News September 28, 2024
రేవంత్ ఇల్లు చెరువులోనే ఉంది: సబిత
TG: హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు చెరువులోనే ఉందని చెప్పారు. బాధితుల వద్దకు బుల్డోజర్లు వెళ్తే వాటికంటే ముందు తామే వస్తామన్నారు. బీఆర్ఎస్ భవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పార్టీ తరఫున బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బాధితులు ఏడుస్తుంటే రేవంత్ రాక్షసానందం పొందుతున్నట్లు అనిపిస్తోందన్నారు.
Similar News
News October 15, 2024
కోహ్లీ.. మరో 53 పరుగులు చేస్తే
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరో మైలురాయికి చేరువయ్యారు. రేపటి నుంచి న్యూజిలాండ్‌తో జరిగే టెస్టులో మరో 53 పరుగులు చేస్తే 9వేల పరుగుల మైలురాయిని పూర్తి చేసుకోనున్నారు. దీంతో భారత జట్టు తరఫున టెస్టుల్లో 9వేల పరుగులు చేసిన నాలుగో ప్లేయర్‌గా నిలవనున్నారు. ఈ లిస్టులో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ 15,921 పరుగులతో తొలి స్థానంలో ఉన్నారు. ఇప్పటివరకు 115 టెస్టులు ఆడిన కోహ్లీ 8,947 పరుగులు చేశారు.
News October 15, 2024
KTRపై కేసు నమోదు
TG: మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRపై ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పీఎస్‌లో కేసు నమోదైంది. మూసీ ప్రాజెక్టును రూ.1.5 లక్షల కోట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతోందని, అందులో రూ.25,000 కోట్లు ఢిల్లీకి పంపుతుందని ఆయన ఇటీవల వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్ నేత ఆత్రం సుగుణ ఫిర్యాదుతో BNS 352, 353(2), 356(2) చట్టాల కింద KTRపై పోలీసులు కేసు నమోదు చేశారు.
News October 15, 2024
కొండా సురేఖ ఫొటో మార్ఫింగ్.. ఇద్దరి అరెస్ట్
TG: మంత్రి కొండా సురేఖ, ఎంపీ రఘునందన్ రావు <<14234406>>ఫొటో మార్ఫింగ్ కేసులో<<>> ఇద్దరిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సురేఖ, రఘునందన్ ఎడిటెడ్ ఫొటోలు వైరల్ కావడంతో జరిగిన పరిణామాలు రాష్ట్రంలో పెద్ద సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఎంపీ ఫిర్యాదుతో నిజామాబాద్, జగిత్యాలకు చెందిన దేవన్న, మహేశ్‌లను అరెస్ట్ చేశారు.