News September 28, 2024

IPL: ఐదు రిటెన్షన్లతోపాటు ఒక RTM?

image

IPL 18 సీజన్ మెగా వేలానికి ముందు BCCI మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒక్కో ఫ్రాంచైజీ కి 5 రిటెన్షన్లతోపాటు ఒక రైట్ టు మ్యాచ్ (RTM)కు అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఫ్రాంచైజీల నుంచి వస్తున్న ఒత్తిడి మేరకే BCCI ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు తెలుస్తోంది. IPL 2025 మెగావేలం ఈ ఏడాది చివర్లో యూఏఈలో జరగనుందని సమాచారం.

News September 28, 2024

మిడిల్ ఈస్ట్‌లో అతను తిరుగులేని శక్తి

image

ఇజ్రాయెల్‌కు కంటిమీద కునుకు లేకుండా చేసిన హెజ్బొల్లా చీఫ్ <<14217449>>నస్రుల్లా<<>> Middle Eastలో తిరుగులేని శక్తిగా ఎదిగాడు. 16 ఏళ్ల వయసులో అప్పటి చీఫ్ అబ్బాస్ అల్-ముసావి దృష్టిని ఆకర్షించాడు నస్రుల్లా. 1992లో ముసావి మ‌ర‌ణానంత‌రం హెజ్బొల్లాకు నాయకత్వం వహించాడు. ఎవరూ ఊహించ‌ని రీతిలో దాన్ని ప‌టిష్ఠ ప‌రిచాడు. 1997లో ఇజ్రాయెల్ బలగాల చేతిలో కుమారుడిని కోల్పోయిన నస్రుల్లా హెజ్బొల్లాను సాయుధ, రాజకీయ శక్తిగా మలిచాడు.

News September 28, 2024

లడ్డూ వివాదం.. స్పందించేందుకు నిరాకరించిన రజనీకాంత్

image

తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వేళ దీనిపై మాట్లాడేందుకు రజనీకాంత్ నిరాకరించారు. చెన్నై ఎయిర్‌పోర్టులో కనిపించిన ఆయనను ఈ అంశంపై స్పందించాలని ఓ రిపోర్టర్ కోరారు. అయితే రజనీ ‘సారీ.. నో కామెంట్స్’ అని చెప్పి వెళ్లిపోయారు. ఇటీవల హీరో కార్తీ లడ్డూ అంశం సెన్సిటివ్ టాపిక్ అని, మాట్లాడొద్దని చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ విమర్శలు చేయడంతో ఆయన సారీ చెప్పారు.

News September 28, 2024

విషాదం.. ఆవును కాపాడబోయి నలుగురు మృతి

image

ప.బెంగాల్‌లోని జల్పాయిగుడి జిల్లాలో విషాదం జరిగింది. ఆవును కరెంట్ షాక్ నుంచి కాపాడబోయి ఒకే కుటుంబంలోని నలుగురు మరణించారు. నిన్న ఇంటి బయట నీటిలో పడి ఉన్న కరెంట్ వైర్ ఆవుకు తగలడంతో మిథున్ (32) దాన్ని రక్షించేందుకు ప్రయత్నించాడు. అతడికి షాక్ తగలడంతో తండ్రి పరేష్ (60), దీపాలి తల్లి (55) కాపాడేందుకు ప్రయత్నించారు. ఇలా ఆ ముగ్గురూ షాక్‌తో చనిపోయారు. దీపాలి చేతుల్లో ఉన్న మనవడు సైతం ప్రాణాలు వదిలాడు.

News September 28, 2024

ఆర్టీసీ బస్సులో ప్రసవం

image

TG: పురిటి నొప్పుల‌తో బాధ‌ప‌డుతున్న గర్భిణికి బస్సులోనే ప్రసవం జరిగింది. సూర్యాపేట నుంచి కోదాడకు వెళ్తోన్న ఆర్టీసీ బస్సులో గ‌ర్భిణి అలివేలుకు పురిటినొప్పులొచ్చాయి. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే తాడ్వాయి వద్ద బస్సును నిలిపి 108కి కాల్ చేశారు. నొప్పులు పెరగడంతో బస్సులోని మహిళలు ఆమెకు పురుడు పోశారు. అంబులెన్సులో సూర్యాపేట ఆస్పత్రికి తరలించారని, తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు RTC MD సజ్జనార్ తెలిపారు.

