India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: రోజురోజుకూ కోల్పోతున్న ఉనికిని కాపాడుకునేందుకే BRS నేతలు రుణమాఫీపై విమర్శలు చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ‘ఆ పార్టీ నేతలు చేపడుతున్న ధర్నాలు వారి రాజకీయ ప్రయోజనాల కోసమే తప్ప ప్రజలకోసం కాదు. పదేళ్ల అధికారంలో వారు రైతుల్ని నిలువునా ముంచారు. రైతులెవరూ కూడా ఆ ధర్నాలో పాల్గొనవద్దు. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా మా ప్రభుత్వం రూ.2 లక్షలు రుణమాఫీ చేసింది’ అని పేర్కొన్నారు.
AP: అచ్యుతాపురం సెజ్‌లో ప్రమాదం విషయంలో పరిశ్రమ యాజమాన్యం తప్పిదం ఉందని ఘటనాస్థలాన్ని పరిశీలించిన అనంతరం హోంమంత్రి అనిత పేర్కొన్నారు. ‘17మంది కన్నుమూయడం బాధాకరం. ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాం. నేను కాల్ చేసినా, మెసేజ్ పెట్టినా యాజమాన్యం ఇప్పటి వరకు స్పందించలేదు. పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ జరగాలి. తరచూ ప్రమాదం జరిగే సెజ్ ప్రాంతాల్లో ఆస్పత్రుల్ని నిర్మించాలి’ అని ఆమె అభిప్రాయపడ్డారు.
మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్‌కు ‘విశ్వంభర’ టీమ్ తీపి కబురు చెప్పింది. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఉదయం 10.08 గంటలకు అప్‌డేట్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈమేరకు ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. చేతిలో శూలంతో ఓ పోర్టల్ ఎదుట చిరు నిల్చున్నట్లుగా అందులో కనిపిస్తోంది. వశిష్ఠ డైరెక్షన్‌లో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో త్రిష, ఆషికా రంగనాథ్ చిరు సరసన కనిపించనున్నారు.
గత ఏడాది ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 కీలక విషయాన్ని గుర్తించింది. చంద్రుడిపై చక్కర్లు కొట్టి ప్రజ్ఞాన్ రోవర్ సేకరించిన సమాచారం ప్రకారం అక్కడ ఒకప్పుడు మాగ్మా సముద్రం ఉండేదని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాల్ని నేచర్ జర్నల్‌లో ప్రచురించారు. ద్రవరూపంలో ఉండే మాగ్మా కారణంగానే రాళ్లు ఏర్పడతాయి. కాగా.. గత ఏడాది ఆగస్టు 23న చంద్రయాన్-3 చంద్రుడిపై ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే.
TG: రీజినల్ రింగ్ రోడ్డు(RRR) దక్షిణ భాగం భూసేకరణను నేటి నుంచి ప్రారంభించనున్నారు. ఉత్తర భాగం భూసేకరణను వచ్చే నెల 15నాటికి పూర్తి చేస్తామని ఆర్అండ్‌బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ‘రైతులకు ఇబ్బంది లేకుండా పరిహారం చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. మున్ముందు సమస్యలు రాకుండా ఉండేందుకు కన్సల్టెంట్‌ను నియమిస్తాం. రింగ్ రోడ్డుకు అనుసంధానంగా 16 రేడియల్ రోడ్లను నిర్మిస్తాం’ అని తెలిపారు.
AP: శాసనమండలిలో వైసీపీ ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణను ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ నియమించారు. ఈ మేరకు మండలి ఛైర్మన్‌కు లేఖ రాశారు. ఇక డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా లేళ్ల అప్పిరెడ్డిని నియమిస్తున్నట్లు శాసనమండలి సెక్రటరీ జనరల్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. అప్పిరెడ్డి అంతకు ముందు మండలి ప్రతిపక్ష నేతగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన రాజీనామా చేయడంతో ఆ స్థానంలో వైసీపీ బొత్సను నియమించింది.
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన హిట్ మూవీల్లో ఒకటైన ‘ఇంద్ర’ రేపు రీరిలీజ్ కానుంది. అయితే రీరిలీజ్ పరంగా ఈ మూవీ రికార్డు సృష్టించిందని నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో మొత్తంగా 385కు పైగా థియేటర్లలో విడుదల అవుతున్నట్లు, ఇది ‘బిగ్గెస్ట్ ఎవర్ రీరిలీజ్ మూవీ’ అని పేర్కొంది.
అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా ఫార్మా ప్రమాద ఘటనలో సహాయక చర్యలు పూర్తయ్యాయి. సిబ్బంది శిథిలాలను పూర్తిగా తొలగించారు. భారీ అగ్నిమాపక యంత్రాల సాయంతో 33మందిని రక్షించారు. ఇప్పటికే 18మంది కన్నుమూయగా, ఆస్పత్రుల్లో పలువురు కార్మికులు చావుబతుకుల మధ్య పోరాడుతున్నారు. ఈ క్రమంలో మృతుల సంఖ్య పెరగొచ్చన్న ఆందోళనలు నెలకొన్నాయి.
‘అచ్యుతాపురం’ ప్రమాద ఘటనలో విపత్తు నిర్వహణ లోపం, సీఎం చంద్రబాబు పాలనలోని బేలతనాన్ని బయటపెట్టిందని వైసీపీ ట్విటర్లో విమర్శించింది. ఘటనపై ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందని, ప్రమాదం జరిగిన 5 గంటల తర్వాత గానీ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రెస్‌మీట్ పెట్టలేదని విమర్శించింది. తప్పును తమపైకి నెట్టేలా పనికిమాలిన ఆరోపణలు చేశారంటూ మండిపడింది. బాబు 45 ఏళ్ల అనుభవంలో డొల్లతనం కనిపించిందని ఎద్దేవా చేసింది.
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Sorry, no posts matched your criteria.