News November 16, 2024

AP అసెంబ్లీ న్యూస్ రౌండప్

image

* టిడ్కో ఇళ్ల అక్రమాలపై విచారణ జరిపించాలి: MLAలు
* 2019కల్లా 313832 ఇళ్లు 90శాతం పూర్తి: GV ఆంజనేయులు
* టిడ్కో ఇళ్లను YCP నేతలు అమ్ముకున్నారు: పల్లా
* సోషల్ మీడియా సైకోలను శిక్షించాలి: గౌతు శిరీష
* తుంగభద్ర గేట్లు మార్చేందుకు నిధులు కేటాయించాలి: కాలవ శ్రీనివాసులు
* మల్లవల్లి పారిశ్రామిక వాడకు భూములు కేటాయించాలి: యార్లగడ్డ
* వెలిగొండపై YCP సినిమా స్టైల్ ప్రచారం: ఉగ్ర నరసింహారెడ్డి

News November 16, 2024

‘మేడిన్ ఇండియా’కు రెస్పెక్ట్ పెరిగింది: వేదాంత ఫౌండర్

image

భారత్‌‌కు, భారతీయులకు, భారతీయ ఉత్పత్తులకు ప్రపంచంలో అత్యధిక డిమాండ్ ఏర్పడిందని వేదాంత ఫౌండర్ అనిల్ అగర్వాల్ అన్నారు. మన దేశం ఈ పరిస్థితికి చేరిన విధానం ఇతర దేశాలు అనుసరించేందుకు ఒక మోడల్‌గా మారిందన్నారు. భారతీయ ప్రతిభావంతులకు ఉద్యోగాలిచ్చేందుకు కంపెనీలు వెంటపడుతున్నాయని తెలిపారు. ‘మేడిన్ ఇండియా’ లేబుల్‌కు ఇప్పుడు గౌరవం పెరిగిందని, దేశంలో అవకాశాలను పెంచిందని HTLS 2024లో వెల్లడించారు.

News November 16, 2024

ఏఆర్ రెహమాన్‌కు ఐఐటీ మద్రాస్ అవార్డు

image

సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌కు ఎక్స్‌పీరియెన్షియల్ టెక్నాలజీ ఇన్నోవేషన్ సెంటర్(XTIC) పురస్కారాన్ని మద్రాస్ ఐఐటీ ప్రకటించింది. వర్చువల్ రియాలిటీ సినిమా ‘లే మస్క్’కు పనిచేసినందుకు గాను ఆయనకు ఈ అవార్డు ఇస్తున్నట్లు తెలిపింది. రేపు జరిగే ‘XR’ సదస్సులో ఈ అవార్డును ఆయనకు అందిస్తామని వెల్లడించింది.

News November 16, 2024

నెలలో నారా రోహిత్ పెళ్లి.. ఈలోగా తండ్రి రామ్మూర్తి మరణం

image

AP: చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు TDP తరఫున 1994లో గల్లా అరుణపై చంద్రగిరి MLAగా గెలిచారు. 1999లో ఆమెపైనే ఓడిపోయారు. అనంతరం ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. చంద్రబాబు, రామ్మూర్తి మధ్య ప్రత్యేక అనుబంధం ఉంది. అప్పట్లోనే తన తమ్ముడికి MLA టికెట్ ఇప్పించుకుని గెలిపించుకున్నారు. రామ్మూర్తికి భార్య ఇందిర, కుమారులు రోహిత్, గిరీశ్ ఉన్నారు. రోహిత్ పెళ్లి సరిగ్గా నెల రోజులు ఉందనగా ఆయన మరణించారు.