News September 28, 2024

WILLIAMSON: ప్చ్.. 4 గంటల్లో 2 సార్లు ఔటయ్యాడు

image

శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ 4 గంటల్లోనే రెండు సార్లు ఔటయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో 7 పరుగులే చేసిన కేన్ రెండో ఇన్నింగ్స్‌లో 46 పరుగులకు వెనుదిరిగారు. ఉదయం 10.25 గంటలకు, మధ్యాహ్నం 2.15 గంటలకు ఆయన ఔటయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో 88 పరుగులకే ఆలౌటైన కివీస్ ప్రస్తుతం ఫాలో ఆన్ ఆడుతోంది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 602/5కు డిక్లేర్ చేసింది.

News September 28, 2024

క్రికెటర్‌కు రోడ్డు ప్రమాదంపై అప్‌డేట్

image

యంగ్ బ్యాటింగ్ సెన్సేషన్ ముషీర్ ఖాన్ <<14215754>>రోడ్డు ప్రమాదంలో<<>> గాయపడటంపై BCCI స్పందించింది. అతడి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, ఎలాంటి ప్రమాదం లేదని తెలిపింది. ప్రయాణించేందుకు డాక్టర్లు అనుమతిస్తే త్వరలోనే అతడు ముంబై వెళ్తాడని పేర్కొంది. అటు గాయం కారణంగా ముషీర్ ఖాన్ దాదాపు 16 వారాల పాటు క్రికెట్‌కు దూరమయ్యే ఛాన్సుంది.

News September 28, 2024

లడ్డూ వివాదంపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

image

AP: లడ్డూ వివాదంపై ఎన్డీఏ ప్రభుత్వం సీరియస్‌గా ఉందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ రాజు అన్నారు. లడ్డూ తయారీ ఆరోపణల్లో నిజం ఉందన్నారు. అవసరమైతే విచారణలో కేంద్రం తనవంతు పాత్ర పోషిస్తుందని చెప్పారు. విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయని తెలిపారు.

News September 28, 2024

ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ మృతి

image

బాలీవుడ్‌ సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ & ఆర్ట్ డైరెక్టర్ రజత్ పొద్దార్ కన్నుమూశారు. బర్ఫీ, ఫైటర్, పఠాన్‌లాంటి సూపర్ హిట్ చిత్రాలకు ఆయన పనిచేశారు. తమ జ్ఞాపకాల్లో ఎప్పటికీ ఉండిపోతారని Tసిరీస్ ట్వీట్ చేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించింది. రజత్‌కు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని ఆయన స్నేహితుడు అనీశ్ తెలిపారు. నిన్న కూడా ఎంతో ఆహ్లాదంగా మాట్లాడుకున్నామన్నారు.

News September 28, 2024

జగన్‌కు కొవ్వెక్కింది.. పాకిస్థాన్ వెళ్లిపోవాలి: సోమిరెడ్డి

image

AP: దేశాన్ని, మతాలను ప్రశ్నించే స్థాయికి జగన్ వచ్చేశారని TDP MLA సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. ఆయనకు కొవ్వెక్కి ఇదేం దేశం అంటున్నారని, ఇండియా కాదనుకుంటే పాక్ లేదా దుబాయ్‌కి వెళ్లిపోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో డిక్లరేషన్‌పై సంతకం చేస్తే భారతి ఇంట్లోకి రానివ్వదని పర్యటన రద్దు చేసుకున్నావా? అని ప్రశ్నించారు. తల్లి, చెల్లిని దూరం చేసుకున్న వ్యక్తి జగన్‌ అని దుయ్యబట్టారు.