News October 30, 2025

SEBIలో 110 పోస్టులు… నేటి నుంచే దరఖాస్తుల ఆహ్వానం

image

SEBI 110 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు నేటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. అర్హత గలవారు NOV 28 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి మాస్టర్ డిగ్రీ లేదా PG డిప్లొమా, LLB, BE, బీటెక్, CA, CFA, MCA, MSC(CS), MA( హిందీ/ ఇంగ్లిష్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఫేజ్ 1 రాత పరీక్ష JAN 10న, ఫేజ్ 2 రాత పరీక్ష FEB 21న నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ తేదీని తర్వాత ప్రకటిస్తారు. వెబ్‌సైట్: sebi.gov.in

News October 30, 2025

బాహుబలి టికెట్ల పేరుతో మోసాలు.. జాగ్రత్త!!

image

కొత్త సినిమా టికెట్లు ఉన్నాయంటూ SMలో కొందరు మోసాలు చేస్తున్నారు. తాజాగా ‘బాహుబలి ది ఎపిక్’ సినిమా ప్రీమియర్ టికెట్లు ఉన్నాయని, కావాలంటే మెసేజ్ చేయాలని ఓ వ్యక్తి(Heisenberg M) ట్వీట్ చేశాడు. ఇది నమ్మి డబ్బులు పంపి మోసపోయామని నెటిజన్లు చెబుతున్నారు. ఆ ఖిలాడి చెప్పిన 9391872952 నంబర్‌కు డబ్బులు పంపిన తర్వాత బ్లాక్ చేస్తున్నట్లు వాపోతున్నారు. పోలీసులు ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

News October 30, 2025

గాయంపై స్పందించిన శ్రేయస్ అయ్యర్

image

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో <<18117184>>తీవ్రంగా<<>> గాయపడటంపై టీమ్ ఇండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తొలిసారి స్పందించారు. ప్రస్తుతం తాను కోలుకుంటున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇలాంటి సమయంలో అభిమానులు మద్దతుగా నిలవడంపై సంతోషం వ్యక్తం చేశారు. అందుకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఆసీస్‌తో చివరి వన్డేలో క్యాచ్ పడుతూ శ్రేయస్ గాయపడ్డారు. దీంతో అతడికి ఐసీయూలో చికిత్స అందించారు.

News October 30, 2025

వంటింటి చిట్కాలు

image

* బత్తాయి, నారింజ పండ్లను మైక్రోఓవెన్‌లో కొన్ని సెకన్ల పాటు ఉంచితే తొక్క సులభంగా వస్తుంది.
* కాకరకాయ కూరలో సోంపు గింజలు లేదా బెల్లం వేస్తే కూర చేదు తగ్గుతుంది.
* అరటిపండ్లను ప్లాస్టిక్ డబ్బాలో వేసి ఫ్రిజ్‌లో పెడితే నల్లగా మారవు.
* ఐస్ క్యూబ్స్ వేసిన నీళ్లలో ఉడికించిన బంగాళదుంపలు వేసి, తర్వాత తొక్కలు తీస్తే సులువుగా వస్తాయి.
* పోపు గింజలు వేయించి నిల్వ చేస్తే పాడవకుండా ఉంటాయి.

News October 30, 2025

నేటి నుంచి టెన్త్ పరీక్షల ఫీజు స్వీకరణ

image

TG: టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫీజు స్వీకరణ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. విద్యార్థులు నవంబర్ 13 వరకు స్కూళ్ల HMలకు డబ్బు చెల్లించాలి. రూ.50 ఆలస్య రుసుముతో నవంబర్ 29 వరకు, రూ.200తో డిసెంబర్ 11, రూ.500 ఎక్స్‌ట్రా ఫీజుతో డిసెంబర్ 19 వరకు చెల్లించవచ్చు. కాగా ఇంటర్ ఎగ్జామ్స్ ముగిసిన తర్వాత మార్చి మూడో వారంలో పది పరీక్షలు జరిగే అవకాశం ఉంది.