News November 16, 2024

మెట్రో రెండో దశ భూసేకరణకు ఆమోదం

image

TG: మెట్రో రైల్ సెకండ్ ఫేజ్ నిర్మాణానికి ముందడుగు పడింది. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణ గుట్ట వరకు మెట్రో నిర్మాణానికి భూసేకరణకు కలెక్టర్ ఆమోదం తెలిపారు. దీంతో భూసేకరణ పనులు ప్రారంభం కానున్నాయి. సీఎం ఆదేశాలతో ఇప్పటికే ఈ మార్గంలోని 200లకు పైగా ఆస్తులకు డిక్లరేషన్ ఇచ్చారు. ఆస్తుల సేకరణ పూర్తయ్యాక డిసెంబర్‌లో అవార్డు ఆమోదం పొందుతుంది. జనవరిలో మెట్రో రైలు పనులు ప్రారంభమవుతాయని కలెక్టర్ పేర్కొన్నారు.

News November 16, 2024

‘ఆరెంజ్’ మూవీ హీరోయిన్‌ ఎంగేజ్మెంట్

image

తనకు ఎంగేజ్మెంట్ జరిగినట్లు హీరోయిన్ షాజన్ పదమ్సీ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. తన ప్రియుడు, బిజినెస్‌మెన్ ఆశిష్ కనాకియాతో ఆమె వివాహం జరగనుంది. కాగా, కొత్త జీవితంలోకి అడుగుపెట్టేందుకు ఆగలేకపోతున్నానంటూ కాబేయే భర్తతో ఉన్న ఫొటోలను ఆమె పంచుకున్నారు. రామ్ చరణ్ నటించిన ‘ఆరెంజ్’ మూవీతో షాజన్ గుర్తింపు తెచ్చుకున్నారు. ‘మసాలా’ మూవీలోనూ ఆమె నటించారు.

News November 16, 2024

గ్రూప్-3 పరీక్షలు.. అభ్యర్థులకు ALERT

image

TG: రేపటి నుంచి రెండు రోజుల పాటు <<14624157>>గ్రూప్-3 పరీక్షలు<<>> జరగనున్నాయి. ఎగ్జామ్ రాసే అభ్యర్థులు తమ వెంట తప్పనిసరిగా ఒరిజినల్ గుర్తింపు కార్డు తీసుకెళ్లాలి. డూప్లికేట్ హాల్ టికెట్ జారీ చేయరు. తుది ఎంపిక పూర్తయ్యే వరకు హాల్ టికెట్స్, ప్రశ్నపత్రాలను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. తప్పుడు గుర్తింపు పత్రాలతో, అభ్యర్థి స్థానంలో ఇతరులు హాజరైనా క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు.

News November 16, 2024

ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగిసిన జైపాల్ యాదవ్ విచారణ

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ విచారణ ముగిసింది. జూబ్లీహిల్స్ ఏసీపీ ఆయనను విచారించారు. దాదాపు 2 గంటలకు పైగా విచారణ సాగింది. ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానని, ఎప్పుడు విచారణకు పిలిచినా సహకరిస్తానని జైపాల్ తెలిపారు. కాగా ఇప్పటికే ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను పోలీసులు విచారించారు.

News November 16, 2024

కానిస్టేబుల్ ఉద్యోగాలు.. వారికి శుభవార్త

image

AP: పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల ఎంపికలో హోంగార్డులకు భారీ ఊరట లభించింది. తమను ప్రత్యేక కేటగిరీగా పరిగణించేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ హోంగార్డులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో రిజర్వేషన్లతో సంబంధం లేకుండా వారికి దేహదారుఢ్య, తుది రాత పరీక్షలకు అనుమతించాలని APSLPRBని కోర్టు ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది.

News November 16, 2024

ఎంపీ అవినాశ్ పీఏ అరెస్ట్‌కు రంగం సిద్ధం?

image

AP: సోషల్ మీడియా పోస్టుల విషయంలో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి ఇంటికి పోలీసులు 41-A నోటీసులు అంటించారు. విచారణకు రావాలని పేర్కొంటూ నోటీసులిచ్చేందుకు వెళ్లగా ఆయన అందుబాటులో లేనట్లు తెలుస్తోంది. మరోవైపు ముందస్తు బెయిల్ కోసం రాఘవరెడ్డి కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. వర్రా రవీంద్రా రెడ్డి కేసులో ఇప్పటికే సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డి, వివేక్‌లకు నోటీసులు జారీ చేశారు.