India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: సీఎం రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ ఢిల్లీలో భేటీ అయ్యారు. తెలంగాణ నుంచి రాజ్యసభ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా సింఘ్వీని ప్రకటించాక మొదటిసారి ఇరువురూ సమావేశమయ్యారు. సెప్టెంబర్ 3న ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఈ నెల 21న నామినేషన్ దాఖలు సహా ఆసక్తికర అంశాలపై లోతుగా చర్చించినట్టు సింఘ్వీ ట్వీట్ చేశారు.
AP: సీఎం చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. కాసేపట్లో జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో భేటీ కానున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై చర్చించనున్నారు.
TG: ఇప్పటివరకు 4,28,832 దరఖాస్తుల ప్రాసెస్ పూర్తవ్వగా 60,213 అప్లికేషన్లను ప్రభుత్వం ఆమోదించింది. 75% దరఖాస్తులకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించలేదని వెల్లడించింది. దరఖాస్తుదారులు వివరాలతో సవరణ చేసుకోవచ్చంది. మున్సిపాలిటీలు, నగరాభివృద్ధి సంస్థలు, కలెక్టర్ కార్యాలయాల్లో హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేస్తామంది. దరఖాస్తుదారులు ఏమైనా సందేహాలుంటే అక్కడికి వెళ్లి పరిష్కరించుకోవాలని తెలిపింది.
TG: ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం విధివిధానాలు జారీ చేసింది. రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని అనుమతి లేని, చట్టవిరుద్ధమైన లే ఔట్ల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించింది. 2020 ఆగస్టు 26 కంటే ముందు రిజిస్టర్ చేసిన లే ఔట్లకు మాత్రమే LRS వర్తిస్తుందని తెలిపింది. అదే ఏడాది అక్టోబర్ 15లోపు స్వీకరించిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది.
దేశవ్యాప్తంగా రేపు ఉ.6నుంచి ఆదివారం ఉ.6 వరకు 24 గంటలపాటు వైద్య సేవలు నిలిచిపోనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో కేవలం ఎమర్జెన్సీ సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఓపీలు, ఎలక్టివ్ సర్జరీలు పూర్తిగా నిలిపివేస్తామని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇప్పటికే ప్రకటించింది. కోల్‌కతాలో ట్రైనీ వైద్యురాలిపై హత్యాచారం నేపథ్యంలో IMA ఈ ప్రకటన చేసింది.
AP: ఈనెల 20 నుంచి 24 వరకు సచివాలయాలు, స్కూళ్లు, కాలేజీలు, అంగన్వాడీ సెంటర్లలో ప్రభుత్వం ఆధార్ క్యాంపులు నిర్వహించనుంది. కొత్తగా ఆధార్ కార్డు నమోదు, 5 ఏళ్లు దాటిన పిల్లలకు బయోమెట్రిక్ అప్‌డేట్, ఆధార్ కార్డు పొంది పదేళ్లు పూర్తయిన వారికి బయోమెట్రిక్ అప్‌డేట్‌తో పాటు పేరు, చిరునామా, మొబైల్ నంబర్ మార్పు వంటి సేవలను అందించనున్నట్లు పేర్కొంది.
బరువు తగ్గేందుకు చేసిన కసరత్తులతో వినేశ్ ఫొగట్ చనిపోతుందేమోనని భయపడినట్లు ఆమె కోచ్ ఎకోస్ FBలో పోస్ట్ చేశారు. ‘మొదట 80ని. కసరత్తు చేయిస్తే 1.2KGలే తగ్గింది. స్టీమ్‌బాత్, కార్డియో, రెజ్లింగ్ మూవ్స్ చేయించాం. ఒంటి నుంచి కనీసం చెమట చుక్క రాలేదు. ఆమె కుప్పకూలడంతో చాలా భయమేసింది. మళ్లీ లేపి స్టీమ్‌బాత్‌కు పంపించాం’ అని ఆయన వివరించారు. అయితే ఈ పోస్ట్‌ను ఎకోస్ డిలీట్ చేసినట్లు జాతీయ మీడియా పేర్కొంది.
భారత ఆర్థిక వృద్ధి ఆశించిన దానికంటే మెరుగ్గా ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) డిప్యూటీ ఎండీ డా. గీతా గోపీనాథ్ అన్నారు. 2027 నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఎఫ్ఎంసీజీ, ద్విచక్రవాహనాల మెరుగైన అమ్మకాలు సహా అనుకూలమైన రుతుపవనాల కారణంగా 2024-25 ఏడాదికి గానూ భారత వృద్ధి రేటును ఐఎంఎఫ్ 7 శాతానికి పెంచింది.
ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం కేసులో నిజం బయటకు రావాలని సీఎం మమత అన్నారు. అయితే, ఈ విషయంలో కొందరు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఆర్జీ కర్ ఆస్పత్రిలో జరిగిన విధ్వంసంతో విద్యార్థి సంఘాలకు సంబంధం లేదని, ఇందులో బయటి వ్యక్తుల ప్రమేయం ఉందన్నారు. జెండాలు చేతపట్టుకొని బీజేపీ, DYFIకి చెందిన వారే ఈ విధ్వంసానికి పాల్పడ్డారన్నారు. 25 మందిని అరెస్టు చేశామని ఆమె తెలిపారు.
ఆస్ట్రేలియాలోని ఫెడరేషన్ స్క్వేర్‌లో జరుగుతోన్న ‘ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్’ వేడుకల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి టిమ్ వాట్స్ చరణ్‌తో సెల్ఫీ దిగి ‘నాటు నాటు.. రామ్ చరణ్‌ను కలుసుకోవడం సంతోషంగా ఉంది’ అని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. కాగా, అభిమానులు సైతం భారీగా తరలిరావడంతో వారితో చెర్రీ సెల్ఫీ తీసుకున్నారు.
Sorry, no posts matched your criteria.