India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రిలయన్స్, వాల్ట్ డిస్నీ విలీనంతో పోటీదారులకు నష్టమని CCI భావిస్తున్నట్టు తెలిసింది. క్రికెట్ టోర్నీల ప్రసార హక్కులన్నీ వారి వద్దే ఉండటంతో ఆందోళన చెందుతోంది. తమ అభిప్రాయమేంటో చెప్పిన సంస్థ దర్యాప్తునకు ఎందుకు ఆదేశించొద్దో చెప్పాలని ఆ 2 కంపెనీలను అడిగినట్టు సమాచారం. ఈ విలీనంతో సోనీ, జీ, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, 120 TV ఛానళ్లు, 2 స్ట్రీమింగ్ సర్వీసులకు ఇబ్బందని, మోనోపలీకి ఆస్కారం ఉందని నిపుణుల భావన.
సన్నిహిత వర్గాలు చెబుతున్నట్టు రాజకీయాల్లోకి వస్తే <<13899861>>వినేశ్ ఫొగట్<<>> ఏ పార్టీలో చేరతారన్నది ఆసక్తికరంగా మారింది. ఆమె కాంగ్రెస్‌లో చేరొచ్చని అంచనా. ఎందుకంటే ఆమె కొన్నాళ్లుగా బీజేపీ నేత బ్రిజ్‌భూషణ్‌పై పోరాడుతున్నారు. అదే పార్టీలోని బబితపై పోటీచేస్తారని సమాచారం. పైగా హరియణా కాంగ్రెస్ నేత, MP దీపేంద్ర హుడా ఆమెకు మార్గనిర్దేశం చేస్తున్నారు. మొన్న బలాలి వరకు ఆయనే స్వయంగా ర్యాలీ తీయించారు. మీ కామెంట్.
కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార ఘటనకు సంబంధించి CBI ప్రకటన పేరిట ఓ లేఖ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే, ఈ లెటర్ ఫేక్ అని సీబీఐ క్లారిటీ ఇచ్చింది. ఏసీబీ డీఐజీ కార్యాలయం నుంచి రిలీజైనట్లు ఉన్న ఈ లెటర్ వాట్సాప్‌లో చక్కర్లు కొడుతోంది. ఢిల్లీలోని సీబీఐ హెడ్‌క్వార్టర్స్ ఈ కేసును దర్యాప్తు చేస్తోందని తెలిపింది. ప్రజలు ఈ లేఖను నమ్మొద్దని పేర్కొంది.
స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. మళ్లీ జీవితకాల గరిష్ఠాల వైపు పరుగులు పెడుతున్నాయి. నేటి ఉదయం 80,722 వద్ద మొదలైన BSE సెన్సెక్స్ చివరికి 378 పాయింట్ల లాభంతో 80,802 వద్ద ముగిసింది. 24,648 వద్ద ఓపెనైన NSE నిఫ్టీ 126 పాయింట్లు ఎగిసి 24,698 వద్ద క్లోజైంది. SBI లైఫ్, HDFC లైఫ్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, శ్రీరామ్ ఫిన్ టాప్ గెయినర్స్. ఎయిర్‌టెల్, ONGC, అపోలో హాస్పిటల్స్ నష్టపోయాయి.
నాగ చైతన్య, శోభిత డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్/మధ్యప్రదేశ్, లేదా విదేశాల్లో సరైన వేదిక కోసం ఇరు కుటుంబాలు వెతుకుతున్నట్లు సమాచారం. ఈ ఏడాది చివరిలో లేదా ఫిబ్రవరి/మార్చి ముహూర్తాల్లో వివాహం జరుగుతుందని వారి సన్నిహితులు చెబుతున్నారు. ఈ నెల 8న వారి ఎంగేజ్‌మెంట్ జరగగా, పెళ్లికి కాస్త సమయం తీసుకుంటామని నాగార్జున వెల్లడించిన విషయం తెలిసిందే.
లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జుడీషియల్ కస్టడీని మరోసారి పొడిగించారు. ఈనెల 27 వరకు కస్టడీని పొడిగిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించింది. లిక్కర్ స్కాం కేసులో జూన్ 26 కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. మరోవైపు ఇదే కేసులో అరెస్టైన బీఆర్ఎస్ MLC కవిత రిమాండ్‌ను కూడా ఈనెల 27 వరకు కోర్టు పొడిగించింది.
ఫ్రెషర్స్ కోసం ‘పవర్’ పేరిట ఇన్ఫోసిస్ స్పెషల్ ప్రోగ్రామ్ తీసుకురానున్నట్లు సమాచారం. కోడింగ్, ప్రోగ్రామింగ్, సాఫ్ట్‌వేర్ ఛాలెంజింగ్స్‌లో స్కిల్ ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. పరీక్ష, ఇంటర్వ్యూ తర్వాత ఎంపికైన వారికి ₹4-6.5లక్షల నుంచి ₹9లక్షల వరకూ వార్షిక ప్యాకేజీ ఉంటుందని తెలిపాయి. గతేడాది TCS ప్రైమ్ పేరిట ₹9-11లక్షల ప్యాకేజీతో ఇదే తరహా ప్రోగ్రామ్ తీసుకొచ్చింది.
TG: రైతు రుణమాఫీపై బీఆర్ఎస్ నిరసనలకు పిలుపునిచ్చింది. ఈనెల 22న రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేయాలని నిర్ణయించింది. 40శాతం మందికి రుణమాఫీ కాలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రైతులందరికీ తక్షణమే రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
TG: రుణమాఫీపై చర్చను పక్కదారి పట్టించేందుకే విగ్రహాల వివాదాన్ని తెరపైకి తెచ్చారని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ‘సెక్రటేరియట్‌లో రాజీవ్ గాంధీ విగ్రహం పెడతామని రేవంత్ అంటే.. తమ ప్రభుత్వం వచ్చాక KTR తీసేస్తామంటున్నారు. కాంగ్రెస్, BRS కూడబలుక్కునే ఈ వివాదానికి తెరలేపాయి. ప్రజలు ఆలోచించాలి. ఆరు గ్యారంటీలపైనే రాష్ట్రంలో చర్చ జరగాలి. ప్రజలకు కావాల్సింది విగ్రహాలు కాదు.. హామీల అమలు’ అని అన్నారు.
ఒలింపిక్స్ ఫైనల్‌కు ముందు అధిక బరువుతో అనర్హత వేటుపడ్డ రెజ్లర్ వినేశ్ ఫొగట్ రాజకీయాల్లోకి వస్తారని వినికిడి. హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఓ ప్రధాన పార్టీ నుంచి బరిలోకి దిగే అవకాశం ఉందని ఆమె సన్నిహితులు చెప్పారని IANS తెలిపింది. ఆమెతో పాటు భజరంగ్ పునియా సైతం రాజకీయ రణరంగంలోకి రావొచ్చని వెల్లడించింది. బబితా ఫొగట్ (బీజేపీ)పై వినేశ్, యోగేశ్వర్ దత్ (బీజేపీ)పై భజరంగ్ పోటీని కొట్టిపారేయలేమని పేర్కొంది.
Sorry, no posts matched your criteria.