News February 14, 2025
వంశీని కస్టడీకి కోరనున్న పోలీసులు

AP: మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు 5 రోజుల కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. విజయవాడ కోర్టు అర్ధరాత్రి తర్వాత ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించగా, సబ్ జైలుకు తరలించారు. దీంతో ఆయన 27 వరకు రిమాండ్ ఖైదీగా ఉండనున్నారు. మరోవైపు వంశీ తరఫు న్యాయవాదులు ఇవాళ బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. వంశీని నిన్న హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Similar News
News March 22, 2025
డీలిమిటేషన్‌పై HYDలో బహిరంగ సభ: రేవంత్

TG: డీలిమిటేషన్‌పై CM రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘దక్షిణాది రాష్ట్రాలను బీజేపీ మోసం చేస్తోంది. సొంత ఎజెండాతో ఆ పార్టీ ముందుకెళ్తోంది. డీలిమిటేషన్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తాం. దీనిపై త్వరలోనే HYDలో బహిరంగ సభ ఉంటుంది. ఇది దక్షిణాది పార్టీల సమస్య కాదు ప్రజల సమస్య. స్టాలిన్‌తో కలసి పోరాటాన్ని ఢిల్లీ స్థాయికి తీసుకెళ్తాం. అన్ని రాష్ట్రాలను కలుపుకుని ముందుకెళ్తాం’ అని చెన్నైలో మీడియాతో పేర్కొన్నారు.
News March 22, 2025
టెన్త్ పేపర్ లీక్: ఇద్దరు ఆఫీసర్ల సస్పెన్షన్

TG: నల్గొండ జిల్లా నకిరేకల్‌లోని SLBC బాలికల గురుకుల పాఠశాలలో తెలుగు పేపర్ లీక్ ఘటనకు బాధ్యులైన అధికారులపై విద్యాశాఖ కఠిన చర్యలు తీసుకుంది. చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లను సస్పెండ్ చేసింది. అలాగే పేపర్ లీకేజీకి సహకరించిన విద్యార్థినిని కూడా డిబార్ చేసింది. కాగా నిన్న తెలుగు ప్రశ్నాపత్రానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే.
News March 22, 2025
విరాట్ మంచోడు.. కానీ అది మైదానంలో దిగనంతవరకే: సాల్ట్

విరాట్ కోహ్లీపై ఆయన ఆర్సీబీ టీమ్ మేట్ ఫిల్ సాల్ట్ ప్రశంసలు కురిపించారు. ‘విరాట్ చాలా మంచి వ్యక్తి. ఎప్పుడూ సరదాగా ఉంటారు. కానీ అది మైదానంలో దిగనంతవరకే. గ్రౌండ్‌లో ఆయన తీవ్రత వేరే స్థాయిలో ఉంటుంది. యుద్ధాన్ని కోరుకుంటారు. ఈ సీజన్లో ఆయనతో కలిసి బ్యాటింగ్ చేయనుండటం చాలా సంతోషంగా ఉంది’ అని పేర్కొన్నారు. సాల్ట్ గత సీజన్‌లో కేకేఆర్‌కు ఆడారు.