India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవం అయింది. అధ్యక్షుడిగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని(శివనాథ్), ఉపాధ్యక్షుడిగా వెంకట ప్రశాంత్ ఎన్నికయ్యారు. కార్యదర్శిగా సానా సతీశ్, జాయింట్ సెక్రటరీగా విష్ణుకుమార్ రాజు, కోశాధికారిగా శ్రీనివాస్, కౌన్సిలర్‌గా గౌరు విష్ణుతేజ ఎన్నిక కాగా తుది ఫలితాలను సెప్టెంబర్ 8న అధికారికంగా ప్రకటించనున్నారు.
తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలని ఎవరు కోరుకోరు చెప్పండి? ఎన్నో వ్యయప్రయాసలకోర్చి అంతదూరం వెళ్లిన తర్వాత కొందరు తెలిసీ తెలియక కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. కొద్దిమంది తిరుపతి యాత్రను విహారయాత్రలా ఫీల్ అవుతుంటారు. మరికొందరేమో ఇతర మార్గాల్లో దర్శనం చేసుకుంటారు. అలా చేయడం వల్ల దైవానుగ్రహం ఉండదని పెద్దలు చెబుతున్నారు. తిరుమలలో పూసిన పువ్వులను మహిళలు అలంకరించుకోవడం కూడా నిషిద్ధం. > SHARE
కోల్‌కతాలో వైద్య విద్యార్థినిపై హత్యాచార ఘటనను మంత్రి నారా లోకేశ్ ఖండించారు. ఆమెపై జరిగిన దారుణాన్ని తలుచుకుంటే మాటలు రావట్లేదన్నారు. ‘బాధితురాలికి, ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నా. ఆ న్యాయం వేగంగా, నిర్ణయాత్మకంగా, ఆదర్శప్రాయంగా ఉండాలి. మహిళల భద్రత, గౌరవాన్ని కాపాడేందుకు ఐక్యంగా ఉందాం. ఇది అందరి పోరాటం కావాలి’ అని Xలో పిలుపునిచ్చారు.
TG: ఏ ఊరికి వెళితే ఆ ఊరి దేవుడిపై ఒట్టుపెట్టి పూర్తి రుణమాఫీ చేస్తానన్న CM రేవంత్ రైతులను మోసం చేశారని BRS MLA హరీశ్‌రావు అన్నారు. మాఫీ పూర్తి స్థాయిలో చేయలేదని విమర్శించారు. ‘తొలుత ₹40వేల కోట్లన్నారు. ఆ తర్వాత ₹31వేల కోట్లన్నారు. బడ్జెట్‌లో ₹26వేల కోట్లు పెట్టారు. ఇప్పుడు తీరా ₹17వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారు. అంటే ₹23వేల కోట్లు కోత పెట్టారు’ అని హరీశ్ దుయ్యబట్టారు.
స్థానికంగా ఉత్పత్తి చేస్తున్న ముడి చమురుపై కేంద్రం విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను కత్తిరించింది. టన్నుపై రూ.4600 నుంచి రూ.2100కు తగ్గించింది. జులై 31కి ముందు పన్ను రేటు రూ.7000 వరకు ఉండేది. దేశ అవసరాల కోసం కాకుండా ఎక్కువ ధరకు విదేశాలకు ముడిచమురు ఎగుమతి చేస్తున్న కంపెనీలను నియంత్రించడమే ప్రభుత్వ లక్ష్యం. ప్రతి 15 రోజులకు పన్ను రేటును సవరిస్తారు. వైమానిక ఇంధనంపై ఎలాంటి పన్నూ లేదు.
ముడా భూకుంభకోణంలో తనపై <<13875697>>విచారణకు<<>> గవర్నర్ అనుమతి ఇవ్వడంతో కర్ణాటక CM సిద్దరామయ్య అత్యవసర క్యాబినెట్ భేటీకి పిలుపునిచ్చారు. సాయంత్రం మంత్రులతో ఆయన సమావేశం కానున్నారు. భూకుంభకోణం విచారణపై చర్చించనున్నారు. అటు కర్ణాటకలో పరిణామాలతో కాంగ్రెస్ అధిష్ఠానం అలర్ట్ అయింది. AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే బెంగళూరుకు పయనమయ్యారు. సిద్దరామయ్యకు కేసీ వేణుగోపాల్ ఫోన్ చేసి ఆరా తీశారు.
TG: KTR వ్యాఖ్యలపై వెంటనే స్పందించిన మహిళా మంత్రులు తమను అసెంబ్లీ వేదికగా CM రేవంత్, డిప్యూటీ CM భట్టి అవమానించినప్పుడు ఏమయ్యారని మాజీ మంత్రి BRS MLA సబిత ప్రశ్నించారు. పొరపాటైందని KTR క్షమాపణలు చెప్పారని, మరి రేవంత్, భట్టి ఎందుకు క్షమాపణ చెప్పడం లేదని అడిగారు. మరోవైపు సచివాలయం దగ్గర తెలంగాణ తల్లి విగ్రహం తొలగించడం మహిళలను అవమానించడమేనని సత్యవతి రాథోడ్ అన్నారు.
హీరో ప్రభాస్, టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కొత్త లుక్‌లో మెరిశారు. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న కొత్త సినిమా ప్రారంభోత్సవానికి హాజరైన ప్రభాస్ షార్ట్ బియర్డ్, నుదుటిపై బొట్టుతో క్యూట్‌గా ఉన్నారని ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. మరోవైపు రోహిత్ శర్మ తన కొత్త లుక్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. స్టైలిష్‌గా ఉన్నారని, లుక్ అదిరిపోయిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
US చరిత్రలోనే ఘోరమైన మైనింగ్ విపత్తు 1902లో టెన్నెస్సీలో జరిగింది. ఈ ఘటనలో 216 మంది మరణించారు. ఆ ప్రమాదంలో చివరి క్షణాలు అనుభవిస్తూ ఓ వ్యక్తి తన భార్యకు రాసిన లేఖ తాజాగా వైరలవుతోంది. ‘ఎలెన్.. నీకు గుడ్‌బై. నీతో జీవించాలని ఎంతో కోరుకుంటున్నా. కానీ నిన్ను దారుణమైన స్థితిలో వదిలి వెళ్తున్నా. మన పిల్లలను పెంచడంలో నీకు దేవుడు సాయం చేయాలని ప్రార్థిస్తున్నా’ అని రాసుకొచ్చారు.
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.1,150 పెరిగి రూ.72,770కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,050 పెరగడంతో రూ.66,700 పలుకుతోంది. సిల్వర్ రేట్ కేజీపై రూ.2,000 పెరిగి రూ.91,000గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
Sorry, no posts matched your criteria.