India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: బాలింతలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్టీఆర్ బేబీ కిట్స్ పథకాన్ని మళ్లీ ప్రారంభించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో ఫీడర్ అంబులెన్సులు, సాధారణ అంబులెన్సుల మధ్య అనుసంధానం పెంచాలన్నారు. డోలీతో గర్భిణులు, బాలింతలను మోసుకొస్తున్న దృశ్యాలు కనిపించకూడదని స్పష్టం చేశారు. కాగా బేబీ కిట్‌లో చిన్న పరుపు, శానిటైజర్, సోప్, పౌడర్, దోమతెర, న్యాప్‌కిన్లు ఉంటాయి.
భారతదేశ సంస్కృతిలో భాగమైన భరతనాట్యం విదేశాలకు విస్తరిస్తోంది. చైనాకు చెందిన బాలిక లీ ముజి(13) భరతనాట్యంలో అరంగేట్రం చేశారు. చైనాలోనే శిక్షణ పొంది, అక్కడే అరంగేట్రం చేసిన తొలి యువతిగా చరిత్ర సృష్టించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ భరతనాట్య కళాకారిణి లీలా శాంసన్ హాజరయ్యారు. 1999లో ఢిల్లీలో అరంగేట్రం చేసిన జిన్ షాన్ ఆ చిన్నారికి గురువుగా వ్యవహరించారు. ఈమె చైనాలో భరతనాట్యం స్కూల్ నడుపుతున్నారు.
భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్‌కు దక్కాల్సిన పతకంపై నేడు కాస్ (కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్) తీర్పు వెలువరించనుంది. తీర్పు ఆమెకు అనుకూలంగా వస్తుందా? వ్యతిరేకంగా వస్తుందా అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు చేరిన వినేశ్ 100 గ్రా. బరువు అదనంగా ఉందని అనర్హత వేటు వేశారు. అయితే తనకు సిల్వర్ మెడల్ అయినా ఇవ్వాలని ఆమె కాస్‌ను ఆశ్రయించారు.
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాలనుకునే వారి కోసం దేశంలో ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహించనున్నారు. ఈ నెల 16 నుంచి 26 వరకు ఈ ఫెయిర్ కొనసాగుతుంది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, ఢిల్లీ, పుణే, ముంబైలో వీటిని ఏర్పాటు చేస్తారు. 80కిపైగా వర్సిటీలు, కాలేజీల ప్రతినిధులు ఈ ఫెయిర్‌లో అందుబాటులో ఉంటారు. ప్రవేశం ఉచితం కాగా రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలి.
NIRF (నేషనల్ ఇనిస్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్) ప్రకటించిన ర్యాంకుల్లో రాష్ట్రంలోని యూనివర్సిటీల ర్యాంకులు పతనమయ్యాయి. యూనివర్సిటీ కేటగిరిలో 2019లో AU 16వ స్థానంలో ఉండగా ఇప్పుడు 25వ స్థానానికి పడిపోయింది. SVU 48వ స్థానంలో ఉండగా 87వ స్థానానికి పడిపోయింది. ANU (59) మాత్రం టాప్100లోకి దూసుకొచ్చింది. ఓవరాల్ కేటగిరీలో ఏయూ గతేడాది 76లో ఉండగా ఇప్పుడు 41, ఏఎన్‌యూ 97వ ర్యాంకులోకి వచ్చింది.
AP: వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్న ఘటనలు పెరిగిపోవడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1912 నంబర్‌కు కాల్ చేస్తే కనెక్షన్‌ను మంజూరు చేసే పద్ధతిని తీసుకొచ్చింది. తొలుత APEPDCL పరిధిలో శ్రీకారం చుట్టింది. త్వరలో రాష్ట్రమంతా అమలు చేయనుంది. ఆ నంబర్‌కు కాల్ చేసి భూమి ఖాతా సంఖ్య, సర్వే నంబర్ చెబితే వెబ్‌ల్యాండ్‌లో వివరాలను సరిచూసి రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తారు.
తెలంగాణలో మరో 2 రోజులు వర్షాలు కొనసాగుతాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, హనుమకొండ, జనగాం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో నేడు మోస్తరు వానలు కురుస్తాయని APSDMA తెలిపింది.
ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో గాజాలోని మొత్తం జనాభాలో 1.8 శాతం మంది మరణించారు. వీరిలో 75 శాతం మంది 30 ఏళ్లలోపు వారే. అలాగే 16,456 మంది చిన్నారులు మృతి చెందారు. 11,088 మంది మహిళలు, 885 మంది వైద్య సిబ్బంది, 168 మంది జర్నలిస్టులు, 79 మంది సౌర రక్షణ సిబ్బంది ఉన్నారు. మొత్తం 3,486 సార్లు దాడి చేయగా 39,897 మంది చనిపోగా, 92,152 మంది గాయపడ్డారని పాలస్తీనా సెంట్రల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ డేటా పేర్కొంది.
TG: సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 15న ఖమ్మం పర్యటనకు వెళ్లనున్నారు. జిల్లాలోని సీతారామ ప్రాజెక్టును ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం వైరాలో జరిగే బహిరంగసభలో పాల్గొననున్నారు. అక్కడే రూ.2 లక్షల రుణమాఫీపై ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న రేవంత్ రేపు హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.
AP: ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల కోటా MLC ఎన్నికపై TDP పోటీ చేస్తుందా లేదా అన్నది CM చంద్రబాబు ఇవాళ నిర్ణయించనున్నారు. ఒకవేళ పోటీ చేస్తే TDP అభ్యర్థిగా బైరా దిలీప్ చక్రవర్తి బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. మాజీ MLAలు పీలా గోవింద్, గండి బాబ్జీ పేర్లు తెరపైకి వచ్చినా దిలీప్ అభ్యర్థిత్వంపైనే పార్టీ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. కాగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో అనకాపల్లి టికెట్ ఆశించి ఆయన భంగపడ్డారు.
Sorry, no posts matched your criteria.