News February 8, 2025
‘తండేల్’ సినిమా OTT విడుదల ఎప్పుడంటే?

చందూ మొండేటి తెరకెక్కించిన ‘తండేల్’ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘నెట్‌ఫ్లిక్స్’ దక్కించుకుంది. ఈ చిత్రాన్ని రూ.90 కోట్లతో రూపొందించడంతో ఓటీటీ హక్కుల కోసం భారీగానే చెల్లించినట్లు సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది. థియేటర్ రెస్పాన్స్ బాగుండటంతో ఈ చిత్రం 8 వారాల తర్వాతే ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. ‘తండేల్’లో నాగచైతన్య, సాయి పల్లవి మధ్య సాగే లవ్ స్టోరీ ఆకట్టుకుంటోంది.
Similar News
News March 24, 2025
పఠాన్ కామెంటరీపై నిషేధం..? కారణం అదేనా?

మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ గత ఏడాది IPLలో కామెంటరీతో అలరించారు. ఈ ఏడాది మాత్రం ఆయన జాడ లేదు. కామెంటరీ నుంచి ఆయన్ను నిషేధించడమే కారణమని సమాచారం. BCCI వర్గాల సమాచారం ప్రకారం.. గతంలో తనతో విభేదాలున్న ఆటగాళ్లపై ఆయన లైవ్ కామెంటరీలోనే పరోక్షంగా విమర్శలు లేదా కామెంట్లు చేస్తుండటం ప్రసారదారులకు ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆయన్ను కామెంటరీ కాంట్రాక్ట్ నుంచి మినహాయించినట్లు తెలుస్తోంది.
News March 24, 2025
P4 లక్ష్యం అదే: CBN

AP: సంపన్నులు-పేదలను ఒకేచోటకు చేర్చడమే P4 లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ పథకాన్ని ఉగాది రోజున అమరావతిలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. మొదటి దశలో 20 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. రాష్ట్రంలో 2029 కల్లా పేదరికాన్ని నిర్మూలించాలనేది తమ సంకల్పమని నొక్కి చెప్పారు. లబ్ధి పొందేవారిని బంగారు కుటుంబంగా, సాయం పొందేవారిని మార్గదర్శిగా పిలవాలని సూచించారు.
News March 24, 2025
మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు: ఏసర్ ఇండియా

తమ సంస్థలోని మహిళా ఉద్యోగులకు నెలసరి సమయంలో ఓ పెయిడ్ లీవ్ ఇవ్వనున్నట్లు ఏసర్ ఇండియా వెల్లడించింది. మాతృక పేరిట ప్రతి నెలా ఈ సెలవును అందిస్తామని తెలిపింది. మహిళల ఆరోగ్యం, శ్రేయస్సుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొంది. L&T, స్విగ్గీ, జొమాటో కూడా ఈ తరహా లీవ్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. బిహార్, ఒడిశా, సిక్కిం, కేరళ ప్రభుత్వాలు సైతం ఈ సెలవును అమలు చేస్తున్నాయి.