News February 19, 2025
‘X’ ప్రీమియం+ ధరలు రెట్టింపు

సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘X’ ప్రీమియం+ ధరలు రెట్టింపు అయ్యాయి. మస్క్‌కు చెందిన AI సంస్థ XAI గ్రోక్-3 సేవల్ని అందుబాటులోకి తెచ్చి ధరల్ని పెంచింది. యూజర్లు ఈ AI మోడల్ ఫీచర్స్ వాడాలంటే ‘X’లో ప్రీమియం+ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి. ఇప్పటి వరకు ఈ ధర నెలకు రూ.1750 ఉండగా.. రూ.3,470కి పెంచింది. ఏడాది ప్లాన్ రూ.18,300 నుంచి రూ.34,340కి చేరింది. 2023లో ‘X’ ప్రీమియం+ సబ్‌స్క్రిప్షన్ నెలకు రూ.1300 ఉండేది.
Similar News
News March 19, 2025
పేద, మధ్య తరగతి ప్రజలే హైడ్రా లక్ష్యమా?: హైకోర్టు

TG: హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి ఘాటుగా స్పందించింది. పేద, మధ్య తరగతి ప్రజలే దాని లక్ష్యమా? అని ప్రశ్నించింది. పెద్దల అక్రమ భవనాలనూ కూల్చినప్పుడే భూములను రక్షించినట్లు అవుతుందని స్పష్టం చేసింది. రాష్ట్రంలో ప్రముఖులకు ప్రత్యేక చట్టం ఉందా? అని నిలదీసింది. దుర్గంచెరువు, మియాపూర్ చెరువుల్లోని ఆక్రమణలను ఎందుకు తొలగించలేదని దుయ్యబట్టింది. మీరాలం చెరువు పరిసరాల్లో ఆక్రమణలుంటే చర్యలు తీసుకోవాలంది.
News March 19, 2025
త్వరలో భారత్‌కు సునీతా విలియమ్స్

భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అంతరిక్షం నుంచి భూమిపైకి తిరిగొచ్చారు. దీంతో ఆమె పూర్వీకుల గ్రామం ఝూలాసన్‌లో బంధువులు సంబరాలు చేసుకున్నారు. 9 నెలల తర్వాత సునీత సేఫ్‌గా భూమిపైకి తిరిగిరావడం సంతోషంగా ఉందని ఆమె సోదరి ఫాల్గుణి పాండ్య తెలిపారు. తామంతా ఓ వెకేషన్ కోసం ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. ఇందులో పాల్గొనేందుకు సునీత ఇండియాకు వస్తారని పేర్కొన్నారు.
News March 19, 2025
అమరావతికి రూ.31,600 కోట్ల ఖర్చు: మంత్రి నారాయణ

AP: రాజధాని అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు అని మంత్రి నారాయణ పునరుద్ఘాటించారు. ప్రజలు చెల్లించిన పన్నుల్లో రూపాయి కూడా అమరావతికి ఖర్చు చేయొద్దని సీఎం ఆదేశించారన్నారు. దీని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ADB రూ.15,000 కోట్లు, హడ్కో రూ.15వేల కోట్లు, కేఎఫ్ డబ్ల్యూ రూ.5వేల కోట్ల రుణం దశలవారీగా తీసుకుంటున్నామని తెలిపారు. ఇందులో రూ.31,600 కోట్లు వెచ్చిస్తామని మండలిలో పేర్కొన్నారు.