News November 14, 2024

ప్రపంచంలోనే అత్యంత చిన్న పిల్లులివే!

image

పిల్లులను పెంచుకునేందుకు ప్రజలు మొగ్గుచూపుతున్నారు. ఇవి ఇంట్లోవారితో ఫ్రెండ్లీగా ఉంటుంటాయి. అయితే చేతిలో ఇమిడిపోయేటంతటి పిల్లులూ ఒకప్పుడు ఉన్నాయి. ఇల్లినాయిస్‌కు చెందిన టింకర్ టాయ్ అనే పిల్లి 2.75 అంగుళాల ఎత్తు, 7.5 అంగుళాల పొడవు మాత్రమే ఉండేది. మిస్టర్ పీబల్స్(ఇల్లినాయిస్) పిల్లి 3.1 పౌండ్లు, 6.1 అంగుళాల పొడవు మాత్రమే. ఈ రెండు అత్యంత చిన్న పిల్లులుగా గిన్నిస్ రికార్డుల్లో చోటు దక్కించుకున్నాయి.

News November 14, 2024

గ్రూప్-4 రిజల్ట్స్ ఇవ్వాల్సిందే.. అభ్యర్థుల డిమాండ్

image

TG: గ్రూప్-4లో అన్‌విల్లింగ్ ఆప్షన్ ఇవ్వకుండా ఫలితాలు విడుదల చేయొద్దని కొందరు అభ్యర్థులు డిమాండ్ చేస్తుండగా మరికొందరు వెంటనే రిజల్ట్స్ ఇవ్వాలని కోరుతున్నారు. అన్‌విల్లింగ్ ఆప్షన్ ఇస్తే ఫలితాలు ఆలస్యం అవుతాయని, అది కోరేవారు కొంతమందే ఉన్నారని చెబుతున్నారు. రెండేళ్లుగా రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నామంటున్నారు. ఇప్పటికే ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని, ఫలితాలు ఇవ్వాల్సిందేనని TGPSCని కోరుతున్నారు.

News November 14, 2024

సింగర్ రాజు ఎందరికో స్ఫూర్తి: సజ్జనార్

image

ఆర్టీసీ బస్సులో పాట పాడి వైరలయిన <<14578057>>దివ్యాంగ సింగర్‌<<>>ను TGSRTC ఎండీ సజ్జనార్ కలిసి అభినందించారు. ‘దృఢమైన సంకల్పం, సాధించాలనే పట్టుదల ఉంటే వైకల్యం ఏ మాత్రం అడ్డుకాదని గాయకుడు రాజు నిరూపిస్తున్నారు. మధురమైన గాత్రమే కాదు.. పాట‌కు అనుగుణంగా ఎలాంటి వాయిద్యాల్లేకుండా త‌న చేతులు, కాళ్ల‌తో సంగీతాన్ని అందిస్తోన్న ఈయన ప్రతిభ అద్భుతం. ఎంతో మంది యువతకు రాజు ఆదర్శనీయం, స్ఫూర్తిదాయకం’ అని పేర్కొన్నారు.

News November 14, 2024

7 ఓవర్ల మ్యాచ్‌.. పాక్ బోల్తా

image

ఆస్ట్రేలియా, పాకిస్థాన్ మధ్య తొలి T20ని వర్షం కారణంగా 7 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన AUS 93 రన్స్ చేసింది. మ్యాక్స్‌వెల్ 3 సిక్సర్లు, 5 ఫోర్లతో 19 బంతుల్లోనే 43 రన్స్‌తో విధ్వంసం సృష్టించారు. 94 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన PAK జట్టులో ఫర్హాన్(8), రిజ్వాన్(0), బాబర్(3), ఉస్మాన్(4), సల్మాన్(4), ఇర్ఫాన్(0) అట్టర్ ఫ్లాప్ అయ్యారు. దీంతో PAK 64 రన్స్‌కే పరిమితమైంది.

News November 14, 2024

చిన్న పురుగే అనుకుంటే..!

image

సాలెపురుగు నన్నేమి చేస్తుంది అని ఎప్పుడైనా అనుకున్నారా? భూమిపై ఉన్న ఏ జీవినీ తక్కువ అంచనా వేయకూడదని సైంటిస్టులు హెచ్చరించారు. ఎందుకంటే సాలీడు జాతంతా తలుచుకుంటే ప్రపంచంలో ఉన్న 700 కోట్ల మందిని ఒక్కఏడాదిలో తినేస్తాయని సైన్స్ ఆఫ్ నేచర్ జర్నల్‌లో ప్రచురించారు. సాలీడులు ఏడాదికి సుమారు 400 మిలియన్ టన్నుల ఆహారాన్ని తీసుకుంటాయి. మొత్తం ప్రజల బయోమాస్ కేవలం 287 మిలియన్ టన్నులేనని అందులో రాసుకొచ్చారు.