News October 30, 2025

పంట నష్టం: నేటి నుంచి ఎన్యూమరేషన్

image

AP: మొంథా తుఫాను ధాటికి 1.23L హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. 1.38L మంది రైతులు నష్టపోయినట్లు గుర్తించారు. నేటి నుంచి క్షేత్రస్థాయిలో ఎన్యూమరేషన్(లెక్కింపు) నిర్వహించనున్నట్లు తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో 4,576KM మేర రోడ్లు, 302చోట్ల కల్వర్టులు, వంతెనలు ధ్వంసమైనట్లు నిర్ధారించారు. వీటికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని మంత్రి జనార్దన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

News October 30, 2025

కందిలో పచ్చదోమ – నివారణకు సూచనలు

image

వాతావరణంలో తేమ శాతం ఎక్కువ ఉన్నపుడు కందిలో పచ్చదోమ ఉద్ధృతి పెరుగుతుంది. పచ్చదోమ పురుగులు కంది ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీలుస్తాయి. దీంతో ఆకులు పసుపుపచ్చగా మారి ముడుచుకొని దోనె లాగా కనిపిస్తాయి. తీవ్రత పెరిగితే ఆకులు ఎర్రబడి రాలిపోయి.. మొక్కల ఎదుగుదల, దిగుబడి తగ్గుతుంది. పచ్చదోమ నివారణకు లీటరు నీటికి మోనోక్రోటోఫాస్‌ 36% S.L 1.6ml లేదా డైమిథోయేట్‌ 30%E.C 2.2ml కలిపి పిచికారీ చేయాలి.

News October 30, 2025

నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్

image

* ఆధార్‌లో పేరు, అడ్రస్, DOB, మొబైల్ నంబర్‌ను ఇంటి నుంచే అప్డేట్ చేసుకోవచ్చు. ఇందుకు ₹75 ఛార్జీ చెల్లించాలి. అయితే బయోమెట్రిక్ అప్డేట్ కోసం ఆధార్ కేంద్రానికి వెళ్లాలి. ఇందుకు ₹125 వసూలు చేస్తారు.
* బ్యాంక్ అకౌంట్స్, లాకర్స్, సేఫ్ కస్టడీ కోసం ఇకపై నలుగురు నామినీలను పెట్టుకోవచ్చు.
* SBI: థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా ఎడ్యుకేషన్ పేమెంట్లకు, రూ.1,000పైన వ్యాలెట్ రీఛార్జ్‌కు 1 శాతం ఫీజు వర్తిస్తుంది.

News October 30, 2025

అల్పపీడనంగా బలహీనపడిన ‘మొంథా’

image

మొంథా వాయుగుండం నుంచి అల్పపీడనంగా బలహీనపడినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ప్రస్తుతం దక్షిణ ఛత్తీస్‌గఢ్, విదర్భ మీదుగా కొనసాగుతోంది. ఇది తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్‌కు ఉత్తరంవైపు కొనసాగే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. రానున్న 24 గంటల్లో మరింత బలహీనపడే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. మరోవైపు అరేబియా సముద్రంలోని అల్పపీడనం ప్రభావంతో గుజరాత్, మహారాష్ట్రకు భారీ వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది.

News October 30, 2025

టీటీడీలో ఉద్యోగాలు

image

తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) 6 మెడికల్ పోస్టులను భర్తీ చేయనుంది. పీడియాట్రిక్ కార్డియోథొరాసిక్ సర్జన్, పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్, పీడియాట్రిక్ కార్డియాక్ అనస్థెటిస్ట్, పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్, పీడియాట్రిషియన్, డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. ఉద్యోగాన్ని బట్టి MBBS, MD, DNB, DRNB, MS, PGతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు NOV 1న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. వెబ్‌సైట్: tirumala.org/