కల్కిలో ప్రభాస్ లుక్‌పై అర్షద్ వార్సీ చేసిన వ్యాఖ్యల పట్ల ‘డీజే టిల్లూ’ సిద్ధూ జొన్నలగడ్డ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన విమర్శించిన తీరు సరికాదంటూ తప్పుపట్టారు. ‘అభిప్రాయాల్ని తెలియజేసే హక్కు అందరికీ ఉంది. కానీ వాటిని ఎలా వ్యక్తీకరిస్తున్నామన్నది కీలకం. జోకర్ వంటి పదాలను ఉపయోగించడం సరికాదు. భారత సినీ పరిశ్రమ గర్వించే సినిమా ‘కల్కి 2898ఏడీ’’ అని స్పష్టం చేశారు.
AP: అచ్యుతాపురంలోని ఫార్మా కంపెనీలో ప్రమాదానికి రియాక్టర్ పేలుడు కారణం కాదని హోంమంత్రి అనిత చెప్పారు. అది గ్యాస్ లీకేజీ వల్ల జరిగిన సంఘటన అని తెలిపారు. ఈ మధ్య కాలంలో ఫార్మా కంపెనీలో జరిగిన అతిపెద్ద ప్రమాదం ఇదేనన్నారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. మరోవైపు కంపెనీ బయట ఆందోళనకు దిగిన కార్మికుల కుటుంబాలను ఆమె పరామర్శించారు.
TG: రైతులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా రూ.2లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ BRS నేడు రాష్ట్రవ్యాప్తంగా ధర్నా చేయనుంది. రైతులకు అండగా నిలిచేందుకు ఈ కార్యాచరణకు పిలుపునిచ్చింది. రుణమాఫీకి బడ్జెట్లో రూ.31వేల కోట్లకు ఆమోదం తెలిపి, రూ.18వేల కోట్లే ఖర్చు చేసిన విషయాన్ని రైతులకు వివరించాలని కేటీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఆంక్షలతో రైతులను మోసం చేసినందుకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఏపీలోని అనకాపల్లి(D) అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో పేలుడు <<13911204>>ఘటనపై<<>> ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించినట్లు పీఎంవో తెలిపింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించినట్లు పేర్కొంది. గాయపడినవారికి రూ.50వేల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. కాగా ఈ ఘటనపై ఇప్పటికే ఉన్నతస్థాయి విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించారు.
వచ్చే నెల నుంచి దేశంలో జనగణన చేయాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పదేళ్లకోసారి జనాభా లెక్కింపు జరగాల్సి ఉండగా కొవిడ్ కారణంగా 2021లో వాయిదా పడింది. జనగణన చేయాలని కేంద్రంపై ప్రతిపక్షాలు ఇప్పటికే విమర్శలకు దిగాయి. హోంశాఖ నేతృత్వంలో జరిగే ఈ ప్రక్రియకు 18 నెలల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 2026లో వివరాలను వెల్లడించే అవకాశముంది.
TG: గురుకులాల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్(PET) పోస్టుల తుది జాబితాను టీజీపీఎస్సీ వెల్లడించింది. 594 మంది అభ్యర్థులతో కూడిన ప్రైమరీ లిస్టును ప్రకటించింది. టీజీపీఎస్సీ 2017లో జారీ చేసిన ఈ నోటిఫికేషన్‌లో ఎవరైనా అభ్యర్థులు పోస్టును స్వచ్ఛందంగా వదులుకునేందుకు ఈ 22 నుంచి 24 వరకు సదుపాయం కల్పించింది. పూర్తి జాబితా కోసం ఇక్కడ <
AP: రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించనున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు రేపు కోనసీమ(D) వానపల్లిలో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి ప్రారంభమయ్యే గ్రామసభలో ఆయన పాల్గొంటారు. ఉపాధి హామీ పనుల గురించి స్థానికులతో ఆయన చర్చించనున్నారు. సీఎం రాక నేపథ్యంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే సత్యానందరావు తెలిపారు. మరోవైపు అచ్యుతాపురంలోని ప్రమాద స్థలాన్ని ఇవాళ సీఎం పరిశీలించనున్నారు.
Sorry, no posts matched your criteria.