News November 14, 2024

నన్ను కమిట్‌మెంట్ అడిగారు: హీరోయిన్

image

ఊరు పేరు భైరవకోన, డబుల్ ఇస్మార్ట్, విశ్వం తదితర సినిమాలతో హీరోయిన్ కావ్యా థాపర్ టాలీవుడ్‌లో దూసుకెళ్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకెదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు. ‘కెరీర్ తొలి రోజుల్లో ఓ యాడ్ ఆడిషన్స్‌కి వెళ్లాను. అక్కడున్న ఓ వ్యక్తి 4 యాడ్స్‌లో అవకాశాలిప్పిస్తానని, కమిట్మెంట్ ఇవ్వాలని అన్నాడు. నాకు చాలా కోపం వచ్చింది. ఇలాంటివి నాకు నచ్చవని మొహమ్మీదే చెప్పి బయటికొచ్చేశాను’ అని తెలిపారు.

News November 14, 2024

Stock Market: 7% పెరిగిన ఐష‌ర్ మోటార్స్‌

image

Q2 ఫలితాలు 8%(YoY) అధికంగా రాబట్టడంతో రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ పేరెంట్ సంస్థ ఐష‌ర్ మోటార్స్ షేరు గురువారం సెషన్‌లో 7% వరకు పెరిగింది. Hero Motoco 2%, Grasim 1.24%, Kotak Bank 1.23%, Hdfc Life 1.20% లాభపడి టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. HindUnilvr 2.92%, BPCL 2.50%, Britannia 2.47%, Tata Consum 2.35%, Nestle Ind 2.11% న‌ష్ట‌పోయి టాప్ లూజ‌ర్స్‌గా నిలిచాయి. మీడియా, బ్యాంకు, ఆటో, ఫైనాన్స్ రంగ షేర్లు లాభపడ్డాయి.

News November 14, 2024

WOW: ఇది ప్రభుత్వ పాఠశాలే..!

image

దేశ రాజధాని ఢిల్లీలో అతి పెద్ద ప్రభుత్వ పాఠశాలను సీఎం ఆతిశీ ఇవాళ ప్రారంభించారు. సుందరి నగర్‌లో ఈ స్కూల్‌ను సరికొత్త హంగులతో అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించారు. మూడంతస్తుల్లో 131 గదులు, 7 ల్యాబ్‌లు, లైబ్రరీ, కాన్ఫరెన్స్ హాల్, యోగా రూమ్, లిఫ్ట్, టాయిలెట్ల బ్లాక్ తదితర సౌకర్యాలతో నిర్మించారు. ఇందులో దాదాపు 7 వేల మంది విద్యార్థులు చదువుకోవచ్చు. ప్రస్తుతం ఈ స్కూల్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది.

News November 14, 2024

కేటీఆర్ గురించి నేనేం చెప్పలేదు: పట్నం నరేందర్ రెడ్డి

image

TG: తన పేరుతో పోలీసులు ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్ తప్పని BRS మాజీ MLA పట్నం నరేందర్ రెడ్డి జైలు నుంచి లేఖ రాశారు. ఆ రిపోర్టులో ఏముందో కూడా తనకు తెలియదన్నారు. ‘లగచర్ల కేసు, KTR గురించి నేనేమీ చెప్పలేదు. పోలీసులు నా నుంచి స్టేట్‌మెంట్ తీసుకోలేదు. నా అడ్వకేట్ అడిగితే ఈ రిపోర్టును ఇచ్చారు. దీనితో నాకేం సంబంధం లేదు’ అని ఆయన లేఖలో పేర్కొన్నారు. కాగా వికారాబాద్ కోర్టులో నరేందర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

News November 14, 2024

నరేందర్ రెడ్డిని కస్టడీకి కోరిన పోలీసులు.. సోమవారం విచారణ

image

TG: కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఏడు రోజులు కస్టడీకి ఇవ్వాలని వికారాబాద్ కోర్టును కోరారు. మరోవైపు తనకు బెయిల్ కోరుతూ నరేందర్ రెడ్డి అదే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై కోర్టు సోమవారం విచారణ జరపనుంది. లగచర్ల కేసులో A-1గా ఉన్న ఈ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.