India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: టెట్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఇవాళ సాయంత్రం వరకు 1,26,052 అప్లికేషన్లు వచ్చినట్లు విద్యాశాఖ తెలిపింది. నేటి నుంచి ఈ నెల 22 వరకు దరఖాస్తులు ఎడిట్ చేసుకునే అవకాశం కల్పించింది. మరోవైపు ఈ నెల 20తో దరఖాస్తు ప్రక్రియ ముగియనుండగా ఒక రోజు ముందే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. చివరి రోజు పెద్ద ఎత్తున అప్లికేషన్లు వస్తే సాంకేతిక సమస్య తలెత్తే అవకాశం ఉందంటున్నారు.
అంతరిక్ష ప్రయోగాల్లో ISRO-SpaceX మొదటి సారి చేతులు కలిపాయి. ఇస్రో కమ్యూనికేషన్ శాటిలైట్ GSAT-N2 ఉపగ్రహాన్ని ఫాల్కన్-9 రాకెట్ ద్వారా వచ్చే వారం ప్రయోగించనున్నారు. 3000 మీటర్ల ఎత్తులో ఉన్న విమానాల్లో సైతం ఇంటర్నెట్ సేవల్ని అందించడానికి ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపట్టింది. GSLV Mk3 రాకెట్ 4 వేల KGల బరువును మోయగలదు. GSAT-N2 4700 KGలు ఉండడంతో SpaceXతో ఇస్రో జట్టుకట్టింది.
సూర్య, శివ కాంబినేషన్లో తెరకెక్కిన పీరియాడికల్ ఫాంటసీ ఫిల్మ్ ‘కంగువా’. ఈ సినిమా థియేటర్లలో విడుదలైన రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.89.32 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు మూవీ యూనిట్ ట్వీట్ చేసింది. అభిమానుల నుంచి సినిమాకు అద్భుతమైన స్పందన వస్తోందని పేర్కొంది.
తెలుగు వారిపై వివాదాస్పద <<14525601>>వ్యాఖ్యలు<<>> చేసిన నటి కస్తూరి అరెస్టయ్యారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో చెన్నై పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆమె వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. దీంతో పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలించగా, హైదరాబాద్‌లో ఆచూకీ లభ్యమైంది. ఆమెను ప్రస్తుతం పోలీసులు చెన్నై తరలిస్తున్నారు.
జంతువులు, పక్షుల పెంపకం కొంతమందికి హాబీ. మరి కొంతమందికి అవసరం. కానీ కొందరికి మాత్రం అవి స్టేటస్ సింబల్. అందుకే కొన్ని పక్షులు, జంతువులు సామాన్యుడు కనీసం ఊహించలేని ధర పలుకుతుంటుంటాయి. వాటిలో కొన్ని చూస్తే..
టిబెటన్ మాస్టిఫ్: రూ.20 లక్షలు
సవానా పిల్లి: రూ.42 లక్షలు
హయాసింత్ మకావ్: రూ.40 లక్షలు
పామ్ కోకటూ: రూ. 17 లక్షల వరకు
కోయ్ చేపలు: రూ.1.5 లక్షలు
భారత స్టార్ ప్లేయర్లు గాయాలతో సతమతమవుతున్న నేపథ్యంలో ఇండియా-ఏ ఆటగాళ్లు సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్‌ను ఆస్ట్రేలియాలోనే ఉండమని BCCI కోరే అవకాశం ఉన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది. రేపు రాత్రి ఇండియా-A జట్టు ఆస్ట్రేలియా నుంచి బయలుదేరనుంది. BGTకి ముందు రాహుల్, గిల్‌కు గాయాలవ్వడం, రోహిత్ గైర్హాజరు వార్తల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొంది. దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశముంది.
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది నవ్వడమే మానేశారు. జోక్ వింటేనో, కామెడీ చూస్తేనో నవ్వుతున్నారు. రోజుకు 10 నిమిషాలైన నవ్వడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. నవ్వడం వల్ల గుండెకు వ్యాయామం జరిగి హార్ట్ ఎటాక్, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. నవ్వడంతో ఎండార్ఫిన్లు విడుదలై శరీరంలోని నొప్పులు తగ్గుతాయి. ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
AP: ఈ నెల 19, 20 తేదీల్లో చేపట్టాల్సిన నిరసనలను ఎంప్లాయీస్ యూనియన్ వాయిదా వేసుకుంది. RTC ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఇచ్చిన హామీతో ధర్నాలను వాయిదా వేస్తున్నట్లు EU పేర్కొంది. RTC ఉద్యోగుల అన్ని ప్రధాన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి ఈ సందర్భంగా ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు దామోదరరావుతో ఫోన్‌లో మాట్లాడారు.
మణిపుర్‌లో మళ్లీ కర్ఫ్యూ విధించారు. జిరిబమ్ ప్రాంతంలో మిలిటెంట్లు ఆరుగురు కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేసి హతమార్చారు. దీంతో ఆగ్రహించిన ప్రజలు రోడ్లపైకొచ్చి నిరసన చేపట్టారు. ఆస్తులను ధ్వంసం చేశారు. బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడించి దాడి చేశారు. హింసాత్మక ఘటనలు తీవ్రం కావడంతో ఏడు జిల్లాల్లో అధికారులు కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు.
AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని అంచనా వేసింది. అలాగే అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
Sorry, no posts matched your criteria.