India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన అమన్ సెహ్రావత్‌కు రైల్వే శాఖ ప్రమోషన్ ఇచ్చింది. నార్తర్న్ రైల్వేలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(OSD) హోదాను కల్పించింది. భారత్ తరఫున ఒలింపిక్ మెడల్ సాధించిన అతి పిన్న వయస్కుడిగా(21 ఏళ్లు) అమన్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. రెజ్లింగ్‌లో 57 కిలోల ఫ్రీ స్టైల్ విభాగంలో అమన్ కాంస్యం గెలిచి భారత్‌కు ఆరో మెడల్ సాధించిపెట్టారు.
TG: పలు జిల్లాల్లో రానున్న 2 గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట, పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్‌లో మోస్తరు వాన పడే ఛాన్స్ ఉందంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రేపటి వరకు రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాలకు వర్షం విస్తరించొచ్చని తెలిపింది.
AP: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణకు ఆదేశించిన కేసులను నీరుగార్చేలా కొందరు IPSలు వ్యవహరించారని నిఘా విభాగం గుర్తించినట్లు సమాచారం. విచారణను తప్పుదోవ పట్టించేలా, YCPకి అనుకూలంగా ప్రయత్నాలు చేసినట్లు DGPకి నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వెయిటింగ్‌లో ఉన్న IPSలకు <<13850500>>మెమోలు<<>> జారీ చేశారని, రోజూ ఉ.10 నుంచి సా.5 వరకు హెడ్‌క్వార్టర్‌లో ఉండాలని ఆదేశించినట్లు వార్తలు వస్తున్నాయి.
AP: కృష్ణా జిల్లా గుడివాడలో అన్న క్యాంటీన్‌ను సీఎం చంద్రబాబు దంపతులు ప్రారంభించారు. స్వయంగా పేదలకు అన్నం వడ్డించారు. అనంతరం అక్కడ వసతులను పరిశీలించి తాము కూడా ఆహారాన్ని రుచి చూశారు. రేపటి నుంచి మరో 99 క్యాంటీన్‌లను ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధులు ఆరంభించనున్నారు. రూ.5కే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి డిన్నర్ అందజేస్తారు.
మూకహింసలో ట్రైనీ డాక్టర్ హత్యాచారం క్రైమ్‌సీన్‌కు ఏమీ అవ్వలేదని కోల్‌కతా పోలీసులు తెలిపారు. అసత్యాలను ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. ‘క్రైమ్ సీన్ సెమినార్ హాల్‌లో ఉంది. దాన్నెవరూ ముట్టుకోలేదు’ అని ఎక్స్‌లో పోస్టు చేశారు. నిందితుడిని శిక్షించాలని బెంగాల్ వ్యాప్తంగా గత రాత్రి నుంచి భారీ నిరసనలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో <<13858551>>RG కర్ ఆస్పత్రిలో మూకలు విధ్వంసానికి<<>> పాల్పడ్డాయి.
ప్రస్తుతం నేలపై కూర్చుని తినేవారు తక్కువమందే ఉంటారు. కింద కూర్చుని తినడం వల్ల చాలా లాభాలున్నాయని నిపుణులు అంటున్నారు. కూర్చుని తినడం వల్ల కండరాల్లో కదలిక పెరిగి ఆరోగ్యంగా ఉంటారు. నేలపై ప్లేట్ పెట్టుకుని తింటే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. బాసింపట్టు వేసుకుని తినడం వల్ల శారీరక నొప్పులు దూరమవుతాయి. ఇలా చేయడం వల్ల బరువు కూడా తగ్గుతారు. అందరూ కలిసి కూర్చుని తింటే కుటుంబసభ్యుల మధ్య బంధాలు బలపడుతాయి.
బంగారు గనిని తవ్వేందుకు ఓ తెగ నాయకుడైన తంగలాన్(విక్రమ్) బ్రిటిష్ జనరల్‌తో ఒప్పందం చేసుకుంటారు. ఆ ప్రాంతానికి కాపలాగా ఉన్న మంత్రగత్తె(మాళవిక) వారి ప్రయత్నాలను అడ్డుకుంటూ ఉంటారు. ఈమెను ఎదిరించి బంగారు గనిని తవ్వారా? అనేది కథ. డీగ్లామర్ పాత్రల్లో విక్రమ్, మాళవిక నటన, విజువల్స్, BGM, రంజిత్ టేకింగ్, స్క్రీన్‌ప్లే, ఫైనల్ ట్విస్ట్ మూవీకి ప్లస్. స్లో నరేషన్, సాగదీత సీన్లు మైనస్.
రేటింగ్: 2.75/5
TG: రాష్ట్రంలోని SC, ST, BC, మైనారిటీ, సాధారణ గురుకులాల్లో 6వేలకు పైగా పోస్టులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 2023లో ఇచ్చిన నోటిఫికేషన్‌లో 1,800కుపైగా బ్యాక్‌లాగ్ ఖాళీలు ఉన్నట్లు అంచనా. డీఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీతోపాటు వివిధ విభాగాల్లో ఉన్న ఉద్యోగాలను 2025-26 జాబ్ క్యాలెండర్‌లో భర్తీ చేయనున్నట్లు సమాచారం. డీఎస్సీ, జేఎల్ నియామకాల తర్వాత మొత్తం ఖాళీలపై క్లారిటీ వస్తుందని అధికారులు చెబుతున్నారు.
ఝార్ఖండ్‌లోని సిమ్‌డేగా జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా హాకీ టోర్నమెంట్ నిర్వహిస్తుండగా భారీ వర్షం కురిసింది. ఆటగాళ్లు సమీపంలోని చెట్టుకిందకు వెళ్లగా పిడుగులు పడటంతో ముగ్గురు చనిపోయారు. మరో ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాల నిడివిలో ప్రధాని మోదీ తన రికార్డును తానే బద్దలుకొట్టారు. 2016లో 96 నిమిషాల పాటు ప్రసంగించగా నేడు 98 నిమిషాలతో దాన్ని దాటేశారు. ప్రధానిగా ఆయన స్పీచ్‌ల సగటు 82 నిమిషాలుగా ఉంది. మరే ప్రధానికి ఈ సగటు లేదు. అత్యల్పంగా 2017లో 56 నిమిషాల పాటు మాట్లాడారు. గత ఏడాది 90 మినిట్స్ ప్రసంగించారు.
Sorry, no posts matched your criteria